2-7-2026 (గురువారం)ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...“కాశ్మీరము మోక్షమిచ్చుఁగద యెల్లరకున్”(లేదా...)“కాశ్మీరమ్ము సమస్త లోకులకు మోక్షంబిచ్చు నెల్లప్పుడున్”
కాశ్మీరము చక్కనిదనికాశ్మీరపు సొగసు చూడఁ గాంక్షింతురుగాకూశ్మాండాదులు కూల్చగకాశ్మీరము మోక్షమిచ్చుఁగద యెల్లరకున్కాశ్మీరమ్మొక చక్కనైన స్థలమై కన్విందుగావించుగా కాశ్మీరంపు బెడంగులన్ గనుగొనన్ గాంక్షింతురే యాత్రికుల్కూశ్మాండాదులు తీవ్రవాదులకటా క్రొవ్వెక్కి పేట్రేగగా కాశ్మీరమ్ము సమస్త లోకులకు మోక్షంబిచ్చు నెల్లప్పుడున్[ కూశ్మాండాదులు = భూతాలు, ప్రేతాలు, పిశాచాలు, కూశ్మాండులు మొదలగు terrorists]
రేశ్మా పట్టణ మదియే కాశ్మీరమ్మని యెఱుగవె, కైవల్య మిడన్ కాశ్మీరు గుడియ? యెవ్విధి కాశ్మీరము మోక్షమిచ్చుఁగద యెల్లరకున్?రశ్మీ యేల వచించినావిటుల మూర్ఖత్వం బటంచందురే కాశ్మీరయ్యది భారతావనిని ప్రఖ్యాతమ్మదే యైన నా కాశ్మీరమ్మన దైవతాయతనమా? కానప్పు డేరీతి గా కాశ్మీరమ్ము సమస్త లోకులకు మోక్షంబిచ్చు నెల్లప్పుడున్?
కందంకాశ్మీరపుటందమునకుకాశ్మీరపుటందమెసరి! కలుష రహితమైకాశ్మీరము మన, శివ హృత్కాశ్మీరము మోక్షమిచ్చుఁగద యెల్లరకున్శార్దూలవిక్రీడితముకాశ్మీరమ్మది స్వర్గమేయనగ నా కాశ్మీరమేసాటియౌకాశ్మీరమ్మునకున్! ధరాతలమునన్ఖ్యాతిన్ గొనన్ శోభలన్గాశ్మీరమ్ము మనంగ, శంకరుని భక్త్యాత్మమ్మునన్ గొల్వ హృత్కాశ్మీరమ్ము సమస్త లోకులకు మోక్షంబిచ్చు నెల్లప్పుడున్
కశ్మలమొందు నొడలు రవిరశ్మి తగులగనె తపమున లాంఛన ముగనే కాశ్మీర శీతము కతనకాశ్మీరము మోక్షమిచ్చుఁగద యెల్లరకున్
శా॥ కాశ్మీరమ్మిల పుణ్య భూమిగద యాకాంక్షించి పూజించఁగన్గాశ్మీరమ్మున దేవళమ్ములటు విఖ్యాతమ్ముతోనొప్పఁగన్గాశ్మీరమ్మున దైవ చింతనఁగనన్ గార్యమ్ము సిద్ధించదోకాశ్మీరమ్ము సమస్త లోకులకు మోక్షంబిచ్చు నెల్లప్పుడున్
కం:గ్రీష్మము నందున సూర్యుని రశ్మియు బాధించదయ్య!రావే నాతో !కాశ్మీరమునకు, నెండలకాశ్మీరము మోక్షమిచ్చుఁగద యెల్లరకున్”(శ ష లకు ప్రాస చెల్లుతుందా? అనేది పండితులు తెలుప గోరుతున్నాను.)
