16, జులై 2018, సోమవారం

సమస్య - 2734

కవిమిత్రులారా,
ఈరోజు పూరించవలసిన సమస్య ఇది...
"వెలఁది యురమ్మున నొక వటవృక్షము మొల్చెన్"
(లేదా...)
"వెలఁది యురమ్మునందు వటవృక్షము మొల్చె మహాద్భుతంబుగన్"

15, జులై 2018, ఆదివారం

సమస్య - 2733

కవిమిత్రులారా,
ఈరోజు పూరించవలసిన సమస్య ఇది...
"మూషికం బొండు పిల్లిని ముద్దులాడె"
(లేదా...)
"మూషిక మొండు పిల్లిఁ గని ముద్దు లొసంగెను ప్రేమతోడుతన్"

14, జులై 2018, శనివారం

సమస్య - 2732

కవిమిత్రులారా,
ఈరోజు పూరించవలసిన సమస్య ఇది...
"సారము లేనట్టి తిండి శక్తినిఁ గూర్చున్"
(లేదా...)
"సారములేని తిండిఁ దిని శక్తినిఁ గూర్చుకొనంగవచ్చులే"
ఈ సమస్యను పంపిన కిలపర్తి దాలినాయుడు గారికి ధన్యవాదాలు.

13, జులై 2018, శుక్రవారం

సమస్య - 2731

కవిమిత్రులారా,
ఈరోజు పూరించవలసిన పూరణ ఇది...
"వాల మొకటె తక్కువ గద వసుధాత్మజకున్"
(లేదా...)
"వాలం బొక్కటి తక్కువయ్యె నకటా వామాక్షి సీతమ్మకున్"
ఈ సమస్యను పంపిన రాణి వెంకట గోపాలకృష్ణ ప్రసాద్ గారికి ధన్యవాదాలు.

12, జులై 2018, గురువారం

సమస్య - 2730

కవిమిత్రులారా,
ఈరోజు పూరించవలసిన సమస్య ఇది...
"పలుకలేనివాఁడె పండితుండు"
(లేదా...)
"పలుకఁగలేనివాఁడె ఘనపండితుఁ డంచు గడించుఁ గీర్తులన్"
ఈ సమస్యను పంపిన కిలపర్తి దాలినాయుడు గారికి ధన్యవాదాలు.

11, జులై 2018, బుధవారం

ఆహ్వానము (అష్టావధానము)


దత్తపది - 142

అరి - ఉరి - కరి - గిరి
పై పదాలను అన్యార్థంలో ప్రయోగిస్తూ
భారతార్థంలో
మీకు నచ్చిన ఛందస్సులో
పద్యాన్ని వ్రాయండి.

10, జులై 2018, మంగళవారం

సమస్య - 2729

కవిమిత్రులారా,
ఈరోజు పూరించవలసిన సమస్య ఇది...
"అడ్డుగోడఁ గట్టిరి సమైక్యతను గోరి"
(లేదా...)
"అడ్డుగ గోడఁ గట్టిరి సమైక్యత నందెద మంచు నందరున్"

9, జులై 2018, సోమవారం

ఆవిష్కరణ సభ

"జడ కందములు - మా కందములు" ఆవిష్కరోత్సవానికి వచ్చిన కవిమిత్రులందరికీ పేరు పేరున ధన్యవాదాలు.
ఎందరో మహానుభావులు, అవధానులు, పండితులు, కవిశ్రేష్ఠులు, బహుగ్రంథకర్తలు నామీది ఆప్యాయతతో దూర భారాలను లెక్కించక, ఇబ్బందులు పడుతూ వచ్చి సభను అలంకరించారు. వేదిక మీద కూర్చుని, సన్మానాలు పొందదగినవారు సామాన్య ప్రేక్షకులై సభనిండా కూర్చుని ఎదురుగా కనిపిస్తుంటే ఒకింత అపరాధ భావానికి లోనయ్యాను. నా పిలుపు మేరకు ఎక్కడెక్కడి నుండో వచ్చి, స్నేహభావంతో పలుకరించిన మిత్రుల సౌహార్దాన్ని చూచి భావోద్వేగానికి లోనయ్యాను. ఎన్నెన్నో విషయాలు చెప్పాలని, అందరికీ ధన్యవాదాలు తెలుపుకోవాలని ఆత్రంగా ఉన్న నేను తీరా నన్ను మాట్లాడమనే సరికి కారణం లేకుండానే దుఃఖం ముంచుకు వచ్చి ఏమీ మాట్లాడలేకపోయాను. నా మాటలు వినాలని ఆసక్తిగా ఎదురు చూసిన మిత్రులను నిరుత్సాహ పరచినందుకు మన్నించండి.
పుస్తకాన్ని సలక్షణంగా ప్రకటించాలన్న ఉద్దేశంతో నేను, గుండు మధుసూదన్ గారు ఎంతో జాగ్రత్తగా పరిశీలించి దోషాలు లేకుండా అన్ని జాగ్రత్తలు తీసుకున్నా ఇప్పటికి రెండు దోషాలు నా దృష్టికి వచ్చాయి.
"అందరికీ శకునాలు చెప్పే బల్లి కుడితిలో పడింది" అని ఒక సామెత. అందరి తప్పులు వెదకి, దిద్దిన నేను నా పద్యంలో గణదోషాన్ని గుర్తించలేకపోయాను. అలాగే గోగులపాటి వారి పద్యంలో ప్రాస తప్పింది. ఇలాగే నా దృష్టికి రానివి కొన్ని ఉండవచ్చు.
ఇది నేను మొదటిసారిగా ప్రచురించిన పుస్తకం. మొదటిసారిగా నిర్వహించిన సభ. అనుభవ రాహిత్యం వల్ల ఏవైనా లోటు పాట్లు జరిగితే, ఎవరి మనసైనా నొచ్చుకొని ఉంటే క్షమించమని ప్రార్థిస్తున్నాను.
మరొక్కసారి అందరికీ ధన్యవాదాలు.

