9-8-2026 (ఆదివారం)
ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...
“ముగ్గురిలో నొకఁడు రామి ముగురు మిగిలిరే”
(లేదా...)
“ఒప్పగు ముగ్గురున్ సుతుల నొక్కఁడు లెక్కకు రామి ముగ్గురే”
(ఉప్పలధడియం భరతశర్మ శతావధానంలో పప్పు లక్ష్మణ శాస్త్రి గారి సమస్య)
కందంతగ్గని కర్ణుఁడు కుంతికినొగ్గక యిచ్చిన వరమ్ము నొప్పెను జగతిన్ముగ్గున హత సుతు గలిపినముగ్గురిలో నొకఁడు రామి ముగురు మిగిలిరేకర్ణుడు కుంతీమాతతో:ఉత్పలమాల తప్పని తల్చి పాసితివి తల్లివి నీవుగ లోకనిందలన్మెప్పున రాజరాజు నను మేదిని రాజుగ నిల్ప వీడుటే?తప్పదు కర్ణుడో నరుడొ దైవముఁ జేరక, నన్నుఁ గల్ప నీకొప్పగు ముగ్గురున్ సుతుల నొక్కఁడు లెక్కకు రామి ముగ్గురే!
ఒప్పగు ముగ్గురున్ సుతుల నొక్కడు లెక్కకు రామి ముగ్గురే?తప్పుడు మాటయౌనిదని తప్పక పల్కెద బల్లగుద్దుచున్చెప్పకు నిట్టులెప్పుడును చేయకు తప్పులు లెక్కలందు నీవెప్పుడు తత్తఱంబుగను నెచ్చట నైనను ముద్దుబాలకా
ముగ్గుల జెరుపుట కొరకయి ముగ్గురు మగలు వలయునని ముద్దుగ జెప్పన్ జగ్గున నబ్బా కొమరులు ముగ్గురిలో నొకఁడు రామి ముగురు మిగిలిరే”
నుగ్గాడెద నర్జునుడనె మొగ్గరమున తల్లి నీదు పుత్రుల నిక నే మగ్గింప నీ సుతు లెపుడు ముగ్గురిలో నొకఁడు రామి ముగురు మిగిలిరే.ఒప్పుల కుప్ప కుంతికి మహోన్నత మూర్తులు పుత్రు లెందరనన్ చెప్పిరి కన్నెగా నొకని సీరుడొసంగగ, భర్త కోర్కె పై కప్పుర గంధి యంతకుని గాలియు ఇంద్రుల తోడ కన్నదా యొప్పగు ముగ్గురున్ సుతుల నొక్కఁడు లెక్కకు రామి ముగ్గురే.
ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
అగ్గజగామిని కుంతికిదిగ్గున కర్ణుడుదయించె దినమణి సుతుడైతగ్గిన సంఖ్యకు హేతువు ముగ్గురిలో నొకఁడు రామి ముగురు మిగిలిరేగొప్పవరంబునన్ గలిగె కుంతికి పుత్రుడు సూర్య తేజమైచెప్పక దాచియుంచె గద చేడియ మర్మము కర్ణజన్మమేతప్పుగ లెక్కగట్టిరట దాచిన సంగతి తెల్లమైనచోనొప్పగు ముగ్గురున్ సుతుల నొక్కఁడు లెక్కకు రామి ముగ్గురే
ముగ్గురు సుతులొక పుత్రికయగ్గలికముగా జనింప నందొక సుతునిన్జగ్గయ దత్తతకీయగముగ్గురిలో నొకఁడు రామి ముగురు మిగిలిరే
ఒప్పుగ ముగ్గురున్ సుతులు నొక్క కుమారిత గల్గ నందులోకప్పురగంధి పెంచుకొనగా తన సోదరి కిచ్చె పుత్రునిన్యిప్పగిదిన్ గణింప తన యింట వసించెడు సంతు జెప్పగానొప్పగు ముగ్గురున్ సుతుల నొక్కఁడు లెక్కకు రామి, ముగ్గురే
కం:జగ్గని కొడుకులు మువ్వురుముగ్గురిలో నొకఁడు రామి, ముగురు మిగిలిరేలగ్గము కుదరక, లచ్చికి లగ్గమునకు రామి రెడ్డి లక్షణయుతుడౌ. (జగ్గడి కొడుకుల్లో ఒకడు రామి రెడ్డి. వాణ్ని రామి అన్నాడు.పెళ్లికి వాడే తగిన వాడు.)
