31, ఆగస్టు 2010, మంగళవారం

సమస్యా పూరణం - 82

కవి మిత్రులారా,
ఈ రోజు పూరించ వలసిన సమస్య ఇది ....
అమెరికాలోన లభియించె నావకాయ.

30, ఆగస్టు 2010, సోమవారం

సమస్యా పూరణం - 81

కవి మిత్రులారా,
ఈ రోజు పూరించ వలసిన సమస్య ఇది ....
గర్భమునందున్న పులియె గాండ్రించె నయో!

29, ఆగస్టు 2010, ఆదివారం

సమస్యా పూరణం - 80

కవి మిత్రులారా,
ఈ రోజు పూరించ వలసిన సమస్య ఇది ....
బాసు భళి యటంచు ప్రణతుఁ డయ్యె.

గళ్ళ నుడికట్టు - 48


అడ్డం
1. ఆవిడ వాడి గృహిణి తమ్ముడూ! పెండ్లి కాలేదనకు (4)
3. అనుకూలంగా కలుషములు కడిగే నది (4)
7. నావికుడి చూపు ఈ వైపే (2)
8। బావి కడ వదలి వచ్చావా నీళ్ళు తెచ్చేది (3)
9. చచ్చేముందైనా దేవుడి పేరులో సగమైనా పలికిద్దామని నార చూపించి ఇదేమని అడిగితే ఆ నాస్తికుడేమన్నాడు? (2)
12. ఇక్కడి గురుతులు నీళ్ళు ఇంకి, ఆవిరైన చర్యను సూచిస్తున్నాయి. చిగురులో ఒక హల్లును తొలగించండి (3)
13. విడుదల కోసము యథాశక్తి పోరాడితే లభించింది (3)
17. ఈ పోస్ట్ శీర్షికలోని మాట (2)
18. ప్రతిసారి భీమన చేసే శపథం (3)
19. చేకూరి రామారావు పొట్టివాడయ్యాడు (2)
22. ఏ పనిని ముట్టుకోవాలన్నా సాధనం కావాలి (4)
23. పార్వతి. దక్షుని కూతురా? (4)
నిలువు
1. అల్లుని తండ్రైనా, కోడలు తండ్రైనా ఇతడే (4)
2. తోక తెగిన మంచును తిరగేస్తే భూమి (2)
4. ఆలంబనంలో దీర్ఘం, విశాలం, 90 డిగ్రీలు (2)
5. జిహ్వ గ్రహించేవి ఆరు (4)
6. పడతుక (3)
10. రోత. చికిత్సలా ధ్వనిస్తుంది (3)
11. బొమిక (3)
14. కంటిలోని పసిబిడ్డ (4)
15. దూతకు స్త్రీలింగం (3)
16. అడ్డం 23 లోని ఆవిడే. "శరణ్యే త్ర్యంబకే దేవి ......... నమోస్తు తే" (4)
20. లిస్టులో మీరు లేరా? ఉన్నామని చెప్పకండి (2)
21. క్షాతలమంతా నిండిన కరువు తలక్రిందయింది

28, ఆగస్టు 2010, శనివారం

సమస్యా పూరణం - 79

కవి మిత్రులారా,
ఈ రోజు పూరించ వలసిన సమస్య ఇది ....
రావణుఁడు సీత మగఁడయి రక్ష సేయు.

వారాంతపు సమస్యా పూరణం - 6

తల్లిని చంపియున్ సుతుఁడు తండ్రి పదంబుల వ్రాలె భక్తితోన్.

27, ఆగస్టు 2010, శుక్రవారం

సమస్యా పూరణం - 78

కవి మిత్రులారా,
ఈ రోజు పూరించ వలసిన సమస్య ఇది ....
అర్ధరాత్రి సూరుఁ డస్తమించె.

వారాంతపు సమస్యా పూరణం - 6

తల్లిని చంపియున్ సుతుఁడు తండ్రి పదంబుల వ్రాలె భక్తితోన్.

గళ్ళ నుడికట్టు - 47


అడ్డం
1. రసరాజం. మెర్క్యురీ (4)
3. మధుమక్షిక. బీ (4)
7. కడుపు (2)
7. కరుణ లేనిది (3)
9. జాతరకు ప్రకృతి తిరగబడింది (2)
12. మిక్కిలి ప్రసిద్ధి కెక్కింది (3)
13. గర్భిణీ స్త్రీలకు వచ్చే వాంతులు (3)
17. వేషగాళ్ళు, వాద్యగాళ్ళ సమ్మేళనం తిరగబడింది (2)
18. సముద్రం (3)
19. పశువుల సమూహం (2)
22. హితోపదేశ మనే పంచతంత్ర కథల సృష్టికర్త (4)
23. నీరజనేత్ర! పద్మాక్ష! (4)
నిలువు
1. పాపి (4)
2. మణి, శ్రేష్టం (2)
4. గెలుచు (వ్యవహారార్థం), నిర్వహిందు (నైఘంటికార్థం) (2)
5. కాల సూచిక. క్లాక్ (4)
6. గాడిద (3)
10. కామెంటరీ (3)
11. ఇంగ్లీషు రంపంతో మొదలై, ఇంగ్లీషు మూడుతో అంతమయ్యే నటి (3)
14. కీ (4)
15. బంగార"ము" (3)
16. చెప్పు (4)
20. కోరిక, దిక్కు (2)
21. మట్టి తోడే పనిముట్టు (2)

26, ఆగస్టు 2010, గురువారం

సమస్యా పూరణం - 77

కవి మిత్రులారా,
ఈ రోజు పూరించ వలసిన సమస్య ఇది ....
వరలక్ష్మీ వ్రతముఁ జేసె వహిదా రెహమాన్.

వారాంతపు సమస్యా పూరణం - 6
తల్లిని చంపియున్ సుతుఁడు తండ్రి పదంబుల వ్రాలె భక్తితోన్.

25, ఆగస్టు 2010, బుధవారం

సమస్యా పూరణం - 76

కవి మిత్రులారా,
ఈ రోజు పూరించ వలసిన సమస్య ఇది ....
అమ్మా రమ్మనుచు పిలిచె నాలిన్ పతియే.

వారాంతపు సమస్యా పూరణం - 6
తల్లిని చంపియున్ సుతుఁడు తండ్రి పదంబుల వ్రాలె భక్తితోన్.

24, ఆగస్టు 2010, మంగళవారం

సమస్యా పూరణం - 75

కవి మిత్రులారా,
ఈ రోజు పూరించ వలసిన సమస్య ఇది ....
పురుషుఁడు ప్రసవించెఁ బుణ్యతిథిని.

గళ్ళ నుడికట్టు - 46


అడ్డం
1. తక్షకుడు కాటు వేసిన పాండవ వారసుడు. పరీక్షలో చిత్తవుతాడా? (4)
3. హనుమాన్ చలీసా రాసిన హిందీ కవి (4)
7. ఒక వంటపాత్ర. గిన్నియ రూపాంతరం (2)
8. సన్యాసి, బిచ్చగాడు (3)
9. పోతారా అంటే ఉహూఁ అంటారు (2)
12. కూర్చడం, జతచేయడం, సంధించడం (3)
13. విశేషంగా ద్రోహం చేసేవాడు (3)
17. అశ్వత్థం. రాచకొండ విశ్వనాథ (2)
18. కొట్టడం, తాడించడం (3)
19. నూరు (2)
22. ఉన్నదున్నట్లు అట్నుంచి (4)
23. తొట్రుపాటు. బడతడు సవరించు (4)
నిలువు
1. ఇతరుల అభిప్రాయం. పతంగి ఎగిరేందుకు కావాలా? (4)
2. శీఘ్రం, వేగవంతం. ప్రదక్షిణలో (2)
4. బహిర్గతం. గుట్టు చివర కయ్యేది (2)
5. కుచేలుడు. మంచి ఇల్లు గలవాడా?
6. ముక్కంటి (3)
10. విధం. చెప్పడం వృధా, వినం (3)
11. గుండెజబ్బు (3)
14. ఆకాశం. చుక్కల దారి (4)
15. బాధ, ఒత్తిడి (3)
16. వేదం చదివినవాడు, ఛందస్సు తెలిసినవాడు, చాదస్తం కలవాడు (4)
20. బెల్ట్ బాంబు ధరించిన రాజీవ్ గాంధీ హంతకురాలు క్రిందినుండి (2)
21. కుడ్యం

23, ఆగస్టు 2010, సోమవారం

వారాంతపు సమస్యా పూరణం - 6

కవి మిత్రులారా,
ఈ వారాంతానికి పూరించ వలసిన సమస్య ఇది ....
తల్లిని చంపియున్ సుతుఁడు తండ్రి పదంబుల వ్రాలె భక్తితోన్.

