1-8-2022 (సోమవారం)
కవిమిత్రులారా,
ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...
“అభయమిడి చంపుటయె ధర్మ మగును గనఁగ”
(లేదా...)
“అభయ మొసంగి చంపుటయె యన్నిఁటికంటెను మేటి ధర్మమౌ”
31, జులై 2022, ఆదివారం
సమస్య - 4149
30, జులై 2022, శనివారం
సమస్య - 4148
31-7-2022 (ఆదివారం)
కవిమిత్రులారా,
ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...
“వంద యవధానము లొనర్చె మందబుద్ధి”
(లేదా...)
“వంద వధానముల్ బుధులు బాగనఁ జేసెను మందబుద్ధియే”
29, జులై 2022, శుక్రవారం
సమస్య - 4147
30-7-2022 (శనివారం)
కవిమిత్రులారా,
ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...
“పతన ముండు నెంతవారికైన”
(లేదా...)
“పతనం బుండదె యెంతవారలకునైనన్ లోకధర్మం బిదే”
28, జులై 2022, గురువారం
న్యస్తాక్షరి - 73
29-7-2022 (శుక్రవారం)
కవిమిత్రులారా,
త్రాగుబోతు ప్రవర్తనను వర్ణిస్తూ
ఉత్పలమాల పద్యం వ్రాయండి.
1వ పాదం 1వ అక్షరం 'త్రా'
2వ పాదం 2వ అక్షరం 'గు'
3వ పాదం 10వ అక్షరం 'బో'
4వ పాదం 17వ అక్షరం 'తు'
(లేదా...)
పై అక్షరాలను వరుసగా యతిస్థానంలో న్యస్తం చేస్తూ
తేటగీతి పద్యం వ్రాయండి.
27, జులై 2022, బుధవారం
సమస్య - 4146
28-7-2022 (గురువారం)
కవిమిత్రులారా,
ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...
“కరి తాఁకిన వస్తుచయము గనుమరుగయ్యెన్”
(లేదా...)
“కరి స్పృశియించినంతటనె కన్మఱుగయ్యె సమస్తవస్తువుల్”
26, జులై 2022, మంగళవారం
సమస్య - 4145
27-7-2022 (బుధవారం)
కవిమిత్రులారా,
ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...
“బ్రహ్మచారులకే కదా బాధలెల్ల”
(లేదా...)
“బ్రహ్మచారులకే కదా ఘనబాధలెల్లను జూడఁగన్”
25, జులై 2022, సోమవారం
సమస్య - 4144
26-7-2022 (మంగళవారం)
కవిమిత్రులారా,
ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...
“పర్వమని రవి విధు లొక్క ప్రక్కఁ జనిరి”
(లేదా...)
“పర్వ మిదే యటంచు నొక ప్రక్కకు నేగిరి సూర్యచంద్రులే”
24, జులై 2022, ఆదివారం
సమస్య - 4143
25-7-2022 (సోమవారం)
కవిమిత్రులారా,
ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...
“పుంస్త్వము లేనట్టివాఁడు పుత్రునిఁ బడసెన్”
(లేదా...)
“పుంస్త్వము లేనివాఁ డొకఁడు పుత్రునిఁ బొందెను లోకు లౌననన్”
23, జులై 2022, శనివారం
సమస్య - 4142
24-7-2022 (ఆదివారం)
కవిమిత్రులారా,
ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...
“మారునిఁ బెండ్లాడె సీత మంజులరూపున్”
(లేదా...)
“మారునిఁ బెండ్లియాడినది మంజులరూపుఁ డటంచు సీతయే”
22, జులై 2022, శుక్రవారం
దత్తపది - 185
23-7-2022 (శనివారం)
కవిమిత్రులారా,
'పేపరు - పెన్ను - టైపు - మెమో'
ఈ పదాలను అన్యార్థంలో ప్రయోగిస్తూ
భారతార్థంలో
స్వేచ్ఛాఛందంలో పద్యం వ్రాయండి.
21, జులై 2022, గురువారం
సమస్య - 4141
22-7-2022 (శుక్రవారం)
కవిమిత్రులారా,
ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...