సమస్య - 2728

కవిమిత్రులారా,
ఈరోజు పూరించవలసిన సమస్య ఇది...
"సత్యమును బల్క బుధు లపచార మంద్రు"
(లేదా...)
"సత్యముఁ బల్క నార్యు లపచారమ టందురు శాస్త్రసమ్మతిన్"
ఈ సమస్యను పంపిన పోచిరాజు కామేశ్వర రావు గారికి ధన్యవాదాలు

8, జులై 2018, ఆదివారం

నిషిద్ధాక్షరి - 44

కవిమిత్రులారా,
అంశము - జడపై పద్యం
నిషిద్ధము - 'జ, డ' అన్న అక్షరాలు.
ఛందస్సు - మీ ఇష్టము.

7, జులై 2018, శనివారం

సమస్య - 2727

కవిమిత్రులారా,
ఈరోజు పూరించవలసిన సమస్య ఇది...
"పరమేశుఁ గొలువ నఘములు పండవె కరమున్"
(లేదా...)
"పరమేశుం గొలువంగఁ బాపములు వే పండంగ నిక్కమ్ములే"
ఈ సమస్యను పంపిన పోచిరాజు కామేశ్వర రావు గారికి ధన్యవాదాలు

6, జులై 2018, శుక్రవారం

సమస్య - 2726

కవిమిత్రులారా,
ఈరోజు పూరించవలసిన సమస్య ఇది...
"సరములు జీవులకుఁ గన నసహ్యము లెయ్యెన్"
(లేదా...)
"సరములు సర్వజీవుల కసహ్యము లయ్యెను దుర్నిరీక్ష్యతన్"

5, జులై 2018, గురువారం

సమస్య - 2725

కవిమిత్రులారా,
ఈరోజు పూరించవలసిన సమస్య ఇది...
"వాణి రాణియయ్యె భర్గునకును"
(లేదా...)
"వాణిని రాణిగాఁ గొనియె భర్గుఁడు లోకహితానుకారియై"

4, జులై 2018, బుధవారం

సమస్య - 2724

కవిమిత్రులారా,
ఈరోజు పూరించవలసిన సమస్య ఇది...
"జలములో నగ్ని పుట్ట మత్స్యములు మురిసె"
(లేదా...)
"జలమున నగ్ని పుట్టగనె సంబర మందెను మత్స్యజాలమే"

3, జులై 2018, మంగళవారం

సమస్య - 2723

కవిమిత్రులారా,
ఈరోజు పూరించవలసిన సమస్య ఇది...
"చెల్లెలినిఁ బెండ్లియాడె మెచ్చెను జగమ్ము"
(లేదా...)
"చెల్లినిఁ బెండ్లియాడెనట శిష్టజనావళి సూచి మెచ్చఁగన్"

2, జులై 2018, సోమవారం

న్యస్తాక్షరి - 57

అంశము - గ్రామ దేవతలు
ఛందస్సు- ఆటవెలది
న్యస్తాక్షరములు... 
నాలుగు పాదాలలో మొదటి అక్షరాలు వరుసగా
'పో - లే - ర - మ్మ' ఉండాలి.

1, జులై 2018, ఆదివారం

సమస్య - 2722

కవిమిత్రులారా,
ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...
"చక్రమునుఁ ద్రిప్పెఁ బార్ధుండు చక్రిముందు"
(లేదా...)
"చక్రముఁ ద్రిప్పె నర్జునుఁడు చక్రి సమక్షమునందు శూరుఁడై"
(ఒక శతానధానంలో గరికిపాటి నరసింహారావు గారు పూరించిన సమస్య)

30, జూన్ 2018, శనివారం

సమస్య - 2721 (అడ్డం బయ్యెను ధర్మ...)