సమస్యా పూరణం - 74

కవి మిత్రులారా,
ఈ రోజు పూరించ వలసిన సమస్య ఇది ....
మేఘుఁ డర్జునునకు మేనమామ.

21, ఆగస్టు 2010, శనివారం

సమస్యా పూరణం - 73

కవి మిత్రులారా,
ఈ రోజు పూరించ వలసిన సమస్య ఇది .......
రాముఁడు ముదమున ఖురాను చదివె.
వారాంతపు సమస్యా పూరణం - 5 ( చివరి రోజు )
రామునిఁ జంపి హర్షమున రాక్షసు లెల్లరు నాట్యమాడిరే.

గళ్ళ నుడికట్టు - 45


అడ్డం
1. అడవి మొల్లచెట్టు, మంచిమనుషులు చిత్రంలో నాగభూషణం భార్యగా నటించిన నటి అస్తవ్యస్తంగా (3)
4. మనవి, విజ్ఞాపనం (3)
6. మాతాపితలు (5)
7. సంపద కలది, గర్భిణులకు చేసే ఉత్సవం (3)
9. పద్మం. వనరుహం, నీరజం (3)
11. వెడల్పు మూతి గల నీటిపాత్ర. కొప్పు ఎరవేస్తే తెలుస్తుందా? (3)
13. క్రూరుడు. కూసింత కళను పోషించమంటాడు (2)
14. లేదు సంస్కృతంలో (2)
15. పిలనగ్రోవి (3)
16. వాంఛ. నరుడా! ఏమి నీ ...... ? (3)
18. పుకారు. వట్టిదంటే తిడతావు (3)
20. బాలవ్యాకరణం, నీతి చంద్రిక వ్రాసిన పండితుడు (5)
22. పిలిచి చిలిపిగా చూస్తే అస్తవ్యస్తమయింది (3)
23. నీచం, అల్పం. ఒకని కాష్ఠంలో వెదకండి (3)
నిలువు
1. సరస్వతి, లక్ష్మి కలిస్తే ఒకప్పటి హీరోయిన్ (3)
2. ఎల్లప్పుడు. సంతసం సాంతం (3)
3. సమూహం. బృందావనంలో (2)
4. ధర. విడిచిన వలువలో (3)
5. అడ్డం 9 లోనిదే. బురదలోంచి పుట్టింది (3)
8. పానకాల స్వామి కొలువున్న క్షేత్రం (5)
10. కన్నులకు మోదం (5)
11. కొట్టండి అంటే పశువుల్ని కట్టే పాకను చూపుతావేం? చివర ము ప్రత్యయం (3)
12. ధ్వని. ఒక హీరోయిన్ పేరు (3)
16. స్త్రీ. కోమలంగా ఉంటుంది (3)
17. పిచ్చిక తేలిపోయి తలక్రిందయింది (3)
18. శ్రేష్ఠం. ఎవరిష్ఠం వారిది అనొచ్చా? (3)
19. తీరిక కస్త తగ్గితే మెలిక (3)
21. యజ్ఞం చేసినవాడు. యతి జ్వరంలో (2)

20, ఆగస్టు 2010, శుక్రవారం

సమస్యా పూరణం - 72

కవి మిత్రులారా,
ఈ రోజు పూరించ వలసిన సమస్య ఇది .......

హనుమంతుఁడు రావణునకు హారతి పట్టెన్.
వారాంతపు సమస్యా పూరణం - 5
రామునిఁ జంపి హర్షమున రాక్షసు లెల్లరు నాట్యమాడిరే.

19, ఆగస్టు 2010, గురువారం

చమత్కార పద్యాలు - 17

డా. నండూరి రామకృష్ణమాచార్య
స్వర్గీయ డా. నండూరి రామకృష్ణమాచార్య సాహిత్య లోకంలో బహుళ ప్రసిద్ధి చెందిన మహాకవి. వీరు రచించిన ’శీర్ణ మేఖల’ ఖండ కావ్యం ఏభయ్యేళ్ళ క్రితం ఒక సంచలనాన్ని సృష్టించింది. అందులోని కర్ణ, సుయోధన మైత్రికి సంబంధించిన ఘట్టం వీరి స్వీయ కల్పితం. ఈనాటికీ అది ఒక అపురూపమైన సృజనగా నీరాజనాలందుకొంటూనే ఉంది. వీరు ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వ ’అధికార భాషా సంఘం’ అధ్యక్షులుగా (1987- 1990) పని చేసారు. వీరి రచనలలో ’తారా తోరణం’, ’ఆలోచనం’, ’ప్రగతి గీత’, ’కవితా ప్రభాస’,’ముత్యాల గొడుగు’, ’కచ్ఛపీ కింకిణీకం’ వంటి కవితా సంపుటులు; ’శివాజీ’, ’ధర్మ చక్రం’, ’జ్యోత్స్నాభిసారిక’, ’గోదావరి’ వంటి నాటికలు; ’కావ్యాలోకం’ అనే లక్షణ గ్రంథం; ’కవిత్రయం’, ’పద్య శిల్పం’ వంటి విమర్శన గ్రంథాలు ప్రముఖమైనవి. ఇవి గాక 'Maha Bharata', 'Gandhian Era' ఆంగ్లంలో ప్రసిద్ధ రచనలు. ’కవిత్రయం’ గ్రంథానికి ’తెలుగు భాషా సమితి’ పురస్కారాన్ని ఆనాటి రాష్ట్రపతి డా. సర్వేపల్లి రాధాకృష్ణన్ చేతుల మీదుగా అందుకొన్నారు. ' Gandhian Era ' గ్రంథానికి నాటి రాష్ట్రపతి డా. శంకరదయాళ్ శర్మ ’ముందు మాట’ ను వ్రాసారు. మహాకవి ’కరుణశ్రీ’, వీరు ఆత్మీయ మిత్రులు. ’కరుణశ్రీ’ గ్రంథాలన్నిటికీ ’నండూరి’ వారే పీఠికలు వ్రాసారు. ’కేంద్ర సాహిత్య అకాడమి’ 1955 ప్రాంతంలో వీరితోబాటు ’జాషువ’, ’కరుణశ్రీ’ లను ’నవ్య సంప్రదాయ కవులు’గా గుర్తించింది. ఆచార్యుల వారు ’ఆంధ్ర పద్య కవితా సదస్సు’ రాష్ట్ర స్థాయి అధ్యక్షులుగా ఆమరణాంతం పద్య కవితాభివృద్దికై విశేష కృషిని సలిపారు. ( డా. ఆచార్య ఫణీంద్ర గారి బ్లాగు నుండి కృతజ్ఞతలతో )
నండూరి రామకృష్ణమాచార్య గారి "ముత్యాల గొడుగు" అనే ముక్తకాల, చాటువుల సంకలం నుండి మూడు పద్యాలు.....
ఈగ - తేనెటీగ
మసలు పూల యందు మల మూత్రముల యందు
ఈగ వేరు, తేనెటీగ వేరు
విశ్వమందు కలరు వివిధ విమర్శకుల్
వారి వారి తీరు వేరు వేరు.
ఓటు
అర్హుఁడైనవాని యన్వేషణము సల్పి
కన్య నీయఁ దగును కాళ్ళు కడిగి
ఓటు చేయఁ దగును యోగ్యుండు నిలుచుచో
నతఁడు నోరు విప్పి యడుగకుండ.
కట్నము
ఏమి లాభమయ్య యెఱలేని గాలమ్ము
చేప లుండవచ్చు చెరువు నిండ
కన్నె పెండ్లి యందు కట్నమే ముఖ్యమ్ము
చక్కదనము కాదు, చదువు కాదు.

సమస్యా పూరణం - 71

కవి మిత్రులారా,
ఈ రోజు పూరించ వలసిన సమస్యను రవి గారు పంపించారు. ఇది నిన్నటి సమస్య లాంటిదే.
ఖర వదనుని కరము కన్య బట్టె.
వారాంతపు సమస్యా పూరణం - 5
రామునిఁ జంపి హర్షమున రాక్షసు లెల్లరు నాట్యమాడిరే.

