9-10-2026 (శుక్రవారం)
ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...
“జమునకుం బూజలందఁ గనె భాగ్యమ్మున్”
(లేదా...)
“జమున కెంత భాగ్యము ముఖమ్ము యుగాలుగఁ బూజ లందెడిన్”
(న.చ. సాహిత్ శతావధానంలో ఆచార్య ఫణీంద్ర గారి సమస్య)
(కందం లో చంపక పాదం)కం.తగుయోగముగల్గెనునింపుగ గ **జమున కెంత* *భాగ్యము ముఖమ్ము* **యుగా* *లుగఁ బూజ లందెడిన్* ”* పన్నగధారితనయుడగు గణనాథునిశిరమై
ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
అతివ యలిగెనని దెలియ నాతడిడగదార జమునకుం బూజలందఁ గనె భాగ్యమ్మున్ బడసెను మెండుగ నామె ముద్దులెన్నొ !ఆలికి రహి నిడుటలోన యధిపుడతడు
కందంధ్వజమెత్త సుతుని తలకైగజాసురుని శీర్షముంచి ఖండిత బాలున్నిజనాథుఁడు జూప సతికిగజమునకుం, బూజలందఁ గనె భాగ్యమ్మున్చంపకమాలధ్వజమున రెచ్చి పార్వతియె, త్ర్యక్షుఁడు బాలు గళమ్ము ద్రెంచఁగన్నిజపతిఁ దూలనాడగనె నివ్వెర పోయి గజాసురానమున్భుజముల పైన నిల్పి పరిపూర్ణత గూర్చ, శివాని మోదమైగజమున కెంత భాగ్యము ముఖమ్ము యుగాలుగఁ బూజ లందెడిన్
విజయార్థు లౌచు ధర భ క్తజనులు విఘ్నముల బాపు దైవమటంచున్ గజవదనుని కొలుతురు కద గజమునకుం బూజలందఁ గనె భాగ్యమ్మున్.అజితుడొసంగిన వరమది గజముఖు డేవిఘ్నరాజుగన్ దొలుతగ భ క్త జనులు పూజించుటచే గజమునకుం బూజలంద, గనె భాగ్యమ్మున్. విజయము గోరు వారలిల విఘ్నములన్ హరియించు నంచు భ క్తజనులు ముందుగన్ గొలుచు దైవము మూషిక వాహి మేనకా త్మజసుతు డేకదంతుడు సతమ్మును వాస్తవ మేకదా కనన్ గజమున కెంత భాగ్యము ముఖమ్ము యుగాలుగఁ బూజ లందెడిన్.
గజముఖుడని కొనియాడుచునిజభక్తులు తొలుదొలుతను నినుపూజింపన్విజయ మురిసిపోవునుగదగజమునకుం బూజలందఁ గనె భాగ్యమ్మున్గజముఖుడౌ గణేశ్వరునకా శిరమెట్లు లభించెనన్న సామజమొకటుత్తరానఁ దన మస్తక ముంచి పరుండ నంతటన్స్వజనులు శంభునానతిని వందరలాడిరి దానిశీర్షమున్గజమున కెంత భాగ్యము ముఖమ్ము యుగాలుగఁ బూజ లందెడిన్
కందం:గజముఖుడు వినాయకునిగనిజభక్తుల పూజలఁగొను నిరవద్యముగాసుజనులు గొలువగ నిరతముగజమునకుం బూజలందఁ గనె భాగ్యమ్మున్
చంపకమాల:భజనలు జేసి మ్రొక్కెదరు భక్తజనావళి శూర్పకర్ణునిన్విజయము గోరి కార్యముల విఘ్ననివారణఁ గోరి భక్తితోయజనములందు తొల్దలుత నర్చన సేతురు విఘ్ననాయకున్గజమున కెంత భాగ్యము ముఖమ్ము యుగాలుగఁ బూజ లందెడిన్
చం॥ గజముఖుడయ్యె విఘ్నపతి గాథను దెల్పఁగ నుత్తరమ్ముకున్గజము శిరమ్ము నిల్పి యటు కాంచఁగ నిద్రను దాని శీర్షమేనిజముఖమై వినాయకుఁడు నెమ్మినిఁ మ్రొక్కులఁ బొందు చుండ నాగ జమున కెంత భాగ్యమొ ముఖమ్ము యుగాలుగఁ బూజ లందెడిన్
చం:ధ్వజమున కెంతొ భాగ్యము కదా ప్రథమమ్ముగ నందు నంజలుల్!గజమున కెంత కీర్తి తన గాధను భాగవతమ్ము చెప్పెడిన్ !గజ ముఖమే వినాయకుని కంఠము జేరె విచిత్రరీతి నా గజమున కెంత భాగ్యము ముఖమ్ము యుగాలుగఁ బూజ లందెడిన్.