కవిమిత్రులారా,
ఈరోజు పూరించవలసిన సమస్య ఇది...
"ధర్మవర్తన మడ్డు కర్తవ్యమునకు"
(లేదా...)
"అడ్డం బయ్యెను ధర్మవర్తనము కట్టా కార్యసంసిద్ధికిన్"
ఈ సమస్యను పంపిన పోచిరాజు కామేశ్వర రావు గారికి ధన్యవాదాలు.

29, జూన్ 2018, శుక్రవారం

సమస్య - 2720

కవిమిత్రులారా,
ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...
"భరతుఁడు పెండ్లాడినాఁడు భామిని సీతన్"
(లేదా...)
"భరతుఁడు పెండ్లియాడెఁ గద భామిని సీతను ప్రేమ మీరఁగన్"

28, జూన్ 2018, గురువారం

ఆవిష్కరణోత్సవాహ్వానము!


ఆహ్వానం
పుస్తకావిష్కరణ సభ
కంది శంకరయ్య సగర్వంగా సమర్పించు
జడ కందములుమా కందములు
116 కవుల పద్య సంకలనం
ఆవిష్కర్త : శ్రీ ముద్దు రాజయ్య అవధాని గారు
సమీక్షకులు : ప్రముఖ కవులు శ్రీ నారుమంచి అనంతకృష్ణ గారు
---oOo---
తిరుప్పావై గజల్ మాలిక
రచయిత్రి : డా. ఉమాదేవి జంధ్యాల
ఆవిష్కర్త : గజల్ కవులు శ్రీ టి.వి.యస్. రామకృష్ణ ఆచార్యులు గారు
సమీక్షకులు : ప్రముఖ కవులు శ్రీ తోపెల్ల బాలసుబ్రహ్మణ్య శర్మ గారు
---oOo---
వేదిక : వడ్డేపల్లి కమలమ్మ సీనియర్ సిటిజన్స్ భవనం,
పోస్టాఫీసు ప్రక్కన, వివేకానంద నగర్, కూకట్ పల్లి, హైదరాబాదు.
తేదీ : 8 – 7 – 2018 (ఆదివారం)
సమయం : (కచ్చితంగా) సా. 4 గం. నుండి సా. 6 గం. వరకు.
ఆహ్వానించువారు :
శంకరాభరణం ప్రచురణలు & జె.వి. పబ్లికేషన్స్, హైదరాబాదు.
ఫెడరేషన్ ఆఫ్ సీనియర్ సిటిజన్స్ అసోసియేషన్స్, కూకట్ పల్లి చాప్టర్ వారి సౌజన్యంతో

సమస్య - 2719

కవిమిత్రులారా,
ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...
"అరయ సతి గుబ్బగవ యనలావృతమ్ము"
(లేదా...)
"అరయఁగ నింతి గుబ్బగవ యగ్ని శిఖావృతమై వెలింగెడిన్"
బాబు దేవదాసు గారికి ధన్యవాదాలతో...

27, జూన్ 2018, బుధవారం

సమస్య - 2718

కవిమిత్రులారా,
ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...
"పతి యల్లుండై సపత్ని వరలెను సుతయై"
(లేదా...)
"పతి యల్లుండుగఁ బుత్రియే సవతిగాఁ బ్రాప్తించెఁ జిత్రంబుగన్"
(ఒక శతానధానంలో గరికిపాటి నరసింహారావు గారు పూరించిన సమస్య)

26, జూన్ 2018, మంగళవారం

సమస్య - 2717

కవిమిత్రులారా,
ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...
"శత్రు చయ మొసఁగుఁ బ్రశాంతి నెపుడు"
(లేదా...)
"శత్రు చయం బొసంగును బ్రశాంతిని నిత్యము మర్త్య కోటికిన్"
ఈ సమస్యను పంపిన పోచిరాజు కామేశ్వర రావు గారికి ధన్యవాదాలు

25, జూన్ 2018, సోమవారం

సమస్య - 2716

కవిమిత్రులారా,
ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...
"లేదనఁగఁ గల్గు భోగభాగ్యోదయమ్ము"
(లేదా...)
"లేదన లేదు లేదనఁగ లీలగఁ గల్గును భోగ భాగ్యముల్ "
(ఈ సమస్యను పంపిన పోచిరాజు కామేశ్వర రావు గారికి ధన్యవాదాలు)

24, జూన్ 2018, ఆదివారం

సమస్య - 2715

కవిమిత్రులారా,
ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...
"చంద్రు లిద్ద రున్నను లేదు చంద్రకాంతి"
(లేదా...)
"చందురు లిద్ద రున్నఁ గనఁజాలము చంద్రిక లయ్యొ దైవమా"
(ఒక శతానధానంలో గరికిపాటి నరసింహారావు గారు పూరించిన సమస్య)

23, జూన్ 2018, శనివారం

దత్తపది - 141

హర - గణేశ - కుమార - నంది
పై పదాలను అన్యార్థంలో ప్రయోగిస్తూ
విష్టుస్తుతి చేస్తూ
మీకు నచ్చిన ఛందస్సులో
పద్యాన్ని వ్రాయండి.