“సాహిత్యము మేలొసఁగదు చప్పున విడుమా”
(లేదా...)
“సాహిత్యంబు ప్రయోజనం బిడదు వత్సా నీకు వీడం దగున్”
20, జులై 2022, బుధవారం
సమస్య - 4140
21-7-2022 (గురువారం)
కవిమిత్రులారా,
ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...
“లయకారుఁడె సృష్టిఁ జేసె లావణ్యముగన్”
(లేదా...)
“లయకారుం డొనరించె సృష్టి హృదయోల్లాసంబుఁ గల్గించుచున్”
19, జులై 2022, మంగళవారం
సమస్య - 4139
20-7-2022 (బుధవారం)
కవిమిత్రులారా,
ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...
“ఆశావాది వధాని యనుటయె యబద్ధము శిష్యా”
(పైది ఛందో గోపనం)
(లేదా...)
“ఆశావాది వధానియౌననుట శిష్యా పెద్ద బొంకే సుమా”
(మొన్న హైదరాబాదులో ఆశావాది ప్రకాశరావు గారి సంస్మరణ సభలో జరిగిన అష్టావధానంలో నేనిచ్చిన సమస్య)
18, జులై 2022, సోమవారం
సమస్య - 4138
19-7-2022 (మంగళవారం)
కవిమిత్రులారా,
ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...
“రామ యనిన బూతురా పలుకకు”
(లేదా...)
“రామా యన్నది బూతుమాట పలుకన్ రాదయ్య పాపంబగున్”
17, జులై 2022, ఆదివారం
సమస్య - 4137
18-7-2022 (సోమవారం)
కవిమిత్రులారా,
ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...
“తేలుకొండిని ముద్దాడె నీలవేణి”
(లేదా...)
“వృశ్చికపుచ్ఛమున్ వనిత వేడుకతోఁ గని ముద్దులాడెనే”
16, జులై 2022, శనివారం
సమస్య - 4136
17-7-2022 (ఆదివారం)
కవిమిత్రులారా,
ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...
“సంబరములు సలుపుటేల జన్మదినమునన్”
(లేదా...)
“జన్మదినం బటంచుఁ గడు సంబరముల్ జరిపించుటేలనో”
(జులై 17 నా పుట్టినరోజు. 73వ ఏట అడుగుపెడుతున్నాను)
15, జులై 2022, శుక్రవారం
సమస్య - 4135
16-7-2022 (శనివారం)
కవిమిత్రులారా,
ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...
“రాముని మది ద్రోవదిఁ గని రంజిలె మిగులన్”
(లేదా...)
“రాముని మానసమ్ము గడు రంజిలె ద్రోవదిఁ గాంచినంతటన్”
14, జులై 2022, గురువారం
సమస్య - 4134
15-7-2022 (శుక్రవారం)
కవిమిత్రులారా,
ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...
“తార్‌క్ష్యుని తనయుండు గ్రీడి దమ్ముడు హరియౌ”
(లేదా...)
“తార్‌క్ష్యుని పుత్రుఁ డర్జునుఁడు దమ్ముఁడు శ్రీహరి బావ కర్ణుఁడౌ”
13, జులై 2022, బుధవారం
సమస్య - 4133
14-7-2022 (గురువారం)
కవిమిత్రులారా,
ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...
“మీసములు గలుగు తరుణి కమేయాగ్రహమౌ”
(లేదా...)
“మీసములున్నఁ గాంతకును మిక్కిలి కోపము వచ్చు నిచ్చలున్”
12, జులై 2022, మంగళవారం
న్యస్తాక్షరి - 73
13-7-2022 (బుధవారం)
కవిమిత్రులారా,
కవి సన్మానాలను వర్ణిస్తూ
మత్తేభ విక్రీడిత పద్యం చెప్పండి
1వ పాదం 1వ అక్షరం 'స'
2వ పాదం 14వ అక్షరం 'న్మా'
3వ పాదం 5వ అక్షరం 'న'
4వ పాదం 16వ అక్షరం 'ము'
11, జులై 2022, సోమవారం
సమస్య - 4132
12-7-2022 (మంగళవారం)
కవిమిత్రులారా,
ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...