గళ్ళ నుడికట్టు - 44


అడ్డం
1. సముద్రం. జలనిధి (3)
3. శివలీలలను వర్ణించే శ్రీనాథుని కావ్యం. నాకేమో "హరి విలాస్" అనే హోటల్ గుర్తుకు వస్తుంది.
7. యుద్ధం తిరగబడింది. అంబ వరంలో వెదకండి (3)
9. బుర్రకథలో వంతగాడి పదం. తాన ............ అంటాడు (3)
11. కొందరు నిద్రలో పెట్టేదీ, అందరి నిద్ర చెడగొట్టేది (3)
13. సరస్వతి. ఈమె విద్యా విశారద (3)
14. విచ్ఛేదం, అంగహీనం. కవి కలంకారం కాదు (3)
16. రత్నం. ధీరతనంలో (3)
18. రైట్ ఆంగిల్ ట్రయాంగిల్ (7)
నిలువు
2. తిరస్కారం, ఎదిరించడం. అధికారంలో అకారలోపం, కకారానికి ద్విత్వం (3)
4. తెలియబడింది. విడిదిలో తంటాలు పడి చూడండి (3)
5. సంతు కలగాలనే కోరిక (5)
6. పిల్లలమర్రి పిన వీరభద్రుని కావ్యం. సింగారపు శకుంతలకు చెందింది (7)
8. అశక్తుడు, పేద. బుడుగులాంటి వాడా? (3)
10. ఉన్నత స్థితి, అధికారం. సంపద విలసిల్లేది (3)
12. కృత్తికా నక్షత్రం కత్తిరించే పనిముట్టా? (3)
15. దయ, కారుణ్యం (3)
17. కూతురు, ఈ కామధేనువు బిడ్డను దిలీపుడు సేవించాడు


గమనిక - ఇకనుండి గళ్ళ నుడికట్టు రోజు విడిచి రోజు ఇస్తాను. మీకు గడిని పూర్తి చేయడానికి నలభై ఎనిమిది గంటల గడువు.

18, ఆగస్టు 2010, బుధవారం

సమస్యా పూరణం - 70

కవి మిత్రులారా,
ఈ రోజు పూరించ వలసిన సమస్య ఇది ........
ఖర పదములఁ బూజ సేయఁ గలుగున్ సుఖముల్.
వారాంతపు సమస్యా పూరణం - 5
రామునిఁ జంపి హర్షమున రాక్షసు లెల్లరు నాట్యమాడిరే.

గళ్ళ నుడికట్టు - 0

శంకరాభరణం వీక్షకులకు ప్రణామాలు.
రెండు నెలలుగా నేను కొనసాగిస్తున్న "గళ్ళ నుడికట్టు" శీర్షికకు ప్రారంభంలో మంచి స్పందన వచ్చింది. మొదట్లో వారాని కొక గడి ఇవ్వాలనుకున్న నేను ఆ ప్రోత్సాహంతో రోజు కొక గడి ఇస్తూ వస్తున్నాను.
అయితే ఈ మధ్య రోజు రోజుకు గడిని పూరించేవారి సంఖ్య క్రమంగా తగ్గుతూ నిన్నటికి సున్నాకు చేరింది. కారణం నాకు తెలియడం లేదు.
గడి పేలవంగా ఉంటున్నదా? కఠినంగా ఉంటున్నదా? గడి నిర్వహణలో ఏమైనా మార్పులు చేయాలా? మీ సలహాలు, సూచనలను కోరుతున్నాను. ఆ తరువాతే గడిని కొనసాగిస్తాను.
ఇన్ని రోజులుగా గడిని ఆదరించిన
కోడీహళ్ళి మురళీమోహన్,
భమిడిపాటి సూర్యలక్ష్మి,
నేదునూరి రాజేశ్వరి,
ప్రసీద,
విజయజ్యోతి,
రాకేశ్ తేలంగ్,
అజ్ఞాత (లలితా త్రిపుర సుందరి),
రాకేశ్,
వేణు
మొదలైన వారందరికీ ధన్యవాదాలు.

17, ఆగస్టు 2010, మంగళవారం

సమస్యా పూరణం - 69

కవి మిత్రులారా,
ఈ రోజు పూరించ వలసిన సమస్య ఇది ........
సతిఁ గోరినవాని కింట స్థానం బొసఁగెన్.
వారాంతపు సమస్యా పూరణం - 5
రామునిఁ జంపి హర్షమున రాక్షసు లెల్లరు నాట్యమాడిరే.

గళ్ళ నుడికట్టు - 43


అడ్డం
1. బలరాముడు. రౌహిణేయుడు (7)
6. ముస్లిం సాయెబు అస్తవ్యస్తమయ్యాడు (3)
7. వినడం. డి లోపించిన వినికిడి (3)
9. బంగారం. దీనికై ఆనక కనమంటారా? (3)
10. లోహపు కమ్మీ. సకలాత్మునిలో వెదకు (3)
11. చేయి. చతుర్థీ విభక్తి ప్రత్యయం (1)
12. లోకోక్తి. ఏదో ... చెప్పినట్లు (3)
13. రేణువు. ఇదంటే అలుసు (3)
15. వేశ్యాలోలుడు అస్తవ్యస్తంగా (3)
17. తాకట్టు. దీనికి కొదువ లేదు (3)
18. ఖద్యోతం. మిడుగురు బురువు (7)
నిలువు
2. హిమ సమూహం. కోల్డ్ క్రీం (3)
3. దాహం. తప్పక తాగాలి (3)
4. మన్మథుడు తిరగబడ్డాడు. కాంతుడు కాడు (3)
5. సూర్యుడు, అగ్ని, శివుడు. బంగారం రేతస్సుగా కలవాడు (7)
7. నమ్మకాన్ని దెబ్బ కొట్టినవాడు (7)
8. కోపం. కనుక మంచిది కాదు (3)
12. భోజనం. ఏ పేటు తప్పినా ఇది తప్పదు (3)
13. తొమ్మిదవ తిథి (3)
14. మాయమవడం, పారడం. జిగురు సుమా అని ఇట్నుంచి వెదకండి (3)
16. వీచడం, తిరగలి ఆడించడం (3)

16, ఆగస్టు 2010, సోమవారం

సమస్యా పూరణం - 68

కవి మిత్రులారా,
ఈ రోజు పూరించ వలసిన సమస్య ఇది ........
యమున కేల వస్త్ర మాభరణము?
వారాంతపు సమస్యా పూరణం - 5
రామునిఁ జంపి హర్షమున రాక్షసు లెల్లరు నాట్యమాడిరే.

గళ్ళ నుడికట్టు - 42


అడ్డం
1. ఆస్తికి తరువాతి హక్కుదారు. ఔరసుడా? (4)
3. నల్లని రాతిరి. ప్రళయ కాలమందలిదా? (4)
7. మోక్షం. పరమపదం (2)
9. కుంతి. పార్థుని తల్లి (2)
12. పోయే సమయం. అందరికీ ముందో వెనకో దాపురించేది (3)
13. ఇంటి ముందుండే ప్రాంగణం. మొంగిస లిక్కడ తిరుగుతాయా? (3)
17. "గళ్ళు"కు ఏకవచనం (2)
19. కీడు, నాశనం. చేరుకుంటున్నదా? (2)
22. సూర్యుడు. చీకటికి శత్రువు. తిమిరి రా! (4)
23. బాధ కల్గించే స్వప్నం. మనోపీడన కలది (4)
నిలువు
1. బ్రహ్మ. వాగ్దేవి భర్త (4)
2. తెల్ల మన్ను. సుధకు వికృతి (2)
4. లగ్గానికి ముహూర్తం (2)
5. గంగ. మూడు మార్గాల్లో ప్రయాణించేది (4)
6. అంగుళీయకం (3)
10. ధూమ పత్రం (3)
11. పత్రం, పేపర్ (3)
14. ఈమె పేర భాగ్యనగరం వెలిసింది (4)
15. హింగువు. చారులోను, పచ్చళ్ళలోను వేసేది (3)
16. ఈయన పాటల వంటసాల (4)
20. కాళీపట్నం రామారావు ఈ కిళ్ళీ వేసుకుంటాడా? (2)
21. ఛాయ (2)

15, ఆగస్టు 2010, ఆదివారం

చమత్కార పద్యాలు - 16

వ్యాజ స్తుతి
ఒక కవి ముగ్గురు వ్యక్తులపై క్రింది పద్యం చెప్పాడు.
ఆ.వె.
అతఁడు నందికేశ్వరావతార; మతండు
పుత్రకుండు భోగిభూషణునకు;
శౌరి మూఁడవ యవతార మాతండ; సా
క్షాత్తు నొకరి కొకరు ఘనులు గారె!

వాచ్యార్థం చూస్తే ఒకడు నందీశ్వరుడనీ, మరొకడు పాము భూషణంగా గల శివుని కొడుకనీ, ఇంకొకడు విష్ణువు మూడవ అవతారమనీ ప్రశంసించినట్లే ఉంది. వ్యంగ్యార్థాన్ని గమనిస్తే ఒకడు ఎద్దు ( నందికేశ్వరుని అవతారం ) అనీ, మరొకడు కుక్క ( శివుని పుత్రుడు ) అనీ, ఇంకొకడు పంది ( విష్ణువు మూడవ అవతారం ) అనీ నిందించినట్లుగా తెలుస్తుంది.

వారాంతపు సమస్యా పూరణం - 5

కవి మిత్రులారా,
ఈ వారాంతానికి పూరించ వలసిన సమస్య ఇది ..........
రామునిఁ జంపి హర్షమున రాక్షసు లెల్లరు నాట్యమాడిరే.

