7, జూన్ 2026, ఆదివారం

సమస్య - 5491

8-6-2026 (సోమవారం)

కవిమిత్రులారా,

ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...

“శ్రీపతిఁ గని యైదు పదిగఁ జేతురు భక్తుల్”

(లేదా...)

“శ్రీపతిఁ గాంచి యైదు పదిఁ జేతురు భక్తులు శాంతచిత్తులై”

(బందరు దుర్గాప్రసాద్ గారికి ధన్యవాదాలతో...)

4 కామెంట్‌లు:

  1. కందం
    ఆపద మ్రొక్కుల వాడని
    చూపుచు కడు భక్తి తోడ స్తోత్రములందున్
    పాప వినాశకుడంచును
    శ్రీపతిఁ గని యైదు పదిగఁ జేతురు భక్తుల్

    ఉత్పలమాల
    ఆపదలందు గాచునని యంబుజ నేత్రుని భక్తవత్సలున్
    జూపుచు భక్తితత్పరత స్తోత్రము చేయుచు వేయినామముల్
    పాపవినాశకున్ గృపను బంచెడు వాడని శేషశాయినిన్
    శ్రీపతిఁ గాంచి యైదు పదిఁ జేతురు భక్తులు శాంతచిత్తులై!

    రిప్లయితొలగించండి
  2. చూపుము నాపై కరుణను
    తాపము నుండి యతి వడిగ దప్పించినచో
    కోపు లయిదు యిడెదనని
    శ్రీపతిఁ గని యైదు పదిగఁ జేతురు భక్తుల్

    రిప్లయితొలగించండి
  3. ఆపర మాత్మకు మ్రొక్కినఁ
    బాపములే తొలగుననుచు భావింతురుగా
    చేపడు సౌభాగ్యమనుచు
    శ్రీపతిఁ గని యైదు పదిగఁ జేతురు భక్తుల్


    ఆపరమాత్మ ముందు సిసులందరు నిల్తురు కేలు మోడ్చుచున్
    బాపములన్ హరింపమని భక్తులు కోరుట సాజమే కదా
    శ్రీపతిఁ గాంచి యైదు పదిఁ జేతురు భక్తులు శాంతచిత్తులై
    చేపడు గాదె సౌఖ్యములు చేతులు రెంటిని జోడగించినన్

    రిప్లయితొలగించండి