22, జూన్ 2018, శుక్రవారం

సమస్య - 2714

కవిమిత్రులారా,
ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...
"తురకలు జంధ్యమ్ముఁ దాల్చుదురు యాజ్ఞికులై"
(లేదా...)
"తురకల్ జంధ్యముఁ దాల్చి యజ్ఞముల నెంతో శ్రద్ధతోఁ జేతురే"

21, జూన్ 2018, గురువారం

సమస్య - 2713

కవిమిత్రులారా,
ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...
"చెవిఁ బువ్వులఁ బెట్టువాఁడె శిష్టుఁడు జగతిన్"
(లేదా...)
"చెవిలోఁ బువ్వులఁ బెట్టువాఁడె గుణసంశీలుండు ముమ్మాటికిన్"
(ఒక శతానధానంలో గరికిపాటి నరసింహారావు గారు పూరించిన సమస్య)

20, జూన్ 2018, బుధవారం

సమస్య - 2712

కవిమిత్రులారా,
ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...
"తలలో స్వర్గమ్ముఁ జూపు ధన్యుఁడె కవియౌ"
(లేదా...)
"తలలో స్వర్గముఁ జూపువాఁడె కవియౌ ధాత్రీతలం బందునన్"
(రాణి వెంకట గోపాల కృష్ణ ప్రసాద్ గారికి ధన్యవాదాలతో...)

19, జూన్ 2018, మంగళవారం

సమస్య - 2711

కవిమిత్రులారా,
ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...
"దారుణ కృష్ణభుజగము సుధల్ వెలిగ్రక్కెన్"
(లేదా...)
"దారుణ కృష్ణసర్పము సుధల్ వెలిగ్రక్కుచు నుండె సత్కవీ"
(చింతా రామకృష్ణారావు గారికి ధన్యవాదాలతో...)

18, జూన్ 2018, సోమవారం

సమస్య - 2710

కవిమిత్రులారా,
ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...
"దిక్కు లేనప్డు దిక్కు నా కక్క మగఁడె"
(లేదా...)
"ఎక్కడ దిక్కు లేదు మఱి యిప్పుడ యక్క మగండు దిక్కగున్" 

17, జూన్ 2018, ఆదివారం

సమస్య - 2709

కవిమిత్రులారా,
ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...
"శుకయోగికి నల్లుఁ డయ్యె సురనది సుతుఁడే"
(లేదా...)
"శుకయోగీంద్రున కల్లుఁ డయ్యెఁ గద భీష్ముం డంద రుప్పొంగగన్"
(ఒక శతానధానంలో గరికిపాటి నరసింహారావు గారు పూరించిన సమస్య)

16, జూన్ 2018, శనివారం

ఆహ్వానం!


సమస్య - 2708

కవిమిత్రులారా,
ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...
"వాల్మీకికి రాజమండ్రి వాసమ్ము గదా"

15, జూన్ 2018, శుక్రవారం

సమస్య - 2707

కవిమిత్రులారా,
ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...
"పద్యము రాదనెను గరికిపాటికి నలుకన్" 
(లేదా...)
"పద్యము రాదనెన్ గరికిపాటికిఁ గోపము హద్దు మీఱఁగన్"
(ఒక శతానధానంలో గరికిపాటి నరసింహారావు గారు పూరించిన సమస్య)

14, జూన్ 2018, గురువారం

సమస్య - 2706

కవిమిత్రులారా,
ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...
"స్త్రీలకు మ్రొక్కిన ధనమును శ్రేయముఁ గల్గున్) 
"స్త్రీలకు మ్రొక్కినన్ ధనము శ్రేయము శౌర్యము గల్గు నిద్ధరన్"
(ఒక శతానధానంలో గరికిపాటి నరసింహారావు గారు పూరించిన సమస్య)

13, జూన్ 2018, బుధవారం

సమస్య - 2705

కవిమిత్రులారా,
ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...
"ద్రౌపదియు సీత లొకతండ్రి తనయలు గద"
(లేదా...) 
"ద్రౌపది సీత లిద్ద రొకతండ్రికిఁ బుట్టిన బిడ్డలే కదా"
(ఒక శతానధానంలో గరికిపాటి నరసింహారావు గారు పూరించిన సమస్య)

12, జూన్ 2018, మంగళవారం

సమస్య - 2704 (తనయను జెల్లెలిని...)