సమస్యా పూరణం - 67

కవి మిత్రులారా,
ఈ రోజు పూరించ వలసిన సమస్య ఇది ..........
స్వాతంత్ర్య ఫలమ్ము నందు జనులేరి కనన్.

గళ్ళ నుడికట్టు - 41


అడ్డం
1. వృథా దూషణం. చవితి చంద్రుణ్ణి చూస్తే వచ్చేది (4)
3. ముక్తి. వాని శ్రేయస్సు కోసం వెదుకు (4)
7. గృధ్రం (2)
8. మంచానికి మనవారు అల్లుతారు (3)
9. గడ్డ. ఈ పద్యం చూడ్డానికి చిన్నది, లక్షణమేమో పెద్దది (2)
12. సమ్కిప్తం, కూడబెట్టడం (3)
13. కావ్య పరిచ్చేదం (3)
17. ఊపిరి (2)
18. పరదేశంలో ఉన్నవాడు (3)
19. మూలం, అన్యం (2)
22. మది గానం చేస్తే అందులో కృష్ణా జిల్లాలోని ఒక ఊరు (4)
23. సరస్సు (4)
నిలువు
1. దయ. వాణిశ్రీతో శ్యాం బెనెగల్ తీసిన తెలుగు సినిమా (4)
2. ఆకాశం (2)
4. ప్రశస్తం (2)
5. ఆర్జనం. సంపాదకుడు చేసేదా? (4)
6. పెండ్లి (3)
10. మొదటివాడు, శ్రేష్ఠుడు (3)
11. నమ్మకం (3)
14. ఓదార్పు. ఆ అశ్వాన్ని ఆసనం చేసుకో ... తెలుస్తుంది (4)
15. కిటికీ (3)
16. బృహస్పతివారం (4)
20. తలపై పెట్టుకునేది, కోటలో వేసేది (2)
21. జుగుప్స తిరగబడింది. వింత రోగంలో చూడండి

14, ఆగస్టు 2010, శనివారం

సమస్యా పూరణం - 66

కవి మిత్రులారా,
ఈ రోజు పూరించ వలసిన సమస్య ఇది ............
పసులఁ గొల్చి ముక్తిఁ బడయుమయ్య!
వారాంతపు సమస్యా పూరణం - ( రోజు చివరి రోజు )
మాంసాహారమె శ్రేష్ఠమైన దనుచున్ మాన్యుండయెన్ విప్రుఁడే.

గళ్ళ నుడికట్టు - 40


అడ్డం
1. విండ్ మిల్. మలిగారను సవరించు (4)
3. పదకొండవ తిథి (4)
7. ఒక కాలమానం, జంట (2)
8. ఎలుగుబంటి (3)
9. ఈ రాయుళ్ళు చెంచాగిరీ చేస్తారు (2)
12. రుద్రుని కంటి నుండి పుట్టిందట ఈ పూస (2)
13. ప్రయాణ సాధనం (3)
17. సూత్రం, తంతు. మందారంలో (2)
18. తమిళనాడులోని ప్రసిద్ధ సుబ్రహ్మణ్య క్షేత్రం (3)
19. తోక తెగిన సముద్రం అచ్చ తెలుగులో (2)
22. సొంత పేరు సంస్కృతంలో (4)
23. వనంలో నివసించే ఆశ్రమం. బ్రహ్మచర్యం మొదలైన వాటి లోనిది (4)
నిలువు
1. విశ్వామిత్రుడు. గాధి కొడుకు (4)
2. కళంకం. మచ్చరం తెచ్చేదా? (2)
4. పార్వతి రూపాల్లో ఒకటి. ప్రసిద్ధ సంస్కృత కవి ఈమె దాసుడా? (2)
5. తమిళనాడులోని ఈ నగరం అగ్గిపెట్టెల, మతాబుల పరిశ్రమకు ప్రసిద్ధం (4)
6. విక్రమ సింహపురం. ఇఫ్ఫటి పేరు (3)
10. నిద్రలో ఉన్నట్టిది (3)
11. తెగువ. " ......... చేయరా డింభకా!" అన్నాడు పాతాళ భైరవి మాంత్రికుడు (3)
14. మెరుపు. హిందీ బేరం + ఇంగ్లీషు సూక్ష్మం (4)
15. భార్య. కళకు పాత్రం (3)
16. ధర్మరాజు రాజధాని (4)
20. వర్షాన్ని పులువు (2)
21. బిడ్డ. "కూప నటత్"లో వెదుకు

13, ఆగస్టు 2010, శుక్రవారం

చమత్కార పద్యాలు - 15

భ్రష్టుని గతి
భోజమహారాజు ఒకసారి నగరసంచారం చేస్తూ ఒకచోట మాంసం తింటున్న ఒక సన్యాసిని చూసాడు. అప్పుడు వారిద్దరి మధ్య జరిగిన సంభాషణ ఈ శ్లోకం. ఇది సంవాదాత్మక చాటువు.
భిక్షో! మాంస నిషేవణం కిముచితం? కిం తేన మద్యం వినా?
మద్యం చాపి తవ ప్రియం? ప్రితమహో వారాంగనాభిస్సహ |
వారస్త్రీ రతయే కుతస్తవ ధనం? ద్యూతేన చౌర్యేణ వా
చౌర్య ద్యూత పరిశ్రమో$స్తి భవతాం? భ్రష్టస్య కా వా గతిః ||

ఆ సంభాషణ వివరంగా ఇది ...
భోజుడు: ( భిక్షో! మాంస నిషేవణం కిముచితం ) సన్యాసీ! మాంస భక్షణ నీకు తగునా?
సన్యాసి: ( కిం తేన మద్యం వినా ) మద్యం లేకుండ మాంసమెందుకు?
భోజుడు: ( మద్యం చాపి తవ ప్రియం ) నీకు మద్యం కూడా ఇష్టమేనా?
సన్యాసి: ( ప్రియమహో వారాంగనాభిస్సహ ) వేశ్యలతో ఉన్నప్పుడు చాలా బాగుంటుంది.
భోజుడు: ( వారస్త్రీ రతయే కుత స్తవ ధనం ) వేశ్యల కివ్వడానికి నీకు ధనమెక్కడిది?
సన్యాసి: ( ద్యూతేన చౌర్యేన వా ) జూద మాడో, దొంగతనం చేసో సంపాదిస్తాను.
భోజుడు: ( చౌర్య ద్యూత పరిశ్రమో$స్తి భవతాం ) నువ్వు దొంగతనంలో, జూదంలో నేర్పరివా?
సన్యాసి: ( భ్రష్టస్య కా వా గతిః ) చెడిన వాడికి గత్యంతం ఏమున్నది?
నా అనువాదం .......
సీ.
భిక్షుకా! యీ మాంస భక్షణం బుచితమా?
మద్యమ్మునకుఁ దోడు మాంసమె కద!
మద్యపానమ్మెట్లు మంచిదయ్యెను నీకు?
వేశ్యతో మద్య మావశ్యకమ్ము!
వారాంగనల కెట్లు పైకమ్ము నిత్తువు?
జూద మాడియొ కాక చోరవృత్తి!
ద్యూత చౌర్య జ్ఞాన మొప్పుగా నందితే?
భ్రష్టుని గతి యెట్లు స్పష్ట మగును?
తే.గీ.
భోజ భిక్షుక సంవాద పూర్ణ చాటు
పద్య మిది; తెనుంగున ననువాద మొప్ప
జేసితిని; గుణ దోష విశేషములను
చెప్పవలెను పండితులార! చేతు వినతి.

సమస్యా పూరణం - 65

కవి మిత్రులారా,
ఈ రోజు పూరించ వలసిన సమస్య ఇది ............
మాధవుని శిరమ్ము నెక్కె మందాకినియే.
వారాంతపు సమస్యా పూరణం - 4
మాంసాహారమె శ్రేష్ఠమైన దనుచున్ మాన్యుండయెన్ విప్రుఁడే.

