4-9-2026 (శుక్రవారం)
ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...
“ద్రుపదాత్మజ పెండ్లియాడె దుర్యోధనునిన్”
(లేదా...)
“ద్రుపదాత్మోద్భవ పెండ్లియాడెను గదా దుర్యోధనుం బ్రేముడిన్”
(పట్వర్ధన్ గారి శతావధానంలో వెలుగు ప్రభాకర్ గారి సమస్య)
కందంఅపురూపమైన నటులనద్రుపదాత్మజ పాత్రధారి దుర్యోధనులేయుపయమమంద జనులనిరిద్రుపదాత్మజ పెండ్లియాడె దుర్యోధనునిన్! మత్తేభవిక్రీడితముఅపురూపంబుగ ద్రౌపదీలలనగా నాహార్య మొల్కంగనేనిపుణత్వంబున రాజరాజు నటనన్ దేజమ్ములేపారెడున్విపులాత్ముండును ప్రేమతో జతపడన్ విశ్వంబు నిట్లాడెనే! ద్రుపదాత్మోద్భవ పెండ్లియాడెను గదా దుర్యోధనుం బ్రేముడిన్!
ద్రుపదుని నిర్ణయ మందున నా పాండుసుతులయినట్టి అయిదు యువకులన్ద్రుపదాత్మజ పెండ్లియాడె ; దుర్యోధనునిన్ ఆపడతుక భాను పెండ్లి యాడెననెదరే
ఉప పాండవ మాత యెవతె?కపర్ది ప్రభ నేమిచేసె? గదతోడను గా డుపు చూలి చంపె నెవనిని?ద్రుపదాత్మజ, పెండ్లియాడె, దుర్యోధనునిన్.అపరాధమ్ములు చేయ నిచ్ఛగల పాపాత్ముండు దుశ్శాసనుం డపరాహ్నమ్మున నిద్రలో గనెనె యత్యంతాద్భుతంబైన దౌ స్వపమొక్కంటిని, యగ్రజుండచట మత్స్య యంత్రమున్ గొట్టగా ద్రుపదాత్మోద్భవ పెండ్లియాడెను గదా దుర్యోధనుం బ్రేముడిన్.
అపుడచట పాండవులనేద్రుపదాత్మజ పెండ్లియాడె; దుర్యోధనునిన్విపరీతమ్ముగ నమ్ముచుశపథమొనర్చిన హితుండు సావిత్రుడగున్నిపుణత్వమ్మును జూపి కృష్ణసఖుడే నెట్టించి కొంపోయినన్జపలత్వంబును వీడి పాండవులనే సంతృప్తితో సమ్మతిన్ద్రుపదాత్మోద్భవ పెండ్లియాడెను గదా; దుర్యోధనుం బ్రేముడిన్విపరీతమ్ముగ మెచ్చు కర్ణుడు సదా వెన్నంటి నిల్చెన్ గదా
-తపమొనరిచి నైదుగురిని ద్రుపదాత్మజ పెండ్లియాడె; దుర్యోధనునిన్చపలత గాంచిన నగవు తన పెనిమిటుల కొంప గూల్చె నక్షములోనన్
కందం
రిప్లయితొలగించండిఅపురూపమైన నటులన
ద్రుపదాత్మజ పాత్రధారి దుర్యోధనులే
యుపయమమంద జనులనిరి
ద్రుపదాత్మజ పెండ్లియాడె దుర్యోధనునిన్!
మత్తేభవిక్రీడితము
అపురూపంబుగ ద్రౌపదీలలనగా నాహార్య మొల్కంగనే
నిపుణత్వంబున రాజరాజు నటనన్ దేజమ్ములేపారెడున్
విపులాత్ముండును ప్రేమతో జతపడన్ విశ్వంబు నిట్లాడెనే!
ద్రుపదాత్మోద్భవ పెండ్లియాడెను గదా దుర్యోధనుం బ్రేముడిన్!
ద్రుపదుని నిర్ణయ మందున
రిప్లయితొలగించండినా పాండుసుతులయినట్టి అయిదు యువకులన్
ద్రుపదాత్మజ పెండ్లియాడె ; దుర్యోధనునిన్
ఆపడతుక భాను పెండ్లి యాడెననెదరే
రిప్లయితొలగించండిఉప పాండవ మాత యెవతె?
కపర్ది ప్రభ నేమిచేసె? గదతోడను గా
డుపు చూలి చంపె నెవనిని?
ద్రుపదాత్మజ, పెండ్లియాడె, దుర్యోధనునిన్.
అపరాధమ్ములు చేయ నిచ్ఛగల పాపాత్ముండు దుశ్శాసనుం
డపరాహ్నమ్మున నిద్రలో గనెనె యత్యంతాద్భుతంబైన దౌ
స్వపమొక్కంటిని, యగ్రజుండచట మత్స్య యంత్రమున్ గొట్టగా
ద్రుపదాత్మోద్భవ పెండ్లియాడెను గదా దుర్యోధనుం బ్రేముడిన్.
అపుడచట పాండవులనే
రిప్లయితొలగించండిద్రుపదాత్మజ పెండ్లియాడె; దుర్యోధనునిన్
విపరీతమ్ముగ నమ్ముచు
శపథమొనర్చిన హితుండు సావిత్రుడగున్
నిపుణత్వమ్మును జూపి కృష్ణసఖుడే నెట్టించి కొంపోయినన్
జపలత్వంబును వీడి పాండవులనే సంతృప్తితో సమ్మతిన్
ద్రుపదాత్మోద్భవ పెండ్లియాడెను గదా; దుర్యోధనుం బ్రేముడిన్
విపరీతమ్ముగ మెచ్చు కర్ణుడు సదా వెన్నంటి నిల్చెన్ గదా
-
రిప్లయితొలగించండితపమొనరిచి నైదుగురిని
ద్రుపదాత్మజ పెండ్లియాడె; దుర్యోధనునిన్
చపలత గాంచిన నగవు త
న పెనిమిటుల కొంప గూల్చె నక్షములోనన్