11, ఆగస్టు 2026, మంగళవారం

సమస్య - 5556

12-8-2026 (బుధవారం)

ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...

“ఆమ్లముం గ్రోలి గోవు పయస్సు నొసఁగె”

(లేదా...)

“ఆమ్లముఁ గ్రోలి గోవు మధురామృత దుగ్ధమునిచ్చె దూడకున్”

(ఉప్పలధడియం భరతశర్మ శతావధానంలో క్రొవ్విడి వేంకట రాజారావు గారి సమస్య)

5 కామెంట్‌లు:

  1. ఏది తిని , త్రాగ వలయునో యెరుగ నట్టి
    పశువులదరి విషము వంటి వాటి నుంచ
    దోషమదియని దెలియక దొరపి నట్టి
    యామ్లముం గ్రోలి గోవు పయస్సు నొసఁగె

    రిప్లయితొలగించండి

  2. తొడుకు గైకొన్న మేతతో దుగ్ధపు రుచి
    మార బోదంచు తెలియని మంకు వవ్ ర
    తల్లి పాలను మించిన స్త్యానమేది
    ఆమ్లముం గ్రోలి గోవు పయస్సు నొసఁగె.


    సిమ్లకు చెందినట్టి యొక స్నేహితుడిట్లు వచించె మిత్రమా
    యామ్లము గ్రోలనేమి యదె యద్భుత మందును తల్లి పాలలో
    నామ్లగుణమ్ము చేరదని యాద్యులు చెప్పిరి కాదె యందుకే
    ఆమ్లముఁ గ్రోలి గోవు మధురామృత దుగ్ధమునిచ్చె దూడకున్.

    రిప్లయితొలగించండి
  3. తేటగీతి

    ఆవులైన నింటిని గేదెలైన నెపుడు
    గడ్డి తిను బైట కొట్టాన కడుగు నీరు
    త్రాగియే పాలనొసఁగుచు సాగెడున్ గృ
    హామ్లముం గ్రోలి గోవు పయస్సు నొసఁగె

    ఉత్పలమాల
    ఆమ్లము హానికారకము నావుకు గేదెకు నైన క్షీరమం
    దామ్ల గుణమ్ములున్ ప్రబలి యాయువు దీరును త్రాగినంత న
    య్యామ్లము నే గృహస్తుడిడు? నందరెఱింగిన రీతినందు ధా
    న్యామ్లముఁ గ్రోలి గోవు మధురామృత దుగ్ధమునిచ్చె దూడకున్

    రిప్లయితొలగించండి
  4. కటిక దారిద్ర్య బాధతో గంజి త్రాగి
    కడుపు నింపెడు వారలు కలరు జగతి
    కడుపు నిండుగ పెట్టిన గడ్డి తిని గృ
    హామ్లముం గ్రోలి గోవు పయస్సు నొసఁగె

    అమ్లకలంబమే మన గృహావసరాలను తీర్చుచుండ శు
    క్లామ్లము వంటయింట బహుకమ్మని వంటక మిచ్చుచుండ స్వా
    ద్వామ్లము గల్గియుండు సముదంచిత యౌషద ధర్మమంద్రు ధా
    న్యామ్లముఁ గ్రోలి గోవు మధురామృత దుగ్ధమునిచ్చె దూడకున్

    [అమ్లకలంబము = పుల్లబచ్చలి; శుక్లామ్లము = చింతపందు
    స్వాద్వామ్లము = దానిమ్మ; ధాన్యామ్లము = కుడితి]

    రిప్లయితొలగించండి
  5. కమ్లి గృహంబు నందు కడు కమ్మని వంటలు పెక్కు భర్తయౌ
    సోమ్లకు చేసి పెట్టి తన సోదరి తోడుగ నెక్కువైన యా
    ఆమ్లపు చారునున్ మరియు నన్నము రెంటిని బైట నుంచ నా
    ఆమ్లము గ్రోలి గోవు మధురామృత దుగ్ధము నిచ్చె దూడకున్

    రిప్లయితొలగించండి