గళ్ళ నుడికట్టు - 39


అడ్డం
1. రుచి లేనిది, అసహ్యం (3)
4. ఎండాకాలం (3)
6. కళాపూర్ణోదయంలో మధురంగా మాట్లాడేది (5)
7. జంట, జత (2)
9. అంగుళం ఇంగ్లీషులో (2)
10. ఈ కాయ సొరకాయ (3)
12. దుఃఖాగ్ని (4)
13. సూర్యుడు (4)
14. కృష్ణుడు. మేనమామకు శత్రువు (3)
16. జింక. సమస్యా పూరణం - 63 నా పూరణ చూడండి (2)
17. కలయిక. సంధించిన బాణంలా వెనుదిరిగింది (2)
19. భూదానోద్యమాన్ని నడిపిన జాతీయ నాయకుడు (5)
21. నియమం (3)
22. చెడ్డ ఉపాయం. అస్తవ్యస్తమయింది (3)
నిలువు
1. చివర య్య తగిలిస్తే వినాయకుడు (3)
2. కాటుకలో తిరగబడ్డ తోకతెగిన కారం (2)
3. దక్షిణ, సమ్మానం (4)
4. జడ. కృష్ణునితో కలిస్తే నది (4)
5. వింటూ ... గ్రాంధికం (3)
8. ఎవరినైన మందుతోనో, మంత్రంతోనో లొంగదీసుకొనడం (5)
9. నెహ్రూ బిడ్డ (5)
10. పగలు చేయ వలసినది (3)
11. శూన్యం శూన్యమైన పందిరి (3)
15. షిరిడీలో వెలసినవాడు (4)
16. పాలకుడు (3)
18. గుర్తు. సంగమించే ఒకే ప్రాంతం (3)
19. డివిడిలో వేరయింది (2)
20. బెత్తం

12, ఆగస్టు 2010, గురువారం

సమస్యా పూరణం - 64

కవి మిత్రులారా,
ఈ రోజు పూరించ వలసిన సమస్య ఇది ............
నవమి నాఁడు వచ్చె నాగ చవితి.
వారాంతపు సమస్యా పూరణం - 4
మాంసాహారమె శ్రేష్ఠమైన దనుచున్ మాన్యుండయెన్ విప్రుఁడే.

గళ్ళ నుడికట్టు - 38


అడ్డం
1. పాము. కందశూదం సవరిస్తే (4)
3. బాగా కడగడం. ప్రతిపక్షాల గళ భజనం (4)
7. ప్రక్క, సమీపం (2)
8. గుర్తు సాగదీయండి (3)
9. ఎన్నో, చాలా. నాద్వయం (2)
12. సమూహం. సందేహం వద్దు (3)
13. పాటకు ప్రాణం. పల్లవిస్తుంది (3)
17. ఆకాశం. మౌనభంగంలో (2)
18. యుద్ధం. పోరా! వాటంగా చెయ్యి (3)
19. కుందం. తెలుగు రామాయణ కవయిత్రి (2)
22. మృగతృష్ణ. మరీ చిన్నది కదా! (4)
23. జక్కవ. కోడూరి కౌసల్యాదేవి నవల (4)
నిలువు
1. యముడు. దండం పెట్టు, పాదం పట్టు. ప్రాణిని వదలడు (4)
2. సున్న (2)
4. కారం. క్షామకరం (2)
5. పైకి అమాయికంగా కనిపించి చేసేది చేస్తుంది. ఘనంగా పంగనామాలు చిత్రిస్తుంది (4)
6. పైరుకు బలంకోసం వేసేది (3)
10. పనుల్లో సాయం చేసేవాడు. వాదోడుకు తోడు (3)
11. చిగురు (3)
14. తల్లి సోదరుడు (4)
15. హంస (3)
16. అల్లుడు అత్తవారింట్లో శాశ్వతంగా ఉండడం (4)
20. అగ్ని, పరిశుద్ధం (2)
21. తోక తెగిన మొసలి

11, ఆగస్టు 2010, బుధవారం

చమత్కార పద్యాలు - 14

బుద్ధిమంతులు కాలం గడిపే విధానం
ఎవరు, ఏ కాలంలో వ్రాసారో తెలియని సంస్కృత చమత్కార చాటువు ....
ప్రాతః ద్యూతప్రసఙ్గేన
మధాహ్నే స్త్రీప్రసఙ్గతః |
రాత్రౌ చోరప్రసఙ్గేన
కాలౌ గచ్ఛతి ధీమతః ||

బుద్ధిమంతులకు ఉదయం జూదంతో, మధ్యాహ్నం స్త్రీతో, రాత్రి దొంగతనాలతో కాలం గడచిపోతుందని భావం.
కాని ఇందులో చమత్కారంగా ఉదాత్తభావం గర్భితమై ఉంది.
బుద్ధిమంతులకు ఉదయం జూదానికి సంబంధించిన కథ ఉన్న మహా భారతాన్నీ, మధ్యాహ్నం స్త్రీ అయిన సీత కథ ఉన్న రామాయణాన్నీ, రాత్రి వెన్నదొంగ అయిన శ్రీకృష్ణుని లీలలు గల భాగవతాన్నీ పారాయణం చేయడంతో కాలం గడచిపోతుంది.
ఈ శ్లోకానికి నా అనువాదం ...
ఉదయము జూదపు మాటలు
పదపడి మధ్యాహ్నమందు భామాసక్తిన్
తుద రాత్రికి చోరోక్తుల
నెద రంజిల గడుపువారలే ధీమంతుల్.

మరో రకంగా ....
ద్యూతప్రసంగ ముదయము
ఖ్యాతిగ మధ్యాహ్నమందు కాంతాసక్తిన్
రాతిరి చౌర్యఁపు ముచ్చట
లీ తీరుగ ధీమతులు వహింతురు ఘనతన్.

సమస్యా పూరణం - 63

కవి మిత్రులారా,
ఈ రోజు పూరించ వలసిన సమస్య ఇది ............
వాణీ పుత్రునకు నెలుక వాహన మయ్యెన్.
వారాంతపు సమస్యా పూరణం - 4
మాంసాహారమె శ్రేష్ఠమైన దనుచున్ మాన్యుండయెన్ విప్రుఁడే.

గళ్ళ నుడికట్టు - 37


అడ్డం
2. చలన చిత్రం ఇంగ్లీషులో (2)
4. బియ్యం (2)
5. నాకి తినే మందు. నాకసహ్యం అనకు (2)
6. వజ్రాయుధం. పవిత్రమైనది (2)
8. జనవ్యవహారంలో క్షౌరం (3)
9. భార్య తండ్రి (3)
10. నివాస స్థానం. సాధించే భూషణంలో (3)
12. ఆడపాము. పోతన రాసిన దండకం (3)
15. బిడ్డ! సంవత్సరంలో (2)
16. కృష్ణుని మేనమామ (3)
18. రజనీకాంత్ లకలక లాడిన సినిమా (4)
21. కులం, వెదురు. దీని వల్లనే పిల్లనగ్రోవి వంశి అయింది (2)
23. దీవి. రావణ పట్టణం (2)
25. పావనత్వం. అడ్డం 6 + తత్ర (4)
28. ప్రత్యయాలుండేది. విష్ణుభక్తిలోనా? (3)
30. అడవి, శ్మశానం. తిరగబడింది (2)
31. తోక తెగిన పురూరవుడు వెనక్కి తిరిగాడు (3)
32. సమూహం. విశేష తతి (3)
34. కాంతి. దానికోసం ఛత్రం విప్పు (2)
35. నలభై రోజుల కాలం, వలయం, జిల్లాలోని ఒక విభాగం (3)
36. వర్ణం తిరగబడింది. నిన్నెవరడిగారు? (2)
38. వంశం. గోమూత్రంలో (2)
40. జిగురు. కబంధుని అడగండి (2)
నిలువు
1. సిగ్గు. ఆత్రపడకు (2)
3. చూపు. నీవీ క్షణం చూడు (3)
4. మొదలుపెట్టే పండుగ (5)
5. స్త్రీ. భలే మహిళ (2)
7. బ్రహ్మ, డ్యూటీ (2)
9. వికృతి చెందిన మాణిక్యం (3)
11. ఆరవది. చివర "ము" (3)
13. వెళ్ళడు. గిరిజనులు ఈ వ్యవసాయం చేస్తారట! (2)
14. అధమం (2)
17. లక్ష్మణుని తల్లి (3)
19. క్షేమం అస్తవ్యస్త మయింది. సుభద్ర తలపులో (3)
20. అఖిలం చెడింది (2)
22. మెరుపు. చెంప కాదు (2)
24. ఓర్వలేనితనం. కుక్షిజ్వాల అందామా? (5)
26. నిలువు 7 లోని వాడే (3)
27. ఒడ్డు. నీళ్ళు తట తట కొట్టుకునేది (2)
28. పువ్వు. ఆవిరి కాదు (2)
29. విరాగం క్రింది నుండి (3)
32. ఆలస్యం (3)
33. గద్దె, అరుగు (2)
34. గొడుగు (2)
37. ఈ మందు పోస్తే పిల్లలు వాగుడుకాయ లవుతారు (2)

10, ఆగస్టు 2010, మంగళవారం

చమత్కార పద్యాలు - 13

చిక్కు ప్రశ్నల పద్యం
మంగిపూడి వేంకట శర్మ గారు 1911 లో ఆంధ్రపత్రిక ఉగాది సంచికలో "చమత్కార చంద్రిక" పేర కొన్ని చిత్ర పద్యాలను ప్రకటించారు. వాటిలో ఒకటి ఇది ...
తే.గీ.
ఇంటికిని వింటికినిఁ బ్రాణ మేది చెపుము?
కంట మింటను మనమేది కాంచగలము?
పువ్వు నవ్వు దేనిని గూడి పొలుపు గాంచు?
నొకటె రెండేసి ప్రశ్నల కుత్తరంబు.

