8, ఆగస్టు 2026, శనివారం

సమస్య - 5553

9-8-2026 (ఆదివారం)

ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...

“ముగ్గురిలో నొకఁడు రామి ముగురు మిగిలిరే”

(లేదా...)

“ఒప్పగు ముగ్గురున్ సుతుల నొక్కఁడు లెక్కకు రామి ముగ్గురే”

(ఉప్పలధడియం భరతశర్మ శతావధానంలో పప్పు లక్ష్మణ శాస్త్రి గారి సమస్య)

14 కామెంట్‌లు:

  1. కందం
    తగ్గని కర్ణుఁడు కుంతికి
    నొగ్గక యిచ్చిన వరమ్ము నొప్పెను జగతిన్
    ముగ్గున హత సుతు గలిపిన
    ముగ్గురిలో నొకఁడు రామి ముగురు మిగిలిరే

    కర్ణుడు కుంతీమాతతో:

    ఉత్పలమాల
    తప్పని తల్చి పాసితివి తల్లివి నీవుగ లోకనిందలన్
    మెప్పున రాజరాజు నను మేదిని రాజుగ నిల్ప వీడుటే?తప్పదు కర్ణుడో నరుడొ దైవముఁ జేరక, నన్నుఁ గల్ప నీ
    కొప్పగు ముగ్గురున్ సుతుల నొక్కఁడు లెక్కకు రామి ముగ్గురే!

    రిప్లయితొలగించండి
  2. కందం
    తగ్గని కర్ణుఁడు కుంతికి
    నొగ్గక యిచ్చిన వరమ్ము నొప్పెను జగతిన్
    ముగ్గున హత సుతు గలిపిన
    ముగ్గురిలో నొకఁడు రామి ముగురు మిగిలిరే

    కర్ణుడు కుంతీమాతతో:

    ఉత్పలమాల
    తప్పని తల్చి పాసితివి తల్లివి నీవుగ లోకనిందలన్
    మెప్పున రాజరాజు నను మేదిని రాజుగ నిల్ప వీడుటే?తప్పదు కర్ణుడో నరుడొ దైవముఁ జేరక, నన్నుఁ గల్ప నీ
    కొప్పగు ముగ్గురున్ సుతుల నొక్కఁడు లెక్కకు రామి ముగ్గురే!

    రిప్లయితొలగించండి
  3. రిప్లయిలు
    1. ఒప్పగు ముగ్గురున్ సుతుల నొక్కడు లెక్కకు రామి ముగ్గురే
      తప్పుడు లెక్క లేల మతి దప్పుచు నీవును చేయుచుంటివే
      చెప్పకు నాకు నిట్టులను చేయకు తప్పులు నింకమీద నీ
      వెప్పుడు తత్తఱంబుగ నికెచ్చట నైనను ముద్దుబాలకా

      తొలగించండి
  4. ముగ్గుల జెరుపుట కొరకయి
    ముగ్గురు మగలు వలయునని ముద్దుగ జెప్పన్
    జగ్గున నబ్బా కొమరులు
    ముగ్గురిలో నొకఁడు రామి ముగురు మిగిలిరే”

    రిప్లయితొలగించండి

  5. నుగ్గాడెద నర్జునుడనె
    మొగ్గరమున తల్లి నీదు పుత్రుల నిక నే
    మగ్గింప నీ సుతు లెపుడు
    ముగ్గురిలో నొకఁడు రామి ముగురు మిగిలిరే.


    ఒప్పుల కుప్ప కుంతికి మహోన్నత మూర్తులు పుత్రు లెందరనన్
    చెప్పిరి కన్నెగా నొకని సీరుడొసంగగ, భర్త కోర్కె పై
    కప్పుర గంధి యంతకుని గాలియు ఇంద్రుల తోడ కన్నదా
    యొప్పగు ముగ్గురున్ సుతుల నొక్కఁడు లెక్కకు రామి ముగ్గురే.

    రిప్లయితొలగించండి
  6. రిప్లయిలు
    1. అగ్గజగామిని కుంతికి
      దిగ్గున కర్ణుడుదయించె దినమణి సుతుడై
      తగ్గిన సంఖ్యకు హేతువు
      ముగ్గురిలో నొకఁడు రామి ముగురు మిగిలిరే

      గొప్పవరంబునన్ గలిగె కుంతికి పుత్రుడు సూర్య తేజమై
      చెప్పక దాచియుంచె గద చేడియ మర్మము కర్ణజన్మమే
      తప్పుగ లెక్కగట్టిరట దాచిన సంగతి తెల్లమైనచో
      నొప్పగు ముగ్గురున్ సుతుల నొక్కఁడు లెక్కకు రామి ముగ్గురే

      తొలగించండి
  7. ముగ్గురు సుతులొక పుత్రిక
    యగ్గలికముగా జనింప నందొక సుతునిన్
    జగ్గయ దత్తతకీయగ
    ముగ్గురిలో నొకఁడు రామి ముగురు మిగిలిరే

    రిప్లయితొలగించండి
  8. ఒప్పుగ ముగ్గురున్ సుతులు నొక్క కుమారిత గల్గ నందులో
    కప్పురగంధి పెంచుకొనగా తన సోదరి కిచ్చె పుత్రునిన్
    యిప్పగిదిన్ గణింప తన యింట వసించెడు సంతు జెప్పగా
    నొప్పగు ముగ్గురున్ సుతుల నొక్కఁడు లెక్కకు రామి, ముగ్గురే

    రిప్లయితొలగించండి
  9. కం:జగ్గని కొడుకులు మువ్వురు
    ముగ్గురిలో నొకఁడు రామి, ముగురు మిగిలిరే
    లగ్గము కుదరక, లచ్చికి
    లగ్గమునకు రామి రెడ్డి లక్షణయుతుడౌ.
    (జగ్గడి కొడుకుల్లో ఒకడు రామి రెడ్డి. వాణ్ని రామి అన్నాడు.పెళ్లికి వాడే తగిన వాడు.)



    రిప్లయితొలగించండి
  10. ఉ:చెప్పగ వచ్చినావు గద! చేసిన తప్పును మాత కుంతిరో
    యిప్పుడు నాకు నర్జునుడె హెచ్చగు శత్రు వతండు తాకినన్
    దప్పదు మృత్యు వొక్కరికి, దక్కును కర్ణుడొ,నీ కిరీటియో
    ఒప్పగు, ముగ్గురున్ సుతుల నొక్కఁడు లెక్కకు రామి ముగ్గురే

    రిప్లయితొలగించండి
  11. (ఇది కొంచెం తికమకగా ఉన్నదండి, వ్యవహార పరంగా చూస్తే)

    ఉ॥ చెప్పగ ముగ్గురున్ సుతులె చేరి విదేశము నొక్కడుండఁగన్
    జప్పున తల్లిదండ్రులకు సౌఖ్యముఁ గూర్చ నశక్తుఁడే గదా
    యిప్పుడు యిద్దరే సుతుల కిచ్చిన బాధ్యతలైనఁ దెల్పఁగా
    నొప్పగు ముగ్గురున్ సుతుల నొక్కడు లెక్కకు రామి ముగ్గురే

    (ముగ్గురిలో ఒకడు విదేశంలో ఉండిపోవగా తల్లిదండ్రుల కష్టసుఖాలకు లెక్కకు రాడు కాని కొడుకుగా లెక్కకు వస్తాడు అనే భావనతో నండి)

    రిప్లయితొలగించండి
  12. నిగ్గును దేల్చగ వెదలిన
    ముగ్గురి తో నేను గూడ బోద ల చ ంగా
    సిగ్గు తొ నొక్కడుఁ మరలిన
    ముగ్గు రి లో నొకడు రామి ముగురు మిగిలి రే

    రిప్లయితొలగించండి