4, నవంబర్ 2026, బుధవారం

సమస్య - 5641

5-11-2026 (గురువారం)

ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...

“అమ్మను నన్నుఁ గనిన మహితాత్మున్ గొల్తున్”

(లేదా...)

“అమ్మను నన్నుఁ గన్న మహితాత్ముఁ దలంచెద నెమ్మనమ్మునన్”

2 కామెంట్‌లు:

  1. ఒక కుమారుని మానసం..

    కందం
    ఇమ్ముగ గృహమును నడుపుచుఁ
    గమ్మని వరమై, ప్రమాద ఘటనన్ జిక్కన్
    దమ్మము దప్పక చూడగ
    నమ్మను, నన్నుఁ గనిని మహితాత్మున్ గొల్తున్ఏమ

    ఉత్పలమాల
    ఇమ్ముగ నింటి దీపముగ నెల్లరి సేమము ముచ్చటన్ గనన్
    గమ్మగ మాకు వరమ్మనఁగ,గాయమునొందఁ బ్రమాదసంఘటన్
    దమ్మము దప్పకే తనకు దంపతియంచును నోర్మిఁ జూడఁగా
    నమ్మను, నన్నుఁ గన్న మహితాత్ముఁ దలంచెద నెమ్మనమ్మునన్

    రిప్లయితొలగించండి
  2. రమ్మని తనయింటికి మము
    కమ్మని భోజనము బెట్టి కడు దయతోడన్
    మమ్ముల పరచియు చల్లగ
    అమ్మను నన్నుఁ గనిన మహితాత్మున్ గొల్తున్”

    రిప్లయితొలగించండి