సమాధానాలు -
ఇంటికిని, వింటికినిఁ బ్రాణ మేది? ( నారి )
కంట, మింటను మనమేది కాంచగలము? ( తారలు )
పువ్వు, నవ్వు దేనిని గూడి పొలుపు గాంచు? ( వలపు )
( ప్రొ. జి. లలిత గారికి కృతజ్ఞతలతో )

సమస్యా పూరణం - 62

కవి మిత్రులారా,
ఈ రోజు పూరించ వలసిన సమస్య ఇది ....
వేశ్య కప్పగించె వెలఁది పతిని.
వారాంతపు సమస్యా పూరణం - 4
మాంసాహారమె శ్రేష్ఠమైన దనుచున్ మాన్యుండయెన్ విప్రుఁడే.

గళ్ళ నుడికట్టు - 36


అడ్డం
1. మిస్సమ్మ సినిమాలో సావిత్రి జమునకు హితబోధ చేసిన పాటకు ఎన్.టి.ఆర్ సెటైర్ గా పాడిన పాట (9)
5. తోక తిరగబడింది (2)
6. తెలియబడింది అటుదిటు. వ్యక్తి రక్తంలో (2)
7. మరకత"ము". గరుత్మంతునికి చెందింది (5)
10. గాలి. ప్రభునిం భజనం చేయండి (4)
11. ఆగమనం, పున్నమి (2)
14. పొట్టి శ్రీరాములు పోరాడింది. సపరేట్ తెలుగు స్టేట్ సాధించడం కోసం. తిరగబడి 6వ అక్షరం "ష్ట్ర" స్థానభ్రంశం చెందింది (9)
18. నెహ్రూ ఈ దూతగా విఖ్యాతుడు (2)
19. మృత్యువు, వడ్డీ (2)
21. మత్తు. మైకు పట్టుకుంటే కొందరికి వచ్చేది (2)
23. పతిపత్నిలో మధ్య అక్షరాలు మిగిలాయి (2)
24. ఇంగ్లీషు న్యాయం (1)
25. వసతిలో భార్య (2)
26. ఇంగ్లీషులో చూడు, సముద్రం (1)
నిలువు
1. టి. ఆర్. యస్. పూర్తి పేరు (9)
2. దాయాదులు. ప్రథమాక్షరం లోపించింది (3)
3. తగినది. యువరక్తంలో చూడండి (2)
4. వ్యవహారంలో హారం పోయి తలక్రిందయింది (2)
8. దేహం పోయినా ఉండేది తలక్రిందులుగా (2)
9. మునులు పాటించేది (2)
12. బంగారంలో కం పోయింది కనలేవా? (2)
13. కూరలో వేసేది. ఏలకులు, లవంగాలు మొదలైన వాటి కలయిక (3)
15. ఆంధ్రప్రదేశ్ విడిపోవద్దనడం క్రిందినుండి (4)
16. ప్రత్యేక శాంతిలో సరి అక్షరాలు (2)
17. ఎవ్రీ, కాపీ లకు తెలుగు (2)
20. పాళీ, నిబ్ తలక్రిందులుగా. కత్తి పట్టు (2)
22. గడ్డలాంటి రోగం. చేతికందేనా?

9, ఆగస్టు 2010, సోమవారం

చమత్కార పద్యాలు - 12

దత్తపది - ఉత్తర, భరణి, మఖ, పునర్వసు ( రామాయణార్థంలో )
నరాల రామా రెడ్డి ప్రొద్దుటూరు ప్రాచ్య కళాశాలలో అధ్యకులు. ఎన్నోసార్లు అష్టావధాన విద్యను సమర్థవంతంగా ప్రదర్శించి పండితుల మెప్పు పొందారు. 4-11-1974 న పిన్నాలూరి పేటలో జరిగిన అవధానంలో ఒక పృచ్ఛకుడు ఉత్తర, భరణి, మఖ, పునర్వసు పదాలను ఉపయోగిస్తూ రామాయణార్థంలో ఉత్పలమాల చెప్పమని దత్తపదిని ఇచ్చాడు. దానికి నరాల రామా రెడ్డి గారి పద్యం .....
ఉల్లము చీలిపోవునటు లుత్తరవాదులు రాక్షసాధముల్
తల్లయ గార్ధభాభ రణితంబులఁ జేయుచు యాగశాలలో
నల్లరిఁ జేసి రక్తమున నా మఖ శోభను పాడు చేసి రా
నల్లని రాక్షసేశుల పునర్వసు హీనుల రామ! చేయుమా.

సమస్యా పూరణం - 61

కవి మిత్రులారా,
ఈ రోజు పూరించ వలసిన సమస్య ఇది ............
హరుఁడు మోదమలర సిరిని వలచె.

గళ్ళ నుడికట్టు - 35


అడ్డం
1. ఒద్దిక, సమరసత్వం. సాధుమతి రహస్యం (4)
3. ప్రాకే జంతువు. బుసకొట్టి మరీ సృష్టించి పంపాడా బ్రహ్మ? (4)
7. చేసిన పనికిచ్చే డబ్బు. నాకూ కావాలి (2)
8. సముద్రం, ఒక నది, ఒక దేశం. దీని నుంచి పుట్టిందే సైంధవం (3)
9. బలహీనం. కిలాడీలో ఇట్నుంచి (2)
12. సముద్రం. అపర్ణ భావంలో బేసి వర్ణాలు (3)
13. సంహరించడం. సంతలో హారం కొను (3)
17. గుండ్రనిది తిరగబడింది. గందరగోళ మెందుకు? (2)
18. జింక. మనసా! తురంగమెక్కి చూడు (3)
19. స్వప్నం. సకల దర్శిని (2)
22. పూలవాన. విల్లు మధ్య తిరగబడ్డ జరి (4)
23. నటుడు రఘురామయ్యకు ఈ పాట ఇంటిపేరయింది (4)
నిలువు
1. అనుకూల సహితం (4)
2. జ్యూస్. సరసంలో శ్రంగార ...... (2)
4. ఇంగ్లీషు చుట్ట. సిగార్ కాదు. లారీలు, పూరీలు కావు (2)
5. బురదలో పుట్టిన పువ్వుల్లాంటి కన్నులు కలది (4)
6. తేనె, మద్యం, అమృతం (3)
10. నిశ్చయం. అమల, నాగార్జునల సినిమా (3)
11. తోడ్పాటు. సలహా, సహాయం కావాలా? (3)
14. తెవికీ కాదు, తెలుగు కీ (4)
15. రంభతో మొదలుపెట్టడం (3)
16. లాలి గీతం (4)
20. వికృతి చెందిన సంధ్య (2)
21. ముగ్ధస్త్రీ. బేగి లగెత్తితే దొరుకుతుందా? (2)

8, ఆగస్టు 2010, ఆదివారం

వారాంతపు సమస్యా పూరణం - 4

కవి మిత్రులారా,
ఈ వారాంతానికి పూరించ వలసిన సమస్య ఇది ...
మాంసాహారమె శ్రేష్ఠమైన దనుచున్ మాన్యుండయెన్ విప్రుఁడే.

సమస్యా పూరణం - 60

కవి మిత్రులారా,
ఈ రోజు పూరించ వలసిన సమస్య ఇది ....
ఎలుకతోలు నుతికి తెలుపు చేసె.

గళ్ళ నుడి కట్టు - 34


అడ్డం
1. లడ్డు, కుడుము. వినాయకుడికి ఇష్టం (3)
4. చిరిగిన గుడ్డకు వేసే అతుకు (3)
6. ఎండకు శరీరంపై లేచే కాయ (5)
7. తిరగబడ్డ వేసవి విడిది. కులుకులో ఉంది (2)
9. చూర్ణం. తడికి వ్యతిరేకం (3)
10. భార్య అక్క (3)
12. రాయంచ (4)
13. మగవాడు. అస్తవ్యస్తమయ్యాడు (4)
14. చెడ్డ బుద్ధి కలవాడు. అందుకే తిరగబడ్డాడు (3)
16. కన్ను (2)
17. బాధ. అట్నుంచి (2)
19. అనుమానించడనికి అవకాశమున్నట్టిది (5)
21. పాకిస్తాన్ వాణిజ్య ముఖ్యపట్టణం. ఇదంటే కొందరికి చిరాకట! (3)
22. వృత్తం చుట్టుకొలత, హద్దు (3)
నిలువు
1. జానువు. కొందరికి మెదడు ఇందులో ఉంటుందని జోకు (3)
2. చేను చుట్టూ రక్షణ. ఇదే చేను మేస్తే? (2)
3. కిచెన్ (4)
4. అవిద్య, ఇంద్రజాలం, హిందువుల సాతాను (2)
5. అర్జునుడు అచ్చ తెలుగులో (3)
8. కలువ్లవంటి కన్నులు కలది (5)
9. విప్ప వలసిన కథ (5)
10. ఉండడానికి సౌకర్యం. సవతి నడగండి (3)
11. ఖండించు (3)
15. మర్యాదను సాగదీయండి (4)
16. కుబేరుని పట్టణమంటే కోపమెందుకు? (3)
18. వ్యవధానం (3)
19. బ్యాగ్ (2)
20. పాదం, అక్షర సముదాయం. తలక్రిందయింది.

