8, అక్టోబర్ 2026, గురువారం

సమస్య - 5614

9-10-2026 (శుక్రవారం)

ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...

“జమునకుం బూజలందఁ గనె భాగ్యమ్మున్”

(లేదా...)

“జమున కెంత భాగ్యము ముఖమ్ము యుగాలుగఁ బూజ లందెడిన్”

(న.చ. సాహిత్ శతావధానంలో ఆచార్య ఫణీంద్ర గారి సమస్య)

11 కామెంట్‌లు:

  1. (కందం లో చంపక పాదం)
    కం.
    తగుయోగముగల్గెనునిం
    పుగ గ **జమున కెంత* *భాగ్యము ముఖమ్ము* **యుగా*
    *లుగఁ బూజ లందెడిన్* ”* ప
    న్నగధారితనయుడగు గణనాథునిశిరమై

    రిప్లయితొలగించండి
  2. అతివ యలిగెనని దెలియ నాతడిడగ
    దార జమునకుం బూజలందఁ గనె భాగ్య
    మ్మున్ బడసెను మెండుగ నామె ముద్దులెన్నొ !
    ఆలికి రహి నిడుటలోన యధిపుడతడు

    రిప్లయితొలగించండి
  3. కందం
    ధ్వజమెత్త సుతుని తలకై
    గజాసురుని శీర్షముంచి ఖండిత బాలున్
    నిజనాథుఁడు జూప సతికి
    గజమునకుం, బూజలందఁ గనె భాగ్యమ్మున్


    చంపకమాల
    ధ్వజమున రెచ్చి పార్వతియె, త్ర్యక్షుఁడు బాలు గళమ్ము ద్రెంచఁగన్
    నిజపతిఁ దూలనాడగనె నివ్వెర పోయి గజాసురానమున్
    భుజముల పైన నిల్పి పరిపూర్ణత గూర్చ, శివాని మోదమై
    గజమున కెంత భాగ్యము ముఖమ్ము యుగాలుగఁ బూజ లందెడిన్

    రిప్లయితొలగించండి

  4. విజయార్థు లౌచు ధర భ
    క్తజనులు విఘ్నముల బాపు దైవమటంచున్
    గజవదనుని కొలుతురు కద
    గజమునకుం బూజలందఁ గనె భాగ్యమ్మున్.

    అజితుడొసంగిన వరమది
    గజముఖు డేవిఘ్నరాజుగన్ దొలుతగ భ
    క్త జనులు పూజించుటచే
    గజమునకుం బూజలంద, గనె భాగ్యమ్మున్.


    విజయము గోరు వారలిల విఘ్నములన్ హరియించు నంచు భ
    క్తజనులు ముందుగన్ గొలుచు దైవము మూషిక వాహి మేనకా
    త్మజసుతు డేకదంతుడు సతమ్మును వాస్తవ మేకదా కనన్
    గజమున కెంత భాగ్యము ముఖమ్ము యుగాలుగఁ బూజ లందెడిన్.

    రిప్లయితొలగించండి
  5. గజముఖుడని కొనియాడుచు
    నిజభక్తులు తొలుదొలుతను నినుపూజింపన్
    విజయ మురిసిపోవునుగద
    గజమునకుం బూజలందఁ గనె భాగ్యమ్మున్

    గజముఖుడౌ గణేశ్వరునకా శిరమెట్లు లభించెనన్న సా
    మజమొకటుత్తరానఁ దన మస్తక ముంచి పరుండ నంతటన్
    స్వజనులు శంభునానతిని వందరలాడిరి దానిశీర్షమున్
    గజమున కెంత భాగ్యము ముఖమ్ము యుగాలుగఁ బూజ లందెడిన్

    రిప్లయితొలగించండి
  6. కందం:
    గజముఖుడు వినాయకునిగ
    నిజభక్తుల పూజలఁగొను నిరవద్యముగా
    సుజనులు గొలువగ నిరతము
    గజమునకుం బూజలందఁ గనె భాగ్యమ్మున్

    రిప్లయితొలగించండి
  7. చంపకమాల:
    భజనలు జేసి మ్రొక్కెదరు భక్తజనావళి శూర్పకర్ణునిన్
    విజయము గోరి కార్యముల విఘ్ననివారణఁ గోరి భక్తితో
    యజనములందు తొల్దలుత నర్చన సేతురు విఘ్ననాయకున్
    గజమున కెంత భాగ్యము ముఖమ్ము యుగాలుగఁ బూజ లందెడిన్

    రిప్లయితొలగించండి
  8. చం॥ గజముఖుడయ్యె విఘ్నపతి గాథను దెల్పఁగ నుత్తరమ్ముకున్
    గజము శిరమ్ము నిల్పి యటు కాంచఁగ నిద్రను దాని శీర్షమే
    నిజముఖమై వినాయకుఁడు నెమ్మినిఁ మ్రొక్కులఁ బొందు చుండ నా
    గ జమున కెంత భాగ్యమొ ముఖమ్ము యుగాలుగఁ బూజ లందెడిన్

    రిప్లయితొలగించండి
  9. చం:ధ్వజమున కెంతొ భాగ్యము కదా ప్రథమమ్ముగ నందు నంజలుల్!
    గజమున కెంత కీర్తి తన గాధను భాగవతమ్ము చెప్పెడిన్ !
    గజ ముఖమే వినాయకుని కంఠము జేరె విచిత్రరీతి నా
    గజమున కెంత భాగ్యము ముఖమ్ము యుగాలుగఁ బూజ లందెడిన్.

    రిప్లయితొలగించండి
  10. చం:ప్రజలు గనంగ బెద్దనకు రాయలు సత్కృతి జేయ నొక్క డ
    క్కజమున బల్కె నిట్టు "లిది కమ్మని దృశ్యము సత్కవీంద్రది
    గ్గజమున కెంత భాగ్యము? ముఖమ్ము యుగాలుగఁ బూజ లందెడిన్
    బ్రజ కన శిల్ప మొక్కటిని రాయలు వెట్టిన దీని గుర్తుగన్.
    (పెద్దన గారు అష్టదిగ్గజాలలో ఒకరు కదా!ఆయనని రాయలు సత్కరిస్తుంటే చూసిన ఒక వ్యక్తి దీనిని శిల్పంగా చెక్కిస్తే ఆ పెద్దన గారు యుగాలు గా పూజ లందుకొంటాడు అని అభిమానం తో అన్నాడు. )

    రిప్లయితొలగించండి