కవిమిత్రులారా,
ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...
"తనయను జెల్లెలిని హరుఁడు దారలుగఁ గొనెన్"
(లేదా...)
"తనయను జెల్లెలిన్ హరుఁడు దారలుగా గ్రహియించెఁ జూడుమా"

11, జూన్ 2018, సోమవారం

సమస్య - 2703 (జారులు నుతియింపఁగ...)

కవిమిత్రులారా,
ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...
"జారులు నుతియింపఁగ హరి శైలజఁ గూడెన్"
(లేదా...)
"జారులు ప్రస్తుతింప హరి శైలజఁ గూడె సురాళి మేలుకై"

10, జూన్ 2018, ఆదివారం

సమస్య - 2702

కవిమిత్రులారా,
ఈరోజు పూరించవలసిన సమస్య ఇది...
"హర్మ్యంబున నీదులాడె నవె మత్స్యంబుల్"
(లేదా...)
"హర్మ్యంబందున నీదులాడె నవె మత్స్యంబుల్ గనన్ వింతయే"
(పూసపాటి కృష్ణ సూర్యకుమార్ గారికి ధన్యవాదాలతో...)

9, జూన్ 2018, శనివారం

సమస్య - 2701 (కరినిఁ జంపి...)

కవిమిత్రులారా,
ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...
"కరినిఁ జంపి యమ్మకరినిఁ గాఁచెను హరి"
(లేదా...)
"కరినిం జంపియు నక్రమున్ గరుణతోఁ గాఁచెన్ ముకుందుం డొగిన్"

8, జూన్ 2018, శుక్రవారం

సమస్య - 2700 (కనకకశిపుఁ బూజ...)

కవిమిత్రులారా,
ఈరోజు పూరించవలసిన సమస్య ఇది..
"కనకకశిపుఁ బూజయె కాఁచుఁగద జగమును"
(లేదా...)
"కనకకశిపుఁ బూజయే జగమ్ముఁ బ్రోచు నెప్పుడున్"

7, జూన్ 2018, గురువారం

సమస్య - 2699 (అభవు ముఖము...)

కవిమిత్రులారా,
ఈరోజు పూరించవలసిన సమస్య ఇది..
"అభవు ముఖముఁ జూడదఁట హిమాద్రిపుత్రి"
(లేదా...)
"అభవు ముఖంబుఁ జూడదఁట యద్రితనూజ తపోనిమగ్నతన్"

6, జూన్ 2018, బుధవారం

సమస్య - 2698 (రతి మూలము...)

కవిమిత్రులారా,
ఈరోజు పూరించవలసిన సమస్య ఇది..
"రతి మూలము సర్వధర్మరక్షణకు భువిన్"
(లేదా...)
"రతియే మూలము సర్వధర్మముల సంరక్షింప లోకమ్మునన్"

5, జూన్ 2018, మంగళవారం

సమస్య - 2697 (చంద్రునిలో లేడి...)

కవిమిత్రులారా,
ఈరోజు పూరించవలసిన సమస్య ఇది..
"చంద్రునిలో లేడి తినెను జగతినిఁ దృణమున్"
(లేదా...)
"చంద్రునిలోని లేడి తినసాగెను ధారుణిపై తృణంబులన్"

4, జూన్ 2018, సోమవారం

సమస్య - 2696 (పుంస్త్వము లేనట్టి భర్త...)

కవిమిత్రులారా,
ఈరోజు పూరించవలసిన సమస్య ఇది..
"పుంస్త్వము లేనట్టి భర్త పుత్రుం గాంచెన్"
(లేదా...)
"పుంస్త్వము లేని భర్త యవుఁబో కొమరున్ సతి గాంచె నెట్లొకో"
(దీనిని కందంలోను పూరించవచ్చు)

3, జూన్ 2018, ఆదివారం

సమస్య - 2695 (శునకమయ్యెను...)

కవిమిత్రులారా,
ఈరోజు పూరించవలసిన సమస్య ఇది..
"శునకమ్మయ్యెను మురారి సురలు నుతింపన్"
(లేదా...)
"శునకమ్మయ్యెను విష్ణుదేవుఁడు సురస్తోమంబు కీర్తింపఁగన్"

2, జూన్ 2018, శనివారం

సమస్య - 2694 (రాయలు కేలన్ ధరించె...)

కవిమిత్రులారా,
ఈరోజు పూరించవలసిన సమస్య ఇది..
"రాయలు కేలన్ ధరించె రమణి పదములన్"
(లేదా...)
"రాయలు కేలఁ దాల్చెఁ జెలి రమ్యపదంబుల నూపురమ్ములన్"

1, జూన్ 2018, శుక్రవారం

దత్తపది - 140 (కామ-భామ-మామ-రామ)

కామ - భామ - మామ - రామ
పై పదాలను అన్యార్థంలో ప్రయోగిస్తూ
భారతార్థంలో
మీకు నచ్చిన ఛందస్సులో
పద్యాన్ని వ్రాయండి.