7, ఆగస్టు 2010, శనివారం

సమస్యా పూరణం - 59

కవి మిత్రులారా,
ఈ రోజు పూరించ వలసిన సమస్య ఇది ...
సంసారిగ మారి యోగి సంతసమందెన్.
వారాంతపు సమస్యా పూరణం - ( రోజు చివరి రోజు)
చదువులు వ్యర్థమే కద ప్రశస్త సుఖాస్పద జీవనమ్ముకై.

గళ్ళ నుడి కట్టు - 33


అడ్డం
1. మొదటి వాన. తొలగించు నొకరి బాధ (4)
3. ఇంద్రుడు. బలుడనే రాక్షసుని భేదించినవాడు (4)
7. విరోధం. చంప గలిగేదా? (2)
8. ఏనుగు. కావవే! దండం పడతానంది (3)
9. అమ్మ, పార్వతి, కాశీరాజు పెద్ద కూతురు (2)
12. ఒక సుగంధద్రవ్యం. జాజి పత్రిక (3)
13. తర్వాత. పద పిలుస్తాలో ఇట్నుంచి (3)
17. వ్యర్థం. సరిత్తటంలో (2)
18. సంచరించడం. సంతగాళ్ళ ఆచారం (3)
19. పొలిమేర, హద్దు. ఎల్లప్పుడు ఉండేదా? (2)
22. పెరుగన్నం. గుళ్ళో ప్రసాదం (4)
23. విష్ణువు. అడవి పూల దండను ధరించేవాడు (4)
నిలువు
1. మున్నుడి, ముందుమాట (4)
2. భేకం. వెంకప్పను చూడండి (2)
4. దెబ్బ. వ్యాపారంలో ఇది కొడితే నష్టం (2)
5. దిక్కులే వస్త్రంగా గల స్త్రీ (4)
6. విల్లు. అయ్యా! నీకో దండం (3)
10. తాపసి (3)
11. యుద్ధం. కరుకుదనం ఉండాలి (3)
14. గురిజ. తన నలుపు ఎరుగనిది (4)
15. సింహం. ఐదు ముఖాలు గలదా? (3)
16. మంద మారుతం. పిల్లలకీ గాలి ఇష్టమా? (4)
20. ఒక ఆయుధం. భీముని చేతిలోనిది గదా? (2)
21. ఆజ్ఞ, ఒట్టు

6, ఆగస్టు 2010, శుక్రవారం

సమస్యా పూరణం - 58


కవి మిత్రులారా,
ఈ రోజు పూరించ వలసిన సమస్య ఇది ...
ఆలి నంపుచుంటి నేలుకొనుము.

వారాంతపు సమస్యా పూరణం - 3
చదువులు వ్యర్థమే కద ప్రశస్త సుఖాస్పద జీవనమ్ముకై.

గళ్ళ నుడి కట్టు - 32


అడ్డం
2. కొద్ది. " ..... నిప్పు, .... నీరు ఉన్నాయి నా కళ్ళలోన" పాట గుర్తుందా? (2)
4. ఇంగ్లీషు వాడు తెచ్చిన దీనిని పండితులు సఫేనము అన్నారు. మురికి, గబ్బు వదలగొట్టేది (2)
6. సమూహం, వరుస. సంతతిలో (2)
7. శాకాహారులు తినే కోడి. ఒక పిండివంట (3)
9. సత్యం. పథ్యం లాంటిది (2)
13. అనుమానం. నా పేరులో ప్రథమార్ధం (2)
14. ఖనిజం కోసం తవ్వేది (2)
16. రుధిరం (2)
17. ఇది అన్నారంటే పోటీకి సిద్ధం (1)
18. చర్మం (2)
19. ధనం, ఆభరణం (2)
20. తమరు (2)
23. తినదగింది, అనుభవింపదగింది. రాజ్యం వీర ... (2)
24. కులుకు. ముద్దు తోడిది (3)
26. నిండినది, సమస్తం. పూర్వార్ణవంలో (2)
28. నిదుర కుంచించుకు పోయింది (2)
29. పుండరీకం (2)
నిలువు
1. అరుపు. పిట్ట కొంచెం, .... ఘనం (2)
3. బుగ్గ. పంచె ఇట్నుంచి చూడండి (2)
4. సవ్వడి (2)
5. రోగికి హితమైనది (2)
8. బొక్కసం, నిఘంటువు. ఎందుకో శంక? (2)
10. కొంచెం. లేదు ఆవేశంలో (2)
11. వేశ్య, భార్య (2)
12. వియోగం వల్ల కలిగే వేదన (3)
15. ఉత్పలం. చంద్రుణ్ణి కలువమని పిలిచేది (3)
19. పిల్లలు కార్చే లాలాజలం. సెల్లులో ఈ కబుర్లెక్కువ (2)
21. స్వాదం, కాంతి (2)
22. శూరుని మనుమడైన కృష్ణుడు (2)
23. పడగ గల పాము, సుఖాలు అనుభవించేవాడు (2)
24. ఉంగరం మీది గుర్తు. మేము ద్రవిడులంలో (2)
25. సమృద్ధి. పెంచిన పుణ్యంలో (2)
27. రంగు, కులం, అక్షరం. తలక్రిందయింది (2)

5, ఆగస్టు 2010, గురువారం

సమస్యా పూరణం - 57

కవి మిత్రులారా,
ఈ రోజు పూరించ వలసిన సమస్య ఇది ...
ఆంజనేయుఁడు ధరియించె నడ్డుబొట్టు.
వారాంతపు సమస్యా పూరణం - 3
చదువులు వ్యర్థమే కద ప్రశస్త సుఖాస్పద జీవనమ్ముకై.

గళ్ళ నుడి కట్టు - 31


అడ్డం
1. సరస్వతి. జనకుని కూతురు జానకి అయితే భరతుని కూతురు ఏమవుతుంది? (3)
4. సాధ్యమే? అట్నుంచి. మేర తప్పకు (3)
6. సభికులు (5)
7. తూర్పు నుంచి పడమటికి పారే నది (2)
9. అలంకరణ, అందం. సోమకునకుందా? (2)
10. వెల. వలువింత వెలా? (3)
12. మన ప్రధానాంగం తిరగబడింది. కాయ కాని కాయ (4)
13. మంగళగిరి నృసింహుడు తాగేవి అట్నుంచి. కాలు కాని కాలు (4)
14. నలు వదనాల బ్రహ్మ (3)
16. సుకృతం. పాపం తోడిది (2)
17. నరకం కానిది తిరుగబడింది (2)
19. భయంతో మరో ప్రాంతానికి పోయి జీవించేవారు. కాశీ వైదికులం కాదు కదా? (5)
21. ఇసుమున తైలం తీసే ప్రయత్నం (3)
22. తెచ్చి పెట్టుకొన్నది. మేకప్. ఆహారం కొరకు కార్యం (3)
నిలువు
1. తలంపు. సంభావన కోసమా? (3)
2. భార్య. పార్వతి పూర్వజన్మ క్రిందినుండి (2)
3. జూలు. వీటి వల్లనే సింహం కేసరి అయింది (4)
4. శుభం, ఉపకారం. దానికోసం మేలుకో (2)
5. పశ్చిమ గోదావరి జిల్లాలో ఈ ఊరు. పేరు చెప్పడానికి వణుకు ఎందుకు? (3)
8. రాముడు వనవాసం చేసిన అడవి (5)
9. మెట్ల దారి (5)
10. గరుత్మంతుని తల్లి అస్తవ్యస్తమయింది (3)
11. వస్త్రం విలువ గలదా? (3)
15. ఆశీర్వాదాలు (4)
16. ఇల్లు ఊడ్చేది అస్తవ్యస్తమయింది (3)
18. సొంత పని. స్వామి కార్యం తోడిది (3)
19. వెలుగు (2)
20. అ ఆ లు రానిదా భార్య? (2)

3, ఆగస్టు 2010, మంగళవారం

సమస్యా పూరణం - 56

కవి మిత్రులారా,
ఈ రోజు పూరించ వలసిన సమస్య ఇది ....
రాముఁ డోడె గెలిచె రావణుండు.

