3-11-2026 (మంగళవారం)
ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...
“బకనామజపంబుచేతఁ బడయమె ముక్తిన్”
(లేదా...)
“బకనామమ్ముఁ జపింప మోక్షమది సంప్రాప్తంబు గాకుండునే”
కందముఇక పంచాక్షరి మంత్రమగు కీలక "నమశ్శివాయ" కు యలవడంగన్సకలమమరునయ్య త్రయంబక నామ జపంబు చేత బడయమె ముక్తిన్దైవజ్ఞ రత్న-సర్వ కళాభిజ్ఞ డాక్టర్ బొక్కా శ్రీనివాసరావు ఎన్-ఫోర్సుమెంట్ ఆఫీసర్ (విశ్రాంత)9030734124
కందంసకలానర్థక విషమాగక రేగన్ గుడిచెనట జగద్రక్షణకైనికరముగ శివములిడు త్ర్యంబకనామజపంబుచేతఁ బడయమె ముక్తిన్! మత్తేభవిక్రీడితముసకలమ్మున్ లయమొందఁజేయు విషమే సంధింప క్షీరాబ్ధి తానకలంకుండన భక్తవత్సలునిగా నందెన్ మహేశుండహోనికరంబెంచఁగ నిత్యమున్ శివములందింపన్ విలోకించు త్ర్యంబకనామమ్ముఁ జపింప మోక్షమది సంప్రాప్తంబు గాకుండునే!
ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
సకలము మంచినె సలిపితి ,నకారణమయిన విధముగ నాక్షే పించేచకితమున, నాదు కొనత్ర్యంబకనామజపంబుచేతఁ బడయమె ముక్తిన్
మత్తేభము:అకలంకంబగు భక్తి నెక్కొనగ నవ్యాజంపు తాదాత్మ్యతన్వికచాంభోరుహ చంచరీకము వలెన్ ప్రీతిన్ జటాధారి సర్వకరున్ హృత్కమలంబునందునిచి నిర్వ్యాజమ్ము పెంపార త్ర్యంబకనామమ్ముఁ జపింప మోక్షమది సంప్రాప్తంబు గాకుండునే
సకలము వ్యాప్తి o జెందియు వికసిత రూపమున మించు విశ్వే శ్వ రు నిన్ త్రికరణ శుద్ధు లు గను త్ర్య o బక నామ జపంబు చేత బడ య మె ముక్తి న్
సకాలర్థంబుల నొసగెడి యకాయడా యంతకహరు డసమాంబకు డై న కపాల ధారియగు త్ర్యం బకనామజపంబుచేతఁ బడయమె ముక్తిన్.సకలార్థంబుల నిచ్చు వాడనేడి విశ్వాసంబు తోనిత్యమున్ సికలో చంద్రుని దాల్చి దివ్యనదినే శీర్షమ్ము పై, దార యం బిక దేహార్ధము నిల్పుకొన్న ఘనుడా విశ్వాత్ముడైనట్టి త్ర్యం బకనామమ్ముఁ జపింప మోక్షమది సంప్రాప్తంబు గాకుండునే.
-కలడతడం......నికటము ప్రకటంబెందైన కటాక్షము కలదు సూవె నమ్మిక తోడైటకటక రారండి తతినిబకనామజపంబుచేతఁ బడయమె ముక్తిన్.
కందము
రిప్లయితొలగించండిఇక పంచాక్షరి మంత్రమ
గు కీలక "నమశ్శివాయ" కు యలవడంగన్
సకలమమరునయ్య త్రయం
బక నామ జపంబు చేత బడయమె ముక్తిన్
దైవజ్ఞ రత్న-సర్వ కళాభిజ్ఞ
డాక్టర్ బొక్కా శ్రీనివాసరావు
ఎన్-ఫోర్సుమెంట్ ఆఫీసర్ (విశ్రాంత)
9030734124
కందం
రిప్లయితొలగించండిసకలానర్థక విషమా
గక రేగన్ గుడిచెనట జగద్రక్షణకై
నికరముగ శివములిడు త్ర్యం
బకనామజపంబుచేతఁ బడయమె ముక్తిన్!
మత్తేభవిక్రీడితము
సకలమ్మున్ లయమొందఁజేయు విషమే సంధింప క్షీరాబ్ధి తా
నకలంకుండన భక్తవత్సలునిగా నందెన్ మహేశుండహో
నికరంబెంచఁగ నిత్యమున్ శివములందింపన్ విలోకించు త్ర్యం
బకనామమ్ముఁ జపింప మోక్షమది సంప్రాప్తంబు గాకుండునే!
ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
రిప్లయితొలగించండిసకలము మంచినె సలిపితి ,
రిప్లయితొలగించండినకారణమయిన విధముగ నాక్షే పించే
చకితమున, నాదు కొనత్ర్యం
బకనామజపంబుచేతఁ బడయమె ముక్తిన్
మత్తేభము:
రిప్లయితొలగించండిఅకలంకంబగు భక్తి నెక్కొనగ నవ్యాజంపు తాదాత్మ్యతన్
వికచాంభోరుహ చంచరీకము వలెన్ ప్రీతిన్ జటాధారి స
ర్వకరున్ హృత్కమలంబునందునిచి నిర్వ్యాజమ్ము పెంపార త్ర్యం
బకనామమ్ముఁ జపింప మోక్షమది సంప్రాప్తంబు గాకుండునే
సకలము వ్యాప్తి o జెందియు
రిప్లయితొలగించండివికసిత రూపమున మించు విశ్వే శ్వ రు నిన్
త్రికరణ శుద్ధు లు గను త్ర్య o
బక నామ జపంబు చేత బడ య మె ముక్తి న్
రిప్లయితొలగించండిసకాలర్థంబుల నొసగెడి
యకాయడా యంతకహరు డసమాంబకు డై
న కపాల ధారియగు త్ర్యం
బకనామజపంబుచేతఁ బడయమె ముక్తిన్.
సకలార్థంబుల నిచ్చు వాడనేడి విశ్వాసంబు తోనిత్యమున్
సికలో చంద్రుని దాల్చి దివ్యనదినే శీర్షమ్ము పై, దార యం
బిక దేహార్ధము నిల్పుకొన్న ఘనుడా విశ్వాత్ముడైనట్టి త్ర్యం
బకనామమ్ముఁ జపింప మోక్షమది సంప్రాప్తంబు గాకుండునే.
-
రిప్లయితొలగించండికలడతడం......
నికటము ప్రకటంబెందై
న కటాక్షము కలదు సూవె నమ్మిక తోడై
టకటక రారండి తతిని
బకనామజపంబుచేతఁ బడయమె ముక్తిన్
.