31, మే 2018, గురువారం

ఆముదాల మురళి గారి శతావధానము – 2వ భాగము


దత్తపది
1) "ఆది - సోమ - మంగళ - బుధ" అవధాన విద్యా వికాసం.
(డా. అమళ్ళదిన్నె వేంకట రమణ ప్రసాద్ గారు)
.        ఆదిన మాడభూషి మహితాన్వయమూర్తి మహత్తు చేత సం
పాదిత సోమరేఖ యొక మచ్చ నెఱుంగని పూర్ణచంద్రుఁడై
వేదవధానవిద్య ప్రభవించెను మంగళరూపసంపదల్
మోదముఁ గూర్చెఁ దెల్గునకు మూదలగా బుధవర్గ మంతటన్.

2) "తల - మెడ - కడుపు - నడుము" శ్రీవేంకటేశ్వర స్తుతి.
(మైలవరపు మురళీకృష్ణ గారు)
చం.    తలఁపుల బోడి సేసి నను దగ్గరఁ జేర్చుము మోక్షసిద్ధికిన్
బల మెడఁబాసి వృద్ధుఁ డగుపట్టున వత్తునె గొల్వ ముందు బా
ముల నొనరించినా నొకడు పుణ్యముఁ బాపము నేరనయ్య నా
తలఁపుల నిల్చి గావు వరదా! నడు ముందు కటంచుఁ ద్రోసి నన్.

3) "సుమిత్ర - కైక - తార - సీత" భారతార్థంలో...
(M.S.V. గంగరాజు గారు)
ఉ.     మీరు సుమిత్రబాంధవులు మీరు మహాత్ములు మీరు కేశవా!
పోరునకై కరం బిడరె పొమ్మని చెప్పక భక్తరక్షకా!
తారలు రాలునట్లుగ నధర్మపరాయణు లాహవంబునన్
జేరియుఁ జంపకుండిన నిసీ తలవ్రాతలు మారబో వికన్.

4) "వాన - ముసురు - జల్లు - జడి" వేసవిలో జనుల స్థితి.
(కంది శంకరయ్య గారు)
తే.గీ. మండుటెండల మధువాన మనసు గల్గు
కోరిక ముసురుఁ జెమ్మటల్ గారుచుండు
దుమ్ము వెదజల్లు నెండలు దమ్ముఁ జూపు
జడిసి బయటకు రాఁబోరు జనులు చూడ.

5) "గగగ - ననన - మమమ - లలల" స్వేచ్ఛాంశం...
(మాధవ రెడ్డి గారు)
తే.గీ. సాగ గగనధుని యగుచు సరసకవిత
చాన ననఁబోడి సాహిత్యచారుమూర్తి
భామ మమతల గుడియైన పద్యవిద్య
బాలల లలితవాక్యమౌఁ బరమసుఖము.

6) "అగ్నిగర్భ - కనులముందు - శిలాయజ్ఞం - గంధకుటి" భారతార్థంలో...
(డా. కలువగుంట రామమూర్తి గారు)
ఉ.     విజ్ఞత లేక ధూర్తపృథివీపతి ద్రౌపది నగ్నిగర్భఁ దా
నజ్ఞత నీడ్చె నీ సభకు నందరి కన్నులముందు పెద్దలున్
బ్రాజ్ఞులుఁ బల్కరైరి యిది పాప మటంచును భీమవాక్శిలా
యజ్ఞము వీరగంధకుటియై మిముఁ గాల్చును కౌరవేశ్వరా!

7) "పాలు - పెరుగు - వెన్న - నేయి" కురు పాండవుల ఆస్తి పంపకాలు.
(సుబ్బ రాఘవ రాజు)
ఉ.     కౌరవరాజ! పాలు నిడఁగా నినుఁ గోరిరి పాండవేయులున్,
గౌరవ మెంతయో పెరుగుఁ గానఁ బ్రసన్నుఁడవై ముదంబునన్
జేరఁగఁ బిల్చి భాగములు చేసి యొసంగుము, వెన్న రాసినన్
మీరలు వాఁతఁ బెట్టినది మేలగునే? యిలుఁ జేరఁ బోయెదన్.

8) "నీరు - మీరు - బారు - బీరు" పద్మావతీ స్తుతి...
(డా. మన్నవ గంగాధర ప్రసాద్)
తే.గీ. కారు కన్నీరుఁ దుడువవే కమలనయన!
మేర మీరు కష్టమ్ముల దారిఁ జూపి
తుమ్మెదల బారు వేనలితోడ నొప్పు
వేంకటేశదయిత! నేను బీరుఁ డమ్మ!

