8-7-2026 (బుధవారం)ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...“భక్తునిచే భంగపడెను భర్గుఁడు గాశిన్”(లేదా...)“భక్తుని చేత శంకరుఁడు భంగపడెన్ వర కాశికాపురిన్”
ముక్తీ నొసగునని నమ్ముచు భక్తిగ నిత్యము భజించు బత్తుడు దనపై రక్తిగొనుట దగ్గుటగని భక్తునిచే భంగపడెను భర్గుఁడు గాశిన్
కందంసక్తత భిక్షకు వెడలగభుక్తికి వ్యాసునకు ముద్ద పుట్టక తానుద్యుక్తుడుగ నెంచ శాపముభక్తునిచే భంగపడెను భర్గుఁడు గాశిన్!ఉత్పలమాలసక్తత విశ్వనాథునకు సద్మమటంచును శిష్యమూకతోభుక్తికి భిక్షకై వెడలి పుట్టక ముద్దయు శాపమెంచ నిర్యుక్తికమంచు వ్యాసుముని నోపక శంకరుడంపె నక్కటా!భక్తుని చేత శంకరుఁడు భంగపడెన్ వర కాశికాపురిన్!
ముక్తీ నొసగునని నమ్ముచు
రిప్లయితొలగించండిభక్తిగ నిత్యము భజించు బత్తుడు దనపై
రక్తిగొనుట దగ్గుటగని
భక్తునిచే భంగపడెను భర్గుఁడు గాశిన్
కందం
రిప్లయితొలగించండిసక్తత భిక్షకు వెడలగ
భుక్తికి వ్యాసునకు ముద్ద పుట్టక తాను
ద్యుక్తుడుగ నెంచ శాపము
భక్తునిచే భంగపడెను భర్గుఁడు గాశిన్!
ఉత్పలమాల
సక్తత విశ్వనాథునకు సద్మమటంచును శిష్యమూకతో
భుక్తికి భిక్షకై వెడలి పుట్టక ముద్దయు శాపమెంచ ని
ర్యుక్తికమంచు వ్యాసుముని నోపక శంకరుడంపె నక్కటా!
భక్తుని చేత శంకరుఁడు భంగపడెన్ వర కాశికాపురిన్!