చం:వదలకు వేదవిద్య యిది బ్రాహ్మణవృత్తి యటంచు బల్కగా వదలుక నాదు పుత్రు డిక పట్టెగ నీ యవధానవిద్య,సం పదయన శాలువాలె కద పద్యము లందున,మంత్రపుష్పమున్ జదువగ రానివాఁడు తన జాడ్యత నయ్యె శతావధానిగన్” (కొడుకుని వేదవిద్య నేర్చుకోరా! మన కులవృత్తి అంటే అవధానాలకి దిగాడు. దానిలో సంపాదన ఏమీ ఉండదు.శాలువాలు తప్ప అని తండ్రి ఆక్షేపించినట్లు. )
పఠనమందు రోత పడెడివా నిని జూడ ,
రిప్లయితొలగించండిచదువు రానివాఁడు శతవధాని
యయ్యె వివిధ క్రీడలందు కెరలుచుండి ,
చదువె ముఖ్యమనకు జరుగుబడికి
ఆటవెలది
రిప్లయితొలగించండివిద్యనేర్చి మిగుల హృద్యమ్ముగాఁ బల్కఁ
గవనమల్లు సతము కమ్మగాను
ధారణంబునెంచఁ దడఁబడు... తప్పుడు
చదువు రాని వాడు శతవధాని
చంపకమాల
వదలక పద్యముల్ బలుక వాడికదే విడలేని జాడ్యమా
పెదవులకంచు నెల్లరన వేదికలెక్కి వధానిగా మనెన్
సదమల రీతి పృచ్ఛకులు జైయన ధారణమందు తప్పుగన