“పృచ్ఛకుని వధాని దిట్టె వేదికపైనన్”
(లేదా...)
“తిప్పలఁ బెట్టు పృచ్ఛకునిఁ దిట్టె వధాని సభాంతరమ్మునన్”
10, జులై 2022, ఆదివారం
సమస్య - 4131
11-7-2022 (సోమవారం)
కవిమిత్రులారా,
ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...
“తపము లేలనొ యజనమ్ము లేల”
(లేదా...)
“తపమొనరింపనేల యజనంబులఁ జేయఁగ నేల ముక్తికై”
(యతిని గమనించండి)
9, జులై 2022, శనివారం
సమస్య - 4130
10-7-2022 (ఆదివారం)
కవిమిత్రులారా,
ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...
“ధారణన్ జేయని వధాని కౌర మెప్పు”
(లేదా...)
“ధారణ సేయఁ జాలని వధానిని మెత్తురు పండితోత్తముల్”
8, జులై 2022, శుక్రవారం
సమస్య - 4129
9-7-2022 (శనివారం)
కవిమిత్రులారా,
ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...
“పప్పులు బెల్లమ్ము వద్దు పద్యమె మేలౌ”
(లేదా...)
“పప్పులు బేల్లమే వలదు పద్యమె కావలెనండ్రు బాలకుల్”
7, జులై 2022, గురువారం
సమస్య - 4128
8-7-2022 (శుక్రవారం)
కవిమిత్రులారా,
ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...
“అప్రాచ్యులు సేయసాగి రవధానములన్”
(లేదా...)
“అప్రాచ్యుల్ బుధులై వధానములఁ జేయం జొచ్చి రాంధ్రావనిన్”
6, జులై 2022, బుధవారం
సమస్య - 4127
7-7-2022 (గురువారం)
కవిమిత్రులారా,
ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...
“పండితులు మెచ్చనిది రమ్యపద్యమయ్యె”
(లేదా...)
“పండితులెల్ల మెచ్చకయె వాసిఁ గనెన్ రసరమ్యపద్యమై”
5, జులై 2022, మంగళవారం
సమస్య - 4126
6-7-2022 (బుధవారం)
కవిమిత్రులారా,
ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...
“హర్మ్యంబునఁ దగవులాడె హస్తి మకరముల్”
(లేదా...)
“హర్మ్యంబందున హస్తి నక్రములు సేయంజొచ్చె సంగ్రామమున్”
4, జులై 2022, సోమవారం
దత్తపది - 185
5-7-2022 (మంగళవారం)
కవిమిత్రులారా,
'ఈగ - దోమ - నల్లి - పేను'
ఈ పదాలను అన్యార్థంలో ప్రయోగిస్తూ
రామాయణార్థంలో
స్వేచ్ఛాఛందంలో పద్యం వ్రాయండి.
3, జులై 2022, ఆదివారం
సమస్య - 4125
4-7-2022 (సోమవారం)
కవిమిత్రులారా,
ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...
“పగలె చంద్రుని రాహువు పట్టి మ్రింగె”
(లేదా...)
“దినమధ్యంబున మ్రింగె రాహువు శశిన్ దిక్కుల్ ప్రకాశింపఁగన్”
2, జులై 2022, శనివారం
సమస్య - 4124
3-7-2022 (ఆదివారం)
కవిమిత్రులారా,
ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...
“చెప్పులను గూర్చి గొప్పగాఁ జెప్పనొప్పు”
(లేదా...)
“చెప్పులఁ గూర్చి గొప్పగను జెప్పఁగ నొప్పును తప్పు గాదులే”
1, జులై 2022, శుక్రవారం
సమస్య - 4123
2-7-2022 (శనివారం)
కవిమిత్రులారా,
ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...
“భర్తయె భారమ్ము గాఁడె భార్యకు నెపుడున్”
(లేదా...)
“భర్తయె భారమై సతిని బాధలకున్ గురిసేయు నెప్పుడున్”