ఉ:చెప్పగ వచ్చినావు గద! చేసిన తప్పును మాత కుంతిరోయిప్పుడు నాకు నర్జునుడె హెచ్చగు శత్రు వతండు తాకినన్దప్పదు మృత్యు వొక్కరికి, దక్కును కర్ణుడొ,నీ కిరీటియోఒప్పగు, ముగ్గురున్ సుతుల నొక్కఁడు లెక్కకు రామి ముగ్గురే
(ఇది కొంచెం తికమకగా ఉన్నదండి, వ్యవహార పరంగా చూస్తే)ఉ॥ చెప్పగ ముగ్గురున్ సుతులె చేరి విదేశము నొక్కడుండఁగన్జప్పున తల్లిదండ్రులకు సౌఖ్యముఁ గూర్చ నశక్తుఁడే గదాయిప్పుడు యిద్దరే సుతుల కిచ్చిన బాధ్యతలైనఁ దెల్పఁగానొప్పగు ముగ్గురున్ సుతుల నొక్కడు లెక్కకు రామి ముగ్గురే(ముగ్గురిలో ఒకడు విదేశంలో ఉండిపోవగా తల్లిదండ్రుల కష్టసుఖాలకు లెక్కకు రాడు కాని కొడుకుగా లెక్కకు వస్తాడు అనే భావనతో నండి)
కందం
రిప్లయితొలగించండితగ్గని కర్ణుఁడు కుంతికి
నొగ్గక యిచ్చిన వరమ్ము నొప్పెను జగతిన్
ముగ్గున హత సుతు గలిపిన
ముగ్గురిలో నొకఁడు రామి ముగురు మిగిలిరే
కర్ణుడు కుంతీమాతతో:
ఉత్పలమాల
తప్పని తల్చి పాసితివి తల్లివి నీవుగ లోకనిందలన్
మెప్పున రాజరాజు నను మేదిని రాజుగ నిల్ప వీడుటే?తప్పదు కర్ణుడో నరుడొ దైవముఁ జేరక, నన్నుఁ గల్ప నీ
కొప్పగు ముగ్గురున్ సుతుల నొక్కఁడు లెక్కకు రామి ముగ్గురే!
కందం
రిప్లయితొలగించండితగ్గని కర్ణుఁడు కుంతికి
నొగ్గక యిచ్చిన వరమ్ము నొప్పెను జగతిన్
ముగ్గున హత సుతు గలిపిన
ముగ్గురిలో నొకఁడు రామి ముగురు మిగిలిరే
కర్ణుడు కుంతీమాతతో:
ఉత్పలమాల
తప్పని తల్చి పాసితివి తల్లివి నీవుగ లోకనిందలన్
మెప్పున రాజరాజు నను మేదిని రాజుగ నిల్ప వీడుటే?తప్పదు కర్ణుడో నరుడొ దైవముఁ జేరక, నన్నుఁ గల్ప నీ
కొప్పగు ముగ్గురున్ సుతుల నొక్కఁడు లెక్కకు రామి ముగ్గురే!
ఒప్పగు ముగ్గురున్ సుతుల నొక్కడు లెక్కకు రామి ముగ్గురే?
రిప్లయితొలగించండితప్పుడు మాటయౌనిదని తప్పక పల్కెద బల్లగుద్దుచున్
చెప్పకు నిట్టులెప్పుడును చేయకు తప్పులు లెక్కలందు నీ
వెప్పుడు తత్తఱంబుగను నెచ్చట నైనను ముద్దుబాలకా
ముగ్గుల జెరుపుట కొరకయి
రిప్లయితొలగించండిముగ్గురు మగలు వలయునని ముద్దుగ జెప్పన్
జగ్గున నబ్బా కొమరులు
ముగ్గురిలో నొకఁడు రామి ముగురు మిగిలిరే”
రిప్లయితొలగించండినుగ్గాడెద నర్జునుడనె
మొగ్గరమున తల్లి నీదు పుత్రుల నిక నే
మగ్గింప నీ సుతు లెపుడు
ముగ్గురిలో నొకఁడు రామి ముగురు మిగిలిరే.
