3-9-2026 (గురువారం)
ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...
“సిగ లేని సతికిఁ బువులిడ శ్రేయమ్మె యగున్”
(లేదా...)
“సిగ లేనట్టి పడంతికిన్ బువులిడన్ శ్రేయమ్ము మోదంబగున్”
(పట్వర్ధన్ గారి శతావధానంలో కొండా యాదగిరి గారి సమస్య)
నగరిని నా రీతిగ దన మగనిని పూజించు మగువ మరువడు ననుచున్పొగరు మనసు నందున వాసిగ లేని సతికిఁ బువులిడ శ్రేయమ్మె యగున్
కందంమగనిని నుసిగొల్పునటులఁదగులుచుఁ బిరుదుల జడలవి తప్పెటఁగొట్టన్రగులదె పతికిన్! కృత్రిమ సిగ లేని సతికిఁ బువులిడ శ్రేయమ్మె యగున్!మత్తేభవిక్రీడితము మగడున్ దాపము నందునన్ మునుగ భామారత్నమాడంగనేదగులన్ మాటికి మాటికిన్ బిరుదులన్ దప్పెట్ల మోగించుచున్రగులన్ జేయదె? వేణియా మగనికన్ రంజించుచున్! బెట్టుడున్సిగ లేనట్టి పడంతికిన్ బువులిడన్ శ్రేయమ్ము మోదంబగున్!
మగువలు సౌభాగ్య మనుచు సిగలో ధరియింత్రు పూలు, చేతనట క్రయిం పగ నాదాయమ్మది వా సిగ లేని సతికిఁ బువులిడ శ్రేయమ్మె యగున్.మగువల్ సౌభగమంచు నెంచెద రిలన్ మాంగళ్యమున్ గంఠమున్ సిగలో పూవులు ఫాలమందు కనగన్ చిత్రమ్ము నే దాల్చుటే,జగతిన్ స్త్రీలను గౌరవించుచు నిటన్ సంపాదనన్ గాంచ వా సిగ లేనట్టి పడంతికిన్ బువులిడన్ శ్రేయమ్ము మోదంబగున్.
సిగలో పూలే వలపులసెగలే రేపుట సహజము చిత్తము నందున్మగనిపయి నలుకతో సరసిగ లేని సతికిఁ బువులిడ శ్రేయమ్మె యగున్పగలేవెన్నెల సేయమంచు సతమున్ వాక్రుచ్చుచున్ బ్రేమతోమగడేభార్యకు మల్లెపూలనిడు సమ్మానింప భావించుచున్దగునేనీకివి యంచు యొప్పిదముగా తానెంచుచున్ వన్నెవాసిగ లేనట్టి పడంతికిన్ బువులిడన్ శ్రేయమ్ము మోదంబగున్
నగరిని నా రీతిగ దన
రిప్లయితొలగించండిమగనిని పూజించు మగువ మరువడు ననుచున్
పొగరు మనసు నందున వా
సిగ లేని సతికిఁ బువులిడ శ్రేయమ్మె యగున్
కందం
రిప్లయితొలగించండిమగనిని నుసిగొల్పునటులఁ
దగులుచుఁ బిరుదుల జడలవి తప్పెటఁగొట్టన్
రగులదె పతికిన్! కృత్రిమ
సిగ లేని సతికిఁ బువులిడ శ్రేయమ్మె యగున్!
మత్తేభవిక్రీడితము
మగడున్ దాపము నందునన్ మునుగ భామారత్నమాడంగనే
దగులన్ మాటికి మాటికిన్ బిరుదులన్ దప్పెట్ల మోగించుచున్
రగులన్ జేయదె? వేణియా మగనికన్ రంజించుచున్! బెట్టుడున్
సిగ లేనట్టి పడంతికిన్ బువులిడన్ శ్రేయమ్ము మోదంబగున్!
రిప్లయితొలగించండిమగువలు సౌభాగ్య మనుచు
సిగలో ధరియింత్రు పూలు, చేతనట క్రయిం
పగ నాదాయమ్మది వా
సిగ లేని సతికిఁ బువులిడ శ్రేయమ్మె యగున్.
మగువల్ సౌభగమంచు నెంచెద రిలన్ మాంగళ్యమున్ గంఠమున్
సిగలో పూవులు ఫాలమందు కనగన్ చిత్రమ్ము నే దాల్చుటే,
జగతిన్ స్త్రీలను గౌరవించుచు నిటన్ సంపాదనన్ గాంచ వా
సిగ లేనట్టి పడంతికిన్ బువులిడన్ శ్రేయమ్ము మోదంబగున్.
సిగలో పూలే వలపుల
రిప్లయితొలగించండిసెగలే రేపుట సహజము చిత్తము నందున్
మగనిపయి నలుకతో సర
సిగ లేని సతికిఁ బువులిడ శ్రేయమ్మె యగున్
పగలేవెన్నెల సేయమంచు సతమున్ వాక్రుచ్చుచున్ బ్రేమతో
మగడేభార్యకు మల్లెపూలనిడు సమ్మానింప భావించుచున్
దగునేనీకివి యంచు యొప్పిదముగా తానెంచుచున్ వన్నెవా
సిగ లేనట్టి పడంతికిన్ బువులిడన్ శ్రేయమ్ము మోదంబగున్