9-6-2026 (మంగళవారం)
కవిమిత్రులారా,
ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...
“ఆకాశవాణి సతముఁ గల్లలాడు”
(లేదా...)
“ఆకాశవాణి నిరంతరమ్మును గల్లలే పలుకున్ గదా”
(ఛందోగోపనం - మొన్న ఆకాశవాణి వారి న.చ.సాహిత్ అష్టావధానంలో నా సమస్య)
ఆటవెలదికచ్చితమగు వార్త లిచ్చు మాధ్యమమనఁబ్రభుత చేయు మంచి పనులఁ దెలుపవిని విపక్షమోర్వదన వారి దృష్టి నాకాశవాణి సతముఁ గల్లలాడుమత్తకోకిలలేశమైననసత్య మాడక రీతి గా వచియించు నిర్దేశమై ప్రజ మెచ్చు శీర్షికలే ప్రసారమొనర్చుచున్దేశమొందెడు వృద్ధిఁదెల్పనదే విపక్షపు దృష్టి నాకాశవాణి నిరంతరమ్మును గల్లలే పలుకున్ గదా!
ప్రాభవమొనరించు ప్రఖ్యాతమైన ఆకాశవాణి సతముఁ గల్లలాడుప్రసరణము సలిపెడు వార్తలు వినినంత రోత కలుగు చుండు శ్రోత లకును
ఆటవెలది
రిప్లయితొలగించండికచ్చితమగు వార్త లిచ్చు మాధ్యమమనఁ
బ్రభుత చేయు మంచి పనులఁ దెలుప
విని విపక్షమోర్వదన వారి దృష్టి నా
కాశవాణి సతముఁ గల్లలాడు
మత్తకోకిల
లేశమైననసత్య మాడక రీతి గా వచియించు ని
ర్దేశమై ప్రజ మెచ్చు శీర్షికలే ప్రసారమొనర్చుచున్
దేశమొందెడు వృద్ధిఁదెల్పనదే విపక్షపు దృష్టి నా
కాశవాణి నిరంతరమ్మును గల్లలే పలుకున్ గదా!
ప్రాభవమొనరించు ప్రఖ్యాతమైన ఆ
రిప్లయితొలగించండికాశవాణి సతముఁ గల్లలాడు
ప్రసరణము సలిపెడు వార్తలు వినినంత
రోత కలుగు చుండు శ్రోత లకును