శా:గ్రీష్మ మ్మందును గల్గ దింత యయినన్ గ్లేశమ్ము, తా తీవ్రమౌరశ్మిన్ జూపడు భానుడున్, సరళమై రంజించు నా రశ్మి, రా!కాశ్మీరమ్మును జూచి వత్తము సఖా! కష్టాల గ్రీష్మమ్ము లోకాశ్మీరమ్ము సమస్త లోకులకు మోక్షంబిచ్చు నెల్లప్పుడున్”
కాశ్మీరము చక్కనిదని
రిప్లయితొలగించండికాశ్మీరపు సొగసు చూడఁ గాంక్షింతురుగా
కూశ్మాండాదులు కూల్చగ
కాశ్మీరము మోక్షమిచ్చుఁగద యెల్లరకున్
కాశ్మీరమ్మొక చక్కనైన స్థలమై కన్విందుగావించుగా
కాశ్మీరంపు బెడంగులన్ గనుగొనన్ గాంక్షింతురే యాత్రికుల్
కూశ్మాండాదులు తీవ్రవాదులకటా క్రొవ్వెక్కి పేట్రేగగా
కాశ్మీరమ్ము సమస్త లోకులకు మోక్షంబిచ్చు నెల్లప్పుడున్
[ కూశ్మాండాదులు = భూతాలు, ప్రేతాలు, పిశాచాలు, కూశ్మాండులు మొదలగు
terrorists]
రిప్లయితొలగించండిరేశ్మా పట్టణ మదియే
కాశ్మీరమ్మని యెఱుగవె, కైవల్య మిడన్
కాశ్మీరు గుడియ? యెవ్విధి
కాశ్మీరము మోక్షమిచ్చుఁగద యెల్లరకున్?
రశ్మీ యేల వచించినావిటుల మూర్ఖత్వం బటంచందురే
కాశ్మీరయ్యది భారతావనిని ప్రఖ్యాతమ్మదే యైన నా
కాశ్మీరమ్మన దైవతాయతనమా? కానప్పు డేరీతి గా
కాశ్మీరమ్ము సమస్త లోకులకు మోక్షంబిచ్చు నెల్లప్పుడున్?
కందం
రిప్లయితొలగించండికాశ్మీరపుటందమునకు
కాశ్మీరపుటందమెసరి! కలుష రహితమై
కాశ్మీరము మన, శివ హృ
త్కాశ్మీరము మోక్షమిచ్చుఁగద యెల్లరకున్
శార్దూలవిక్రీడితము
కాశ్మీరమ్మది స్వర్గమేయనగ నా కాశ్మీరమేసాటియౌ
కాశ్మీరమ్మునకున్! ధరాతలమునన్ఖ్యాతిన్ గొనన్ శోభలన్
గాశ్మీరమ్ము మనంగ, శంకరుని భక్త్యాత్మమ్మునన్ గొల్వ హృ
త్కాశ్మీరమ్ము సమస్త లోకులకు మోక్షంబిచ్చు నెల్లప్పుడున్
కశ్మలమొందు నొడలు రవి
రిప్లయితొలగించండిరశ్మి తగులగనె తపమున లాంఛన ముగనే
కాశ్మీర శీతము కతన
కాశ్మీరము మోక్షమిచ్చుఁగద యెల్లరకున్
శా॥ కాశ్మీరమ్మిల పుణ్య భూమిగద యాకాంక్షించి పూజించఁగన్
రిప్లయితొలగించండిగాశ్మీరమ్మున దేవళమ్ములటు విఖ్యాతమ్ముతోనొప్పఁగన్
గాశ్మీరమ్మున దైవ చింతనఁగనన్ గార్యమ్ము సిద్ధించదో
కాశ్మీరమ్ము సమస్త లోకులకు మోక్షంబిచ్చు నెల్లప్పుడున్
కం:గ్రీష్మము నందున సూర్యుని
రిప్లయితొలగించండిరశ్మియు బాధించదయ్య!రావే నాతో !
కాశ్మీరమునకు, నెండల
కాశ్మీరము మోక్షమిచ్చుఁగద యెల్లరకున్”
(శ ష లకు ప్రాస చెల్లుతుందా? అనేది పండితులు తెలుప గోరుతున్నాను.)
శా:గ్రీష్మ మ్మందును గల్గ దింత యయినన్ గ్లేశమ్ము, తా తీవ్రమౌ
రిప్లయితొలగించండిరశ్మిన్ జూపడు భానుడున్, సరళమై రంజించు నా రశ్మి, రా!
కాశ్మీరమ్మును జూచి వత్తము సఖా! కష్టాల గ్రీష్మమ్ము లో
కాశ్మీరమ్ము సమస్త లోకులకు మోక్షంబిచ్చు నెల్లప్పుడున్”