గళ్ళ నుడి కట్టు - 30


అడ్డం
1. కర్ర. పిల్లలు అక్షరాలు దిద్దేదాన్ని తిరగేస్తే సరి! (3)
4. భయం. ఉత్త వేగం కుదించండి (3)
6. మువి. తపస్సే ధనంగా కలవాడు (5)
7. సంతతి, కల్పవృక్షం. సంగీతంలో తానం ఉన్నట్లు (3)
9. మురికి, మాలిన్యం. ముర రిపు కినుకలో బేసి (3)
11. నాలుక. దాని సరసన దంతాలు (3)
13. కోరిక, దిక్కు. ఆ శక్తిలో (2)
14. వరుస. మద్యం తాగే చోటు ఇంగ్లీషులో (2)
15. ఎల్లప్పుడు, నిత్యమూ (3)
16. ఉత్తర రామాయణ కర్త పాపరాజు ఇంటిపేరు (3)
18. రాజై ఋషి జీవనం గడిపేవాడు (3)
20. పాల సముద్రం. కలశాలతో దధి తోడుదామా? (5)
22. పౌరుషం లాంటి నిష్ఠురం. మొదటి అక్షరం మధ్యకు చేరింది (3)
23. పోయెట్ దే. అట్ల్నుంచి ధర్మరాజు భార్య, పాతతరం హీరోయిన్ (3)
నిలువు
1. అధమం, తక్కువలో తక్కువ. (3)
2. పడడం (3)
3. దుఃఖం, వేదన (2)
4. పట్టు వదలని బల్లి లాంటి చిన్న జంతువు (3)
5. సాలగ్రామాలు దొరికే ఉత్తరదేశ నది (3)
8. గురు పత్నితో చంద్రుని రంకు కథ (5)
10. హరివంశ్ రాయ్ బచ్చన్ కోడలు క్రిందినుండి ;ఐకి చూస్తోది (5)
11. రాత్రి. నిన్నటి హీరోయిన్ (3)
12. ట్రూ కాపీ, అనుకరణం. సంధానకములులో (3)
16. చూస్తారు, జన్మనిస్తారు (3)
17. రాగుల పిండితో తిండి తలక్రిందయింది (3)
18. టీవీ సీరియళ్ళ రాడన్ సంస్థ ఈ కృష్ణ ప్రేయసిదే (3)
19. దేవలోకపు ఋషి నారదుడు తలక్రిందయ్యాడు (3)
21. ఏడుపు (2)

సమస్యా పూరణం - 55

కవి మిత్రులారా,
ఈ రోజు పూరించ వలసిన సమస్య ఇది ...
ఏనుఁగులం దిను ఘనుఁ డతఁ డెలుకలు గొప్పా?
వారాంతపు సమస్యా పూరణం - 3
చదువులు వ్యర్థమే కద ప్రశస్త సుఖాస్పద జీవనమ్ముకై.

గళ్ళ నుడి కట్టు - 29


అడ్డం
1. నక్క. గోవును మాయ చేస్తుందా? (4)
3. శ్రీ వీర వేంకట సత్యనారాయణ స్వామి వారి పుణ్యక్షేత్రం (4)
7. పంచతంత్రంలో మూడవది అట్నుంచి (2)
8. స్త్రీ. కలవారి కోడలు ..... కామాక్షి (3)
9. జంట. కలువ మన్నారా? (2)
12. గుండ్రంగా ఉన్న రాయి (3)
13. జటాయువు సోదరుడు. సంపాదించి తిన్నాడా? (3)
17. పాఠశాల (2)
18. పరీక్షల్లో విద్యార్థులు తెచ్చుకొనేవి. పార్కులు పట్టుకు తిరిగితే ఇవి రావు (3)
19. అసత్యం (2)
22. కాకి. బలిగా వేసిన అన్నాన్ని భుజించేది (4)
23. శ్మశానం. తిరిగి రావడం తన "వల్ల కాదన్నాడు" (4)
నిలువు
1. నవరత్నాల్లో పసుపు వర్ణం కలది. గోవు మేత అధికంలో (4)
2. సమరం (2)
4. నిన్నటికి నిన్న తలక్రిందులుగ (2)
5. ముగ్గు. రంగుల తీగా? (4)
6. దండ. తెలుగు బ్లాగుల అగ్రిగేటర్లలో ఒకటి (3)
10. విఆయకునికి ఇష్టమైన రాళ్ళు (3)
11. వ్యాపారం చేసేవాడు (3)
14. త్వర త్వరగా. గబ ఆమ్రేడితం (4)
15. సూర్యుడు. విక్రమార్కుడు కాడు (3)
16. భర్త. వల్లమాలిన భుక్తినిచ్చేవాడా? (4)
20. భుమి. తిరగబడి డులోపంతో భర్త (2)
21. మజ్జిగ. కూల్ కూల్ గా (2)

2, ఆగస్టు 2010, సోమవారం

సమస్యా పూరణం - 54

కవి మిత్రులారా,
ఈ రోజు పూరించ వలసిన సమస్య ఇది ...
ప్రేతకళ వహించెఁ బెండ్లికొడుకు.
వారాంతపు సమస్యా పూరణం - 3
చదువులు వ్యర్థమే కద ప్రశస్త సుఖాస్పద జీవనమ్ముకై.

గళ్ళ నుడి కట్టు - 28


అడ్డం
2. సోలార్ ఫ్యామిలీ (5)
6. కొరివి. కొరకరాని కంచుకమా? (4)
8. కిలోలో నాల్గవ వంతు (4)
9. నగరం. పట్టపగలు రణగొణం (3)
10. రోదనం (3)
11. జన్మం. చావు తోడిది (3)
13. చూడ చక్కనివాడు అస్తవ్యస్తమయ్యాడు. పరికించి చూడు (3)
15. ఎక్కువ సమయం. చావాలా ఒసే పుల్లమ్మా? (4)
17. నిమేషము. ముసలి మునిలో (4)
20. అడ్డు లేకుండా (5)
నిలువు
1. నాటు మద్యం దుకాణం. మనసారా మందు కొట్టు (4)
2. నిద్రించే వారిని చంపే కథ ఉన్న మహాభారత పర్వం. సౌఖ్యం తృప్తి మీకండి (3)
3. కృష్ణుని దయను పొందిన గూనిది (2)
4. చుట్టము (3)
5. నరకం ఉన్న లోకం (4)
7. బంధువులను చూడడం. "పనేమీ లేదు. ఈ ఊరికి .................... గా వచ్చాను" (5)
8. పుణ్యకార్యం కాదు. ఐదక్షరాలలో మొదటి నాలుగు "ప"కారలే (5)
12. వదరుబోతు, మాటకారి (4)
14. ముఖం తిప్పినవాడు (4)
16. సైన్యాధిపతి (3)
18. మనోహరంగా, చుంబనంగా. .... రే యశోద ముంగిటి ముత్యము వీడు (3)
19. అనుకూలం. కవాటంలో (2)

1, ఆగస్టు 2010, ఆదివారం

వారాంతపు సమస్యా పూరణం - 3

కవి మిత్రులారా,
ఈ వారం పూరించ వలసిన సమస్య ఇది ....
చదువులు వ్యర్థమే కద ప్రశస్త సుఖాస్పద జీవనమ్ముకై.

సమస్యా పూరణం - 53

కవి మిత్రులారా,
ఈరోజు పూరించ వలసిన సమస్య ఇది ....
సత్యభామను పెండ్లాడె శంకరుండు.

గళ్ళ నుడి కట్టు - 27


అడ్డం
1. కొరత, లోపం. అది మనకొదవదా? (3)
3. మరణాన్ని జయించినవాడు, శివుడు (5)
7. దురద, తీట. ఒకండూ చెయ్యి తియ్యడు (3)
9. కష్టాలు. ఉప్పతిలునవి (3)
11. అంగవస్త్రం. సన్మానాలలో కప్పేది (3)
13. బద్దకం కలవాడు. తమరి సోకు అదేనా? (3)
14. కలహాలు. సాంతం వాటాలు పంచలేక (3)
16. నశించేది ఐశ్వర్యం కనరండి (3)
18. మోసకారి జంబుకం (7)
నిలువు
2. పుట్ట. ఆదికవి ఇందులోంచే పుట్టి పేరు గాంచాడు (3)
4. ఇంద్రుని కూతురు. వర్ధంతి కాదు (3)
5. పుష్పధన్వుడు అచ్చ తెలుగులో తిరగబడ్డాడు (5)
6. కవిబ్రహ్మ, మనుమసిద్ధి ఆస్థానకవి (5)
8. బొట్టు. ఇంతికలంకారం (3)
10. పచ్చదనం. నరహరి తండ్రి నడగండి (3)
12. గంధం. నీవా ఆసనమెక్కి చూడు (3)
15. టొమాటో. ఎంత మాటా? చివరి అక్షరం ముందుకు వచ్చింది (3)
17. ఉల్లాసం. సంతోషం. రండి. జనమంతా