11, అక్టోబర్ 2026, ఆదివారం

సమస్య - 5617

12-10-2026 (సోమవారం)

ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...

“సులభ రతముఁ బట్టిన హరి శుభము లిడుత”

(లేదా...)

“సులభ రతమ్ముఁ బట్టిన యశోనిధి కృష్ణుఁడు మిమ్ముఁ బ్రోచుతన్”

(న.చ. సాహిత్ శతావధానంలో ముద్దు రాజయ్య గారి సమస్య)

4 కామెంట్‌లు:

  1. చంపకమాలిక

    వెలసెనువేదవేద్యుడిలవిశ్వజనావళినుద్ధరించ శ్రీ
    నిలయుడు గోపికాహృదయనిత్యరసోన్మయభక్తిగమ్యుడై
    కలయుచు చిత్తనిష్క్రియతకైజడభావముబాపుచుండగన్
    తలతురు దేహభావమున తత్త్వమెఱుంగక మూఢచిత్తులా
    *“సులభ రతమ్ముఁ బట్టిన యశోనిధి కృష్ణుఁడు మిమ్ముఁ బ్రోచుతన్”**?


    (తేటగీతి సమస్యా పాదం కందంలో)

    కం.
    వినవలె వీనులలరకృ
    ష్ణునిలీలలు దుష్టరాక్ష *“సుల* *భరతముఁ బ*
    *ట్టిన హరి శుభము* *లిడుత”** జై
    యనవలె నొవ్వంగనోరునచ్యుతుబొగడన్

    రిప్లయితొలగించండి
  2. అరయ గ దన ప సితనము నందె రక్క
    సుల భరతముఁ బట్టిన హరి శుభము లిడుత
    జరుగుననెడి నమ్మిక తోడ జనసమూహ
    మెల్ల నతనిని కీర్తించ నెంచు కొనిరి

    రిప్లయితొలగించండి
  3. (3)

    తే.గీ.
    దొరకునాజన్మముమరల? దుష్టరాక్ష
    *సుల* *భరతముఁ బట్టిన హరి శుభము* *లిడుత”**
    వాసుదేవ, గోవింద,గోవర్ధన,హరి
    యనుచు కీర్తించవెమనసా! అహమువిడుమ!
    (4)

    ఆ.వె.
    సుఖమునొసగరాక్ష *సుల భరతముఁ* *బట్టి*
    *న హరి శుభము*లిడుత* నందనంద
    నా!ముకుంద! చిద్ఘనా! యశోదకిశోర!
    యనుచు నోరునొవ్వగనుడువుముర.

    రిప్లయితొలగించండి

  4. శిష్ట జనుల రక్షించుచు దుష్ట జనుల
    కోలు పుచ్చగ నెంచుచు కువల యమున
    నెన్నొ మార్లు తా నవతార మెత్తి రాక్ష
    సుల భరతముఁ బట్టిన హరి శుభము లిడుత.


    పలువురి ఇండ్లు జేరి సహ భావుల తోడను మంథజమ్ము మ్రు
    చ్చిలుకొను వాడె పూతనను చెండెను శైశవ రూపమందునన్
    ఖలు శిశుపాలునిన్ నరకు కాపురుషుండగు మేన మామ కం
    సుల భరతమ్ముఁ బట్టిన యశోనిధి కృష్ణుఁడు మిమ్ముఁ బ్రోచుతన్.

    రిప్లయితొలగించండి