8, అక్టోబర్ 2026, గురువారం

సమస్య - 5614

9-10-2026 (శుక్రవారం)

ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...

“జమునకుం బూజలందఁ గనె భాగ్యమ్మున్”

(లేదా...)

“జమున కెంత భాగ్యము ముఖమ్ము యుగాలుగఁ బూజ లందెడిన్”

(న.చ. సాహిత్ శతావధానంలో ఆచార్య ఫణీంద్ర గారి సమస్య)

6 కామెంట్‌లు:

  1. (కందం లో చంపక పాదం)
    కం.
    తగుయోగముగల్గెనునిం
    పుగ గ **జమున కెంత* *భాగ్యము ముఖమ్ము* **యుగా*
    *లుగఁ బూజ లందెడిన్* ”* ప
    న్నగధారితనయుడగు గణనాథునిశిరమై

    రిప్లయితొలగించండి
  2. అతివ యలిగెనని దెలియ నాతడిడగ
    దార జమునకుం బూజలందఁ గనె భాగ్య
    మ్మున్ బడసెను మెండుగ నామె ముద్దులెన్నొ !
    ఆలికి రహి నిడుటలోన యధిపుడతడు

    రిప్లయితొలగించండి
  3. కందం
    ధ్వజమెత్త సుతుని తలకై
    గజాసురుని శీర్షముంచి ఖండిత బాలున్
    నిజనాథుఁడు జూప సతికి
    గజమునకుం, బూజలందఁ గనె భాగ్యమ్మున్


    చంపకమాల
    ధ్వజమున రెచ్చి పార్వతియె, త్ర్యక్షుఁడు బాలు గళమ్ము ద్రెంచఁగన్
    నిజపతిఁ దూలనాడగనె నివ్వెర పోయి గజాసురానమున్
    భుజముల పైన నిల్పి పరిపూర్ణత గూర్చ, శివాని మోదమై
    గజమున కెంత భాగ్యము ముఖమ్ము యుగాలుగఁ బూజ లందెడిన్

    రిప్లయితొలగించండి

  4. విజయార్థు లౌచు ధర భ
    క్తజనులు విఘ్నముల బాపు దైవమటంచున్
    గజవదనుని కొలుతురు కద
    గజమునకుం బూజలందఁ గనె భాగ్యమ్మున్.

    అజితుడొసంగిన వరమది
    గజముఖు డేవిఘ్నరాజుగన్ దొలుతగ భ
    క్త జనులు పూజించుటచే
    గజమునకుం బూజలంద, గనె భాగ్యమ్మున్.


    విజయము గోరు వారలిల విఘ్నములన్ హరియించు నంచు భ
    క్తజనులు ముందుగన్ గొలుచు దైవము మూషిక వాహి మేనకా
    త్మజసుతు డేకదంతుడు సతమ్మును వాస్తవ మేకదా కనన్
    గజమున కెంత భాగ్యము ముఖమ్ము యుగాలుగఁ బూజ లందెడిన్.

    రిప్లయితొలగించండి
  5. గజముఖుడని కొనియాడుచు
    నిజభక్తులు తొలుదొలుతను నినుపూజింపన్
    విజయ మురిసిపోవునుగద
    గజమునకుం బూజలందఁ గనె భాగ్యమ్మున్

    గజముఖుడౌ గణేశ్వరునకా శిరమెట్లు లభించెనన్న సా
    మజమొకటుత్తరానఁ దన మస్తక ముంచి పరుండ నంతటన్
    స్వజనులు శంభునానతిని వందరలాడిరి దానిశీర్షమున్
    గజమున కెంత భాగ్యము ముఖమ్ము యుగాలుగఁ బూజ లందెడిన్

    రిప్లయితొలగించండి