6, జులై 2026, సోమవారం

సమస్య - 5520

7-7-2026 (మంగళవారం)
ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...
“ఆవకాయను రోసెద రాంధ్రజనులు”
(లేదా...)
“ఆవకాయను రోయువారలె యాంధ్రులంచు గణించెదన్”

2 కామెంట్‌లు:

  1. తేటగీతి
    అమృతమునకంటె ముందుగ నబ్ధిఁబుట్టి
    దేవవైద్యుడె జాడిలో తీర్చిపంచ
    దివ్యమైనవె కోరెడున్ దృష్టిఁగలుగ
    నావకాయను రోసెద రాంధ్రజనులు

    మత్తకోకిల
    జీవగర్రగ మెచ్చ వేల్పులు సృష్టి కర్త సమేతమై
    యావకాయ సుధాదియౌచును నద్భుతమ్ముగ నబ్ధిపై
    దేవవైద్యుఁడె జాడిలోనిడ, దివ్యమైనవె యెంచు వా
    రావకాయను రోయువారలె యాంధ్రులంచు గణించెదన్

    రిప్లయితొలగించండి
  2. వేసవిని తినుచుండగ వేడిమియని
    నావకాయను రోసెద రాంధ్రజనులు ,
    మిగిలిన వరుసమంతయు మెచ్చుకొనుచు
    పెరుగు యన్నముతోడుత విడువరెపుడు

    రిప్లయితొలగించండి