2, సెప్టెంబర్ 2026, బుధవారం

సమస్య - 5578

3-9-2026 (గురువారం)

ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...

“సిగ లేని సతికిఁ బువులిడ శ్రేయమ్మె యగున్”

(లేదా...)

“సిగ లేనట్టి పడంతికిన్ బువులిడన్ శ్రేయమ్ము మోదంబగున్”

(పట్వర్ధన్ గారి శతావధానంలో కొండా యాదగిరి గారి సమస్య)

15 కామెంట్‌లు:

  1. నగరిని నా రీతిగ దన
    మగనిని పూజించు మగువ మరువడు ననుచున్
    పొగరు మనసు నందున వా
    సిగ లేని సతికిఁ బువులిడ శ్రేయమ్మె యగున్

    రిప్లయితొలగించండి
  2. కందం
    మగనిని నుసిగొల్పునటులఁ
    దగులుచుఁ బిరుదుల జడలవి తప్పెటఁగొట్టన్
    రగులదె పతికిన్! కృత్రిమ
    సిగ లేని సతికిఁ బువులిడ శ్రేయమ్మె యగున్!

    మత్తేభవిక్రీడితము
    మగడున్ దాపము నందునన్ మునుగ భామారత్నమాడంగనే
    దగులన్ మాటికి మాటికిన్ బిరుదులన్ దప్పెట్ల మోగించుచున్
    రగులన్ జేయదె? వేణియా మగనికన్ రంజించుచున్! బెట్టుడున్
    సిగ లేనట్టి పడంతికిన్ బువులిడన్ శ్రేయమ్ము మోదంబగున్!

    రిప్లయితొలగించండి

  3. మగువలు సౌభాగ్య మనుచు
    సిగలో ధరియింత్రు పూలు, చేతనట క్రయిం
    పగ నాదాయమ్మది వా
    సిగ లేని సతికిఁ బువులిడ శ్రేయమ్మె యగున్.


    మగువల్ సౌభగమంచు నెంచెద రిలన్ మాంగళ్యమున్ గంఠమున్
    సిగలో పూవులు ఫాలమందు కనగన్ చిత్రమ్ము నే దాల్చుటే,
    జగతిన్ స్త్రీలను గౌరవించుచు నిటన్ సంపాదనన్ గాంచ వా
    సిగ లేనట్టి పడంతికిన్ బువులిడన్ శ్రేయమ్ము మోదంబగున్.

    రిప్లయితొలగించండి
  4. సిగలో పూలే వలపుల
    సెగలే రేపుట సహజము చిత్తము నందున్
    మగనిపయి నలుకతో సర
    సిగ లేని సతికిఁ బువులిడ శ్రేయమ్మె యగున్

    పగలేవెన్నెల సేయమంచు సతమున్ వాక్రుచ్చుచున్ బ్రేమతో
    మగడేభార్యకు మల్లెపూలనిడు సమ్మానింప భావించుచున్
    దగునేనీకివి యంచు యొప్పిదముగా తానెంచుచున్ వన్నెవా
    సిగ లేనట్టి పడంతికిన్ బువులిడన్ శ్రేయమ్ము మోదంబగున్

    రిప్లయితొలగించండి
  5. -
    భగభగ బంగారమ్ము! బ
    డుగుజీవికి మాటలే గడు పసిడి గానన్
    నగలు కొనెదనని చెవిలో,..
    “సిగ లేని సతికిఁ,... బువులిడ శ్రేయమ్మె యగున్


    రిప్లయితొలగించండి
  6. సిగలో బువ్వులె కోమలాంగులకిలన్ చేకూర్చునందమ్ము వా
    సిగ స్వర్ణాభరణమ్ములైన సతికిన్ జేయించ సమ్మోదమే
    సిగ లేనట్టి పడంతికిన్ బువులిడన్ శ్రేయమ్ము మోదంబగున్
    జగదీశున్ గొలువన్ ప్రసూనములతో సద్భక్తి యేపారగన్

    రిప్లయితొలగించండి
  7. నగలే కైసేఁత యగును
    సిగ లేని సతికిఁ, బువులిడ శ్రేయమ్మె యగున్
    భగవానుని పూజింపఁగ
    మగువ మనసు దెలిసి మగఁడు మసలుట మేలౌ

