కం:శృతి యే జీవననాదము హిత మని నీ వనువదింప హే దాశరథీ! ప్రతి తెలుగు వాడు జదివెను చతురామ్నాయములఁ జదువఁ జాలిరి తురకల్” (శృతియే జీవన నాదము= "వేదం జీవన నాదం" అనే పేరు తో దాశరథి రంగాచార్య గారు తెలుగు లోకి అనువాదం చేసారు. అప్పుడు అది తేలిక కనుక తెలుగువాళ్లంతా చదవటమే కాక ముస్లింలు కూడా చదువ గలిగారు అని.)
మ:అతి మోదమ్మగు మిత్రమా!వినగ న య్యాకాశవాణిన్ సుస మ్మతమౌ రీతిని హెచ్చు తగ్గు లను నా మర్యాద తో విప్రు లీ చతురామ్నాయములం బఠింత్రు ,తురకల్ సామర్థ్యముం జూపుచున్” స్తుతు లల్లాకు నొనర్చు రీతి వినగా సొంపైన సంగీతమే. (హెచ్చు తగ్గులు = వేదమంత్రాలను ఉదాత్త అనుదాత్తాలను పాటిస్తూ చదవటం ఒక సంగీతం గా ఉంటుంది.అలాగే మహమ్మదీయులు అల్లాకు చేసే నమాజు ప్రార్థనలు కూడా లయబద్ధ సంగీతంగా ఉంటాయి.ఇవి పూర్వం రేడియో లో చక్కగా వినిపించేవి. ఆ సంస్కృతి మొత్తం ఇప్పుడు నాశన మయ్యింది. )
మేము బియస్సీ చదివేపుడు శ్రీ జయతీర్థ అని మా ఆంగ్లోపన్యాసకులు ఉర్దూ కూడా చాల చక్కగా వ్రాసేవారు చదివేవారండి. శ్రీ ఇబ్రహీం సుతార్ (పద్మశ్రీ పురస్కార గ్రహీత) అని కర్నాటకలో హిందూ సంస్కృతి పైన ప్రవచనాలు చాలా చక్కగా చెప్పేవారు.
కందం
రిప్లయితొలగించండిహితమొనరించెడు జ్ఞానము
క్షితిపై నరజాతికొసఁగుఁ జేకొను మంచున్
బ్రతులందఁగ నుర్దూనన్
జతురామ్నాయములఁ జదువఁ జాలిరి తురకల్
మత్తేభవిక్రీడితము
హితమందించును మానవాళికని సంధింపంగఁ బల్ భాషలన్
క్షితిపై నెల్లరు నమ్ముచున్ జదివి సంక్షేమమ్ములన్ గాంచుచున్
బ్రతులుర్దూన లభించఁగన్ బడసి సద్భాగ్యమ్ముగానెంచుచున్
చతురామ్నాయములన్ బఠింత్రు తురకల్ సామర్థ్యముం జూపుచున్
చతురుల్ భాషణమందు కోవిదులు ప్రజ్ఞాశాలురౌ పండితుల్
రిప్లయితొలగించండివితతంబౌవిధి బోధనల్ సలుపగన్ వేదాలలో సారమున్
మతభేదమ్మును వీడి నిశ్చయముగా సన్మార్గ సంధాతలై
చతురామ్నాయములం బఠింత్రు తురకల్ సామర్థ్యముం జూపుచున్
అతులిత ప్రజ్ఞాశాలుర
రిప్లయితొలగించండిహిత వచనమ్ములను వినగ హెచ్చిన నిరతిన్
మతభేదము మదినెంచక
చతురామ్నాయములఁ జదువఁ జాలిరి తురకల్
స్మృతుల నెరుగ దలచినపుడు
రిప్లయితొలగించండియితముగ భాష తెలుసుకొని యెవ్వరి దనకన్
మతమును ప్రక్కన బెట్టుచు
చతురామ్నాయములఁ జదువఁ జాలిరి తురకల్
రిప్లయితొలగించండిక్రతువుల జీసెడి మంత్రము
లతి కష్టం బైననేమీ యాగమములనే
మతభేదము విడి నేర్చుచు
చతురామ్నాయములఁ జదువఁ జాలిరి తురకల్.
క్రతువుల్ జేయుట గాంచి యయ్యదియె సత్కార్యంబు గా నెంచుచున్
మతభేదమ్మును వీడి ధర్మమును సమ్మానించుచున్ దీక్షతో
ప్రతినన్ బూనుచు దీర్ఘ దర్శి పదసేవన్ జేసి సాధించి నన్
చతురామ్నాయములం బఠింత్రు తురకల్ సామర్థ్యముం జూపుచున్.
ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
రిప్లయితొలగించండిశ్రుతులందాసక్తి కలిగి
తొలగించండిచతురామ్నాయములఁ జదువఁ జాలిరి; తురకల్
బ్రతిపాదింత్రు ఖురానును
మతంబు లన్నిటఁ గన నసమానంబనుచున్
శ్రుతులే పాఠములంచు ప్రాతపలుకుల్ శోధించు విద్యార్థులే
ప్రతిభాసక్తులతోడ విద్యపయినన్ ప్రత్యేకమౌ దృష్టితో
చతురామ్నాయములం బఠింత్రు; తురకల్ సామర్థ్యముం జూపుచున్
బ్రతిపాదింత్రు ఖురాను దొడ్డదనుచున్ ప్రాధాన్యతన్ జాటుచున్
-
రిప్లయితొలగించండిఇతరము లన్నియు మాయయె
సతతము హరినామమే ముసాంబ్రముగా స
న్మతమే యాఅల్లా యని
చతురామ్నాయములఁ జదువఁ జాలిరి తురకల్
కం:శృతి యే జీవననాదము
రిప్లయితొలగించండిహిత మని నీ వనువదింప హే దాశరథీ!
ప్రతి తెలుగు వాడు జదివెను
చతురామ్నాయములఁ జదువఁ జాలిరి తురకల్”
(శృతియే జీవన నాదము= "వేదం జీవన నాదం" అనే పేరు తో దాశరథి రంగాచార్య గారు తెలుగు లోకి అనువాదం చేసారు. అప్పుడు అది తేలిక కనుక తెలుగువాళ్లంతా చదవటమే కాక ముస్లింలు కూడా చదువ గలిగారు అని.)
మ:అతి మోదమ్మగు మిత్రమా!వినగ న య్యాకాశవాణిన్ సుస
రిప్లయితొలగించండిమ్మతమౌ రీతిని హెచ్చు తగ్గు లను నా మర్యాద తో విప్రు లీ
చతురామ్నాయములం బఠింత్రు ,తురకల్ సామర్థ్యముం జూపుచున్”
స్తుతు లల్లాకు నొనర్చు రీతి వినగా సొంపైన సంగీతమే.
(హెచ్చు తగ్గులు = వేదమంత్రాలను ఉదాత్త అనుదాత్తాలను పాటిస్తూ చదవటం ఒక సంగీతం గా ఉంటుంది.అలాగే మహమ్మదీయులు అల్లాకు చేసే నమాజు ప్రార్థనలు కూడా లయబద్ధ సంగీతంగా ఉంటాయి.ఇవి పూర్వం రేడియో లో చక్కగా వినిపించేవి. ఆ సంస్కృతి మొత్తం ఇప్పుడు నాశన మయ్యింది. )
మ॥ చతురుల్ నేర్వ మతమ్ము నడ్డగునె ప్రస్తావించఁగన్ బ్రీతియే
రిప్లయితొలగించండిసతతమ్మెవ్వరి కైన దారిఁగను నిస్సందేహమీ సూత్రమున్
వితతాసక్త మనస్కులై పరఁగఁగన్ విద్యాభిలాషా ధృతిన్
జతురామ్నాయములం బఠింత్రు తురకల్ సామర్థ్యముంజూపుచున్
మేము బియస్సీ చదివేపుడు శ్రీ జయతీర్థ అని మా ఆంగ్లోపన్యాసకులు ఉర్దూ కూడా చాల చక్కగా వ్రాసేవారు చదివేవారండి. శ్రీ ఇబ్రహీం సుతార్ (పద్మశ్రీ పురస్కార గ్రహీత) అని కర్నాటకలో హిందూ సంస్కృతి పైన ప్రవచనాలు చాలా చక్కగా చెప్పేవారు.
జతనము జేతను గొందరు
రిప్లయితొలగించండిచ తు రా మ్నా యముల జదువ జాలిరి :: తురకల్
మత పర మైన నమాజు ను
ప్రతి దినమును వి డువ కుండ భక్తి నొనర్తు ర్
వితతమ్ము రాజ్య మేలిరి
రిప్లయితొలగించండిమతములు వేరైన నేమి మన దేశమునన్
సత ముండ భారతీయుల
చతు రామ్నాయములఁ జదువఁ జాలిరి తురకల్
[ఆమ్నాయము = కులము]
వితతానందము నందు మున్గుదు రిలం బెంపొంది విత్తమ్ములన్
సతతం బుందురు నృత్య గానముల నిస్సందేహ మెందేనియున్
వ్రత దారావళి మాంస భోజన సురాపా నోపవాసమ్ము ల
న్చతురామ్నాయములం బఠింత్రు తురకల్ సామర్థ్యముం జూపుచున్
[.....ఉపవాసమ్ములు + అను + చతురామ్నాయమ్ములం; ఆమ్నాయము = సముదాయము]
పరమానందము నందు మున్గుదురు సంపాదించి విత్తమ్ములం
జిర కాలమ్మును నృత్య గానముల నిశ్చింతం బ్రవర్తించుచుం
బరిగృహ్యావళి మాంస భోజన సురాపా నోపవాసమ్ము ల
న్పరమామ్నాయ చతుష్టయమ్ముఁ దురకల్ వల్లింత్రు రమ్యంబుగా
[పొరపాటున ర ప్రాసతోఁ బద్యము పూర్తి యయినది. పద్యము బాగున్నది కదా యని సమస్యను మార్చి క్రొత్త సమస్యను సృష్టించితిని.]