2, సెప్టెంబర్ 2026, బుధవారం

సమస్య - 5578

3-9-2026 (గురువారం)

ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...

“సిగ లేని సతికిఁ బువులిడ శ్రేయమ్మె యగున్”

(లేదా...)

“సిగ లేనట్టి పడంతికిన్ బువులిడన్ శ్రేయమ్ము మోదంబగున్”

(పట్వర్ధన్ గారి శతావధానంలో కొండా యాదగిరి గారి సమస్య)

4 కామెంట్‌లు:

  1. నగరిని నా రీతిగ దన
    మగనిని పూజించు మగువ మరువడు ననుచున్
    పొగరు మనసు నందున వా
    సిగ లేని సతికిఁ బువులిడ శ్రేయమ్మె యగున్

    రిప్లయితొలగించండి
  2. కందం
    మగనిని నుసిగొల్పునటులఁ
    దగులుచుఁ బిరుదుల జడలవి తప్పెటఁగొట్టన్
    రగులదె పతికిన్! కృత్రిమ
    సిగ లేని సతికిఁ బువులిడ శ్రేయమ్మె యగున్!

    మత్తేభవిక్రీడితము
    మగడున్ దాపము నందునన్ మునుగ భామారత్నమాడంగనే
    దగులన్ మాటికి మాటికిన్ బిరుదులన్ దప్పెట్ల మోగించుచున్
    రగులన్ జేయదె? వేణియా మగనికన్ రంజించుచున్! బెట్టుడున్
    సిగ లేనట్టి పడంతికిన్ బువులిడన్ శ్రేయమ్ము మోదంబగున్!

    రిప్లయితొలగించండి

  3. మగువలు సౌభాగ్య మనుచు
    సిగలో ధరియింత్రు పూలు, చేతనట క్రయిం
    పగ నాదాయమ్మది వా
    సిగ లేని సతికిఁ బువులిడ శ్రేయమ్మె యగున్.


    మగువల్ సౌభగమంచు నెంచెద రిలన్ మాంగళ్యమున్ గంఠమున్
    సిగలో పూవులు ఫాలమందు కనగన్ చిత్రమ్ము నే దాల్చుటే,
    జగతిన్ స్త్రీలను గౌరవించుచు నిటన్ సంపాదనన్ గాంచ వా
    సిగ లేనట్టి పడంతికిన్ బువులిడన్ శ్రేయమ్ము మోదంబగున్.

    రిప్లయితొలగించండి
  4. సిగలో పూలే వలపుల
    సెగలే రేపుట సహజము చిత్తము నందున్
    మగనిపయి నలుకతో సర
    సిగ లేని సతికిఁ బువులిడ శ్రేయమ్మె యగున్

    పగలేవెన్నెల సేయమంచు సతమున్ వాక్రుచ్చుచున్ బ్రేమతో
    మగడేభార్యకు మల్లెపూలనిడు సమ్మానింప భావించుచున్
    దగునేనీకివి యంచు యొప్పిదముగా తానెంచుచున్ వన్నెవా
    సిగ లేనట్టి పడంతికిన్ బువులిడన్ శ్రేయమ్ము మోదంబగున్

    రిప్లయితొలగించండి