    రిప్లయితొలగించండి
  8. కం:మగడు గతించగ పోయెను
    సిగయును, నా పేదరాలి చేతికి నిడుడీ
    మిగిలిన కాలీ ఫ్లవరును
    సిగ లేని సతికిఁ బువులిడ శ్రేయమ్మె యగున్”
    (వితంతువు కు కాలీ ఫ్లవర్ వండుకోటానికి ఇవ్వ వచ్చు కదా! అది పువ్వే. )

    రిప్లయితొలగించండి
  9. మ:సిగయే లేని వితంతు వామె బతుకున్ చేమంతి పూ లమ్ముచున్
    మిగులన్ బూచెను పుష్పముల్ పెరటిలో మీ రెన్నిటిన్ దాల్చినన్
    మిగులున్ పెక్కుగ, వాని నామె కిడరే, మే లైన సాహాయ్య మౌ
    సిగ లేనట్టి పడంతికిన్ బువులిడన్ శ్రేయమ్ము మోదంబగున్”

    (ఆ వితంతువు పూలు పెట్టుకోదు కానీ అమ్ముకోటానికి పనికొస్తాయి కదా!)



    రిప్లయితొలగించండి
  10. మ॥ మగనిన్ మెచ్చుచు గౌరవమ్మునిడి నేమంబొంది శ్రద్ధావిధిన్
    వగలన్ జూపక బాధ్యతా పరిని సంభావించి చేదోడుగన్
    నగవుల్ బంచుచుఁ గేశముల్ తలనటుల్ నవ్యంబునై యొప్ప బో
    సిగ లేనట్టి పడంతికిన్ బువులిడన్ శ్రేయంబు మోదంబగున్

    రిప్లయితొలగించండి
  11. హమ్మయ్య !

    పగలే వన్నెల చూపు తోడు మగడిన్ బాళిన్ ప్రకాశమ్ముగా
    జగమే వూయల గాను జేయ బిలువన్ జాప్యమ్ములేలా!వడిన్
    మొగుడై బుట్టను తప్పుగాదు చెవిలో మూరంత తోరమ్ముతో
    సిగ లేనట్టి పడంతికిన్ బువులిడన్ శ్రేయమ్ము మోదంబగున్




    రిప్లయితొలగించండి
  12. నిగనిగ మెరిసే కురులవి
    సొగసుగ సంస్కార ముగను శోభలు విధమై
    యగపడ గా మగడా బో
    సిగ లేని సతికి బువు లిడ శ్రేయ మ్మె యగున్

    రిప్లయితొలగించండి
  13. మగువల కిల జుట్టందము
    తగు రీతినిఁ బూల చెండు తల నిడ నంద
    మ్ముగఁ గన్పడంగ నల్పపు
    సిగ లేని సతికిఁ బువు లిడ శ్రేయమ్మె యగున్


    మగువల్ మెత్తురు మిక్కుటమ్ముగను సమ్యగ్రీతి భూషింప వా
    సిగ స్వీయోన్నత మూర్ధజమ్ములను నాక్షేపింప రాదేరికిం
    దగ నా కాంత కొసంగ నందమును మూర్ధం బందుఁ బుష్పాలి వా
    సిగ లేనట్టి పడంతికిం బువు లిడన్ శ్రేయమ్ము మోదం బగున్

    రిప్లయితొలగించండి
  14. పగలే వెన్నెల కాయగా మగువ తాఁ బ్రాణేశునిన్ దల్చుచున్
    సెగలన్ గ్రక్కగ మేను మారుడు వడిన్ చిత్తమ్ములో చేరగా
    స్వగృహమ్మందున చొక్క, భర్త కరమున్ బంధించుచున్ గొప్పు వా
    సిగ లేనట్టి పడంతికిన్ బువులిడన్ శ్రేయమ్ము మోదంబగున్

    రిప్లయితొలగించండి

  15. పిన్నక నాగేశ్వరరావు.
    హైదరాబాద్.

    తగిన సవరమ్ము నొసగుచు
    సిగ లేని సతికిఁ;బువులిడ శ్రేయమ్మె యగున్
    నగవులు చిందించుచు సతి
    పొగడెను సమయానుకూల పురుషుం
    డనుచున్.

    రిప్లయితొలగించండి