9) "శవము - పాడె - చితిమంట - తర్పణము" పెండ్లి వేడుక...
(టెంకాయల దామోదరం)
తే.గీ. శైశవము దాఁటి పెండ్లాడు సమయమయ్యెఁ
బాట పాడె సువాసిని పరిణయమునఁ
గంటిరెప్పగాఁ బెంచితి మంట లేక
బ్రతుక నన్నసంతర్పణవ్రతముఁ జేతు.

10) "కందు - సందు - మందు - విందు" భాగవతార్థంలో...
(డా. మాలేపట్టు పురుషోత్తమాచారి గారు)
ఉ.     కందుకమయ్యెఁ గొండ, యురగం బొక రంగము నాట్యమాడఁ,
న్విందునుఁ గూర్చు మోము, నునువెచ్చని మాట పసందుఁ జూడ నే
మందును? ముగ్ధలార! యతఁ డాంతరబాహ్యజగంబు లంత టా
నందమయుండుగా వెలుఁగు నందకుమారుఁడె నిందఁ జేయఁగన్?

11) "తల - వల - జల - కల" గురుశిష్య సంబంధం...
(విద్వాన్ జి. గోవిందయ్య గారు)
ఉ.     చేఁతల దిద్దు దేశికుఁడు శిష్యుల వ్రాతలు మారునట్లుగన్
బూఁత మెరుంగు రీతి వలపున్ సరి జేయును గుండెలందునన్
నీతులు నూరిపోయుఁ దటినీజలతీర్థము లందియిచ్చుచున్
చేఁతలు మాట లొక్కటిగఁ జేయును పోకల రాకలందునన్.

12) "కట్టు - గట్టు - పట్టు - రట్టు" ద్రౌపది మాతృహృదయం...
(శ్రీరాములు గారు)
ఉ.     కట్టుదు రేల వీని శిశుఘాతకుఁ డంచును భర్తలార! రా
గట్టుకుమారి లీలలివి గర్భము క్రుంగెడుఁ గన్నతల్లికిన్
పట్టును వీడుఁడింకఁ బసిపాపలఁ జంపినవాని శత్రువున్
రట్టుగఁ జేయనేల? యిది బ్రాహ్మణహత్యకు దారిఁ దీసెడున్.

13) "తాపము - పాపము - కోపము - లోపము" స్త్రీలు లోకకళ్యాణ కారకులు...
(డా. వి. జయమ్మ గారు)
ఉ.     తాపము జాతికెల్లఁ బరితాపము నొందిన భారతావనిన్
బాపము నెంచకుండఁ బలు బాధలు పెట్టిన నాదిశక్తియై
కోపముఁ బూనె నా కుసుమకోమలి కన్నుల నెఱ్ఱఁ జేసినన్
లోపము గల్గు భాగ్యములు లోకము లెల్లను భస్మమయ్యెడిన్.

14) "మమత - సమత - నవత - ఘనత" దేశాభివృద్ధిలో మహిళ పాత్ర...
(డా. మస్తానమ్మ గారు)
తే.గీ. ప్రేమ మతమును బ్రతుకులోఁ బెంచువార
లసమతత్త్వంబుచే దుఃఖ మనుభవించి
నవతరంబును దీర్చెడి నవ్యమతులు
ఘనత నిత్తురు స్త్రీలు ప్రగతుల నొసఁగి.

15) "మొల్ల - ఎల్ల - కల్ల - చల్ల" రామాయణార్థంలో...
(డా. పి.సి. వెంకటేశ్వర్లు గారు)
ఉ.     మొల్లలు మాలఁ గూర్చి మునుముందుగ వచ్చిరి పౌరులందరున్,
ఎల్లలు లేని సంతసము హెచ్చెను రాజుకు, దాసి పుష్పముల్
చల్లఁగ వచ్చె రాముఁడు, పిశాచము మందర కైకఁ జేరి తా
కల్లరిమాటలం బలుకఁ గానల కేగెను రాముఁ డంతటన్.

16) "వడ - పూరి - దోస - ఉప్మా" భారతార్థంలో...
(కత్తి మమత గారు)
మ.    వడఁకెం గౌరవసైన్యమంత ననిలోఁ బార్థుండు విల్లందఁ గృ
ష్ణుఁడు పూరించెను పాంచజన్యమును బంధుప్రీతితోఁ బోరఁ గ
వ్వడితోఁ బోరినవారి కెల్ల గలిగెం బంచత్వ మౌరౌర దో
సెఁడు రారాజు యశోవికాసమునకై చీ యుప్మనెన్ వంశమున్.

17) "వారేవా - తూరేతూ - పీరేపీ - జారేజా" రామాయణార్థంలో...
(మాధవీలత గారు)
శా.    వారే వారిధి దాఁటి వచ్చిరిక భవ్యంబైన యీ లంక పెం
పీరేపీడ్వడు గాన రాము నొక రాజేంద్రుండుగా నెంచ సం
తూరే తూలము గాగ గాలి కెగురున్ దుఃఖంబు గల్గున్ దలల్
జారే జాజులు గాగ రావణ! మహాశస్త్రాగ్నిలోఁ జిక్కెడున్.

