2, నవంబర్ 2026, సోమవారం

సమస్య - 5639

3-11-2026 (మంగళవారం)

ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...

“బకనామజపంబుచేతఁ బడయమె ముక్తిన్”

(లేదా...)

“బకనామమ్ముఁ జపింప మోక్షమది సంప్రాప్తంబు గాకుండునే”

9 కామెంట్‌లు:

  1. కందము
    ఇక పంచాక్షరి మంత్రమ
    గు కీలక "నమశ్శివాయ" కు యలవడంగన్
    సకలమమరునయ్య త్రయం
    బక నామ జపంబు చేత బడయమె ముక్తిన్

    దైవజ్ఞ రత్న-సర్వ కళాభిజ్ఞ
    డాక్టర్ బొక్కా శ్రీనివాసరావు
    ఎన్-ఫోర్సుమెంట్ ఆఫీసర్ (విశ్రాంత)
    9030734124

    రిప్లయితొలగించండి
  2. కందం
    సకలానర్థక విషమా
    గక రేగన్ గుడిచెనట జగద్రక్షణకై
    నికరముగ శివములిడు త్ర్యం
    బకనామజపంబుచేతఁ బడయమె ముక్తిన్!

    మత్తేభవిక్రీడితము
    సకలమ్మున్ లయమొందఁజేయు విషమే సంధింప క్షీరాబ్ధి తా
    నకలంకుండన భక్తవత్సలునిగా నందెన్ మహేశుండహో
    నికరంబెంచఁగ నిత్యమున్ శివములందింపన్ విలోకించు త్ర్యం
    బకనామమ్ముఁ జపింప మోక్షమది సంప్రాప్తంబు గాకుండునే!

    రిప్లయితొలగించండి
  3. సకలము మంచినె సలిపితి ,
    నకారణమయిన విధముగ నాక్షే పించే
    చకితమున, నాదు కొనత్ర్యం
    బకనామజపంబుచేతఁ బడయమె ముక్తిన్

    రిప్లయితొలగించండి
  4. మత్తేభము:
    అకలంకంబగు భక్తి నెక్కొనగ నవ్యాజంపు తాదాత్మ్యతన్
    వికచాంభోరుహ చంచరీకము వలెన్ ప్రీతిన్ జటాధారి స
    ర్వకరున్ హృత్కమలంబునందునిచి నిర్వ్యాజమ్ము పెంపార త్ర్యం
    బకనామమ్ముఁ జపింప మోక్షమది సంప్రాప్తంబు గాకుండునే

    రిప్లయితొలగించండి
  5. సకలము వ్యాప్తి o జెందియు
    వికసిత రూపమున మించు విశ్వే శ్వ రు నిన్
    త్రికరణ శుద్ధు లు గను త్ర్య o
    బక నామ జపంబు చేత బడ య మె ముక్తి న్

    రిప్లయితొలగించండి

  6. సకాలర్థంబుల నొసగెడి
    యకాయడా యంతకహరు డసమాంబకు డై
    న కపాల ధారియగు త్ర్యం
    బకనామజపంబుచేతఁ బడయమె ముక్తిన్.


    సకలార్థంబుల నిచ్చు వాడనేడి విశ్వాసంబు తోనిత్యమున్
    సికలో చంద్రుని దాల్చి దివ్యనదినే శీర్షమ్ము పై, దార యం
    బిక దేహార్ధము నిల్పుకొన్న ఘనుడా విశ్వాత్ముడైనట్టి త్ర్యం
    బకనామమ్ముఁ జపింప మోక్షమది సంప్రాప్తంబు గాకుండునే.

    రిప్లయితొలగించండి
  7. -
    కలడతడం......


    నికటము ప్రకటంబెందై
    న కటాక్షము కలదు సూవె నమ్మిక తోడై
    టకటక రారండి తతిని
    బకనామజపంబుచేతఁ బడయమె ముక్తిన్


    .

    రిప్లయితొలగించండి
  8. ప్రకటిత పరాక్రమముతో
    సకల జనుల మేలు గూర్చు శంకరుడతడే
    త్రికరణశుద్ధిగ నసమాం
    బకనామజపంబుచేతఁ బడయమె ముక్తిన్

    ప్రకటంబైన పరాక్రమంబు తనదై భాసిల్లు ముక్కంటిగా
    సకలప్రాణుల రక్షకై గరళమాస్వాదింప శంకింపడే
    మకరాంకుండను బూదిచేసిన విభున్ మల్లారినేగొల్తు త్ర్యం
    బకనామమ్ముఁ జపింప మోక్షమది సంప్రాప్తంబు గాకుండునే

    రిప్లయితొలగించండి