(కందం లో చంపక పాదం)
రిప్లయితొలగించండికం.
తగుయోగముగల్గెనునిం
పుగ గ **జమున కెంత* *భాగ్యము ముఖమ్ము* **యుగా*
*లుగఁ బూజ లందెడిన్* ”* ప
న్నగధారితనయుడగు గణనాథునిశిరమై
ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
రిప్లయితొలగించండిఅతివ యలిగెనని దెలియ నాతడిడగ
రిప్లయితొలగించండిదార జమునకుం బూజలందఁ గనె భాగ్య
మ్మున్ బడసెను మెండుగ నామె ముద్దులెన్నొ !
ఆలికి రహి నిడుటలోన యధిపుడతడు
కందం
రిప్లయితొలగించండిధ్వజమెత్త సుతుని తలకై
గజాసురుని శీర్షముంచి ఖండిత బాలున్
నిజనాథుఁడు జూప సతికి
గజమునకుం, బూజలందఁ గనె భాగ్యమ్మున్
చంపకమాల
ధ్వజమున రెచ్చి పార్వతియె, త్ర్యక్షుఁడు బాలు గళమ్ము ద్రెంచఁగన్
నిజపతిఁ దూలనాడగనె నివ్వెర పోయి గజాసురానమున్
భుజముల పైన నిల్పి పరిపూర్ణత గూర్చ, శివాని మోదమై
గజమున కెంత భాగ్యము ముఖమ్ము యుగాలుగఁ బూజ లందెడిన్
రిప్లయితొలగించండివిజయార్థు లౌచు ధర భ
క్తజనులు విఘ్నముల బాపు దైవమటంచున్
గజవదనుని కొలుతురు కద
గజమునకుం బూజలందఁ గనె భాగ్యమ్మున్.
అజితుడొసంగిన వరమది
గజముఖు డేవిఘ్నరాజుగన్ దొలుతగ భ
క్త జనులు పూజించుటచే
గజమునకుం బూజలంద, గనె భాగ్యమ్మున్.
విజయము గోరు వారలిల విఘ్నములన్ హరియించు నంచు భ
క్తజనులు ముందుగన్ గొలుచు దైవము మూషిక వాహి మేనకా
త్మజసుతు డేకదంతుడు సతమ్మును వాస్తవ మేకదా కనన్
గజమున కెంత భాగ్యము ముఖమ్ము యుగాలుగఁ బూజ లందెడిన్.
గజముఖుడని కొనియాడుచు
రిప్లయితొలగించండినిజభక్తులు తొలుదొలుతను నినుపూజింపన్
విజయ మురిసిపోవునుగద
గజమునకుం బూజలందఁ గనె భాగ్యమ్మున్
గజముఖుడౌ గణేశ్వరునకా శిరమెట్లు లభించెనన్న సా
మజమొకటుత్తరానఁ దన మస్తక ముంచి పరుండ నంతటన్
స్వజనులు శంభునానతిని వందరలాడిరి దానిశీర్షమున్
గజమున కెంత భాగ్యము ముఖమ్ము యుగాలుగఁ బూజ లందెడిన్
కందం:
రిప్లయితొలగించండిగజముఖుడు వినాయకునిగ
నిజభక్తుల పూజలఁగొను నిరవద్యముగా
సుజనులు గొలువగ నిరతము
గజమునకుం బూజలందఁ గనె భాగ్యమ్మున్
చంపకమాల:
రిప్లయితొలగించండిభజనలు జేసి మ్రొక్కెదరు భక్తజనావళి శూర్పకర్ణునిన్
విజయము గోరి కార్యముల విఘ్ననివారణఁ గోరి భక్తితో
యజనములందు తొల్దలుత నర్చన సేతురు విఘ్ననాయకున్
గజమున కెంత భాగ్యము ముఖమ్ము యుగాలుగఁ బూజ లందెడిన్
చం॥ గజముఖుడయ్యె విఘ్నపతి గాథను దెల్పఁగ నుత్తరమ్ముకున్
రిప్లయితొలగించండిగజము శిరమ్ము నిల్పి యటు కాంచఁగ నిద్రను దాని శీర్షమే
నిజముఖమై వినాయకుఁడు నెమ్మినిఁ మ్రొక్కులఁ బొందు చుండ నా
గ జమున కెంత భాగ్యమొ ముఖమ్ము యుగాలుగఁ బూజ లందెడిన్
చం:ధ్వజమున కెంతొ భాగ్యము కదా ప్రథమమ్ముగ నందు నంజలుల్!
రిప్లయితొలగించండిగజమున కెంత కీర్తి తన గాధను భాగవతమ్ము చెప్పెడిన్ !
గజ ముఖమే వినాయకుని కంఠము జేరె విచిత్రరీతి నా
గజమున కెంత భాగ్యము ముఖమ్ము యుగాలుగఁ బూజ లందెడిన్.