18) "క్రీస్తు - ఏసు - మేరి - సిలువ' భాగవతార్థంలో...
(డా. నెమిలేటి కిట్టన్న గారు)
మ.    "హరి! చక్రీ! స్తుతియింతు నీదు పదముల్ ధ్యానింతు నీరూపమున్
సరియే సుస్థిరమోక్షరాజ్యమునకున్ సంసారసౌఖ్యంబు? నా
తరమే రిత్త జగంబు దాట" నని సంధానించెఁ జిత్తంబు లా
పరమాత్మన్ భజియింప భాసిలు వచోభానుండు ప్రహ్లాదుఁడున్.

19) "బడి - ఒడి - గుడి - మడి" ప్రభుత్వ పాఠశాలల పరిరక్షణ...
(యువశ్రీ మురళి గారు)
చం.    బడి గుడి యంచు నెంచి మన పాలకు లెల్లరు చిత్తశుద్ధితో
నొడి నిడి నేర్పగావలయు నుద్ధతిఁ జూపెడి లేమి పోవగా
గుడిసెలు పోయి యుండుటకు గూడును కూడును గల్గ విద్యయ
న్నుడి మడి దున్నగావలయు నూత్నజగంబుల సృష్టిఁ జేయఁగన్.

20) "లవరు - కవరు - పవరు - ఎవరు" దాంపత్య జీవనం...
(డా. నాదెండ్ల శ్రీమన్నారాయణ గారు)
చం.    లవ రుష గల్గినంత ననురాగము వీడుట పాడి యౌనొకో
సవరణ చేసుకోక వరుసన్ బరుషంబుల దంపతీజనుల్
శివముల నాడరాదు గుణశీలురు పాపవరుల్ ముదాన లే
రెవరు జగంబునం చనుచు నెల్లరుఁ గీర్తన సేయుచుండఁగన్.

21) "కొట్టము - గొట్టము - చుట్టము - మట్టము" రాయబారానికి వెళ్ళుచున్న కృష్ణునితో ధర్మరాజు పలుకులు...
(గంగుల నాగరాజు గారు)
ఉ.     కొట్టము రాజ్యలోభమునఁ గూరిమి నిచ్చిన నైదు గ్రామముల్
గొట్టమువంటి శూన్యమునకున్ తపియించుట గాదు దాయలున్
జుట్టములే కదా పొడుచుచుండినఁ కత్తులు యుద్ధమందునన్
మట్టము గావె వంశములు మాధవ! యుద్ధము మాన్పి రమ్మికన్.

22) "నిండ - ధూస్ర - ష్ఠుల్మి - బూసు" తెలుగు భాషయొక్క ఔన్నత్యం...
(మల్లిపూడి రవిచంద్ర గారు)
తే.గీ. గుడులు గట్టియుఁ గొల్వరే గుండెనిండ
ప్రియవధూస్రక్తరాంతఃపరీమళంబు
గలుగు వాక్యము శ్రేష్ఠు ల్మిగుల హసించి
యొంటికిన్ బూసుకొనియెడు సెంటు తెలుఁగు.

23) "గంగ - గంగ - గంగ - గంగ" ఎక్కడా 'నీరు' అనే అర్థం రాకుండా గంగావతరణ వర్ణన...
(తారకరామ్ గారు)
మ.    తపముం జేయ భగీరథుండు వనికిన్ తా నిష్ఠ సాగంగ స
త్కృపతో వే యొసగంగ బ్రహ్మ వరమున్ గీడెంచి శీర్షంబునన్
జపలన్ శంకరుఁ డడ్డుకట్టి వదలెన్ జహ్నుండు ద్రాగంగ స్వ
ర్గపదంబందున నుండి వచ్చె భువికిన్ గంగమ్మ వేగం గదా!

24) "వనిత - లలిత - అనిత - మమత" రామాయణార్థంలో...
(సాత్పాటి సురేశ్ గారు)
తే.గీ. వనిత సీతమ్మ చూచెను వనములోన
లలితలతలందు బంగారు లక్షణముల
ననితరంబైన జింక తా నడిగినంత
రాముఁ డరిగెను మమతతో రయముగాను.

25) "మూర - బార - చేర - మేర" రామాయణార్థంలో...
        (విద్వాన్ బి. కన్నయ్య గారు)
చం.    పురహరుభక్తునిన్ గపిచమూరణతంత్రవినూత్నరీతి సం
బరములు మేర మీర వడిఁ బారఁగఁ జేసిన వైన మెన్నఁగా
స్థిరతర రామమంత్రకృతిచే రహియించెను గాక గెల్వ వా
నరులకు శక్యమే రణమునన్ దితిపుత్రుని రావణాసురునిన్.