ఒప్పుల కుప్ప కుంతికి మహోన్నత మూర్తులు పుత్రు లెందరనన్
చెప్పిరి కన్నెగా నొకని సీరుడొసంగగ, భర్త కోర్కె పై
కప్పుర గంధి యంతకుని గాలియు ఇంద్రుల తోడ కన్నదా
యొప్పగు ముగ్గురున్ సుతుల నొక్కఁడు లెక్కకు రామి ముగ్గురే.
ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
రిప్లయితొలగించండిఅగ్గజగామిని కుంతికి
తొలగించండిదిగ్గున కర్ణుడుదయించె దినమణి సుతుడై
తగ్గిన సంఖ్యకు హేతువు
ముగ్గురిలో నొకఁడు రామి ముగురు మిగిలిరే
గొప్పవరంబునన్ గలిగె కుంతికి పుత్రుడు సూర్య తేజమై
చెప్పక దాచియుంచె గద చేడియ మర్మము కర్ణజన్మమే
తప్పుగ లెక్కగట్టిరట దాచిన సంగతి తెల్లమైనచో
నొప్పగు ముగ్గురున్ సుతుల నొక్కఁడు లెక్కకు రామి ముగ్గురే
ముగ్గురు సుతులొక పుత్రిక
రిప్లయితొలగించండియగ్గలికముగా జనింప నందొక సుతునిన్
జగ్గయ దత్తతకీయగ
ముగ్గురిలో నొకఁడు రామి ముగురు మిగిలిరే
ఒప్పుగ ముగ్గురున్ సుతులు నొక్క కుమారిత గల్గ నందులో
రిప్లయితొలగించండికప్పురగంధి పెంచుకొనగా తన సోదరి కిచ్చె పుత్రునిన్
యిప్పగిదిన్ గణింప తన యింట వసించెడు సంతు జెప్పగా
నొప్పగు ముగ్గురున్ సుతుల నొక్కఁడు లెక్కకు రామి, ముగ్గురే
కం:జగ్గని కొడుకులు మువ్వురు
రిప్లయితొలగించండిముగ్గురిలో నొకఁడు రామి, ముగురు మిగిలిరే
లగ్గము కుదరక, లచ్చికి
లగ్గమునకు రామి రెడ్డి లక్షణయుతుడౌ.
(జగ్గడి కొడుకుల్లో ఒకడు రామి రెడ్డి. వాణ్ని రామి అన్నాడు.పెళ్లికి వాడే తగిన వాడు.)
ఉ:చెప్పగ వచ్చినావు గద! చేసిన తప్పును మాత కుంతిరో
రిప్లయితొలగించండియిప్పుడు నాకు నర్జునుడె హెచ్చగు శత్రు వతండు తాకినన్
దప్పదు మృత్యు వొక్కరికి, దక్కును కర్ణుడొ,నీ కిరీటియో
ఒప్పగు, ముగ్గురున్ సుతుల నొక్కఁడు లెక్కకు రామి ముగ్గురే
(ఇది కొంచెం తికమకగా ఉన్నదండి, వ్యవహార పరంగా చూస్తే)
రిప్లయితొలగించండిఉ॥ చెప్పగ ముగ్గురున్ సుతులె చేరి విదేశము నొక్కడుండఁగన్
జప్పున తల్లిదండ్రులకు సౌఖ్యముఁ గూర్చ నశక్తుఁడే గదా
యిప్పుడు యిద్దరే సుతుల కిచ్చిన బాధ్యతలైనఁ దెల్పఁగా
నొప్పగు ముగ్గురున్ సుతుల నొక్కడు లెక్కకు రామి ముగ్గురే
(ముగ్గురిలో ఒకడు విదేశంలో ఉండిపోవగా తల్లిదండ్రుల కష్టసుఖాలకు లెక్కకు రాడు కాని కొడుకుగా లెక్కకు వస్తాడు అనే భావనతో నండి)