7, నవంబర్ 2026, శనివారం

సమస్య - 5644

8-11-2026 (ఆదివారం)

ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...

“వనవిభునకు మూషికమ్ము వాహనమయ్యెన్”

(లేదా...)

“వనరాడ్వాహనమయ్యె మూషికము సంభావించి మ్రొక్కన్ సురల్”

3 కామెంట్‌లు:

  1. జనహిత కృత్యములు సలుప
    మునుకొని గణ నా థు గొలుచు పుడమియె భక్తిన్
    ఘనుడౌ విఘ్న పతి కి పా
    వన వి భు నకు మూ షి కమ్ము వాహన మ య్యె న్

    రిప్లయితొలగించండి
  2. కనగ గజము వాహనము భు
    వనవిభునకు ; మూషికమ్ము వాహనమయ్యెన్
    త్రినయుని సుతుడు గణపతికి
    పిన,పెద్ద శరీరులయ్యె పిప్పిలకముగా

    రిప్లయితొలగించండి

  3. మును ముందుగ పూజలు గొను
    ఘనుడా స్కందాగ్రజుండు కాలంజరికిన్
    దనయుడు గణాధిపతి త్రిభు
    వనవిభునకు మూషికమ్ము వాహనమయ్యెన్.


    ఘనుడాయేనుగుమోము సామియె కదా గాంగేయుకున్ లోకమున్
    ముని వంద్యుండగు విఘ్ననాథునకు, సంపూజ్యుండు ఫాలాక్షుకున్
    తనయుండంచు ప్రసిద్ధుడాతడె సదాదానుండకున్ గౌరి జీ
    వనరాడ్వాహనమయ్యె మూషికము సంభావించి మ్రొక్కన్ సురల్.

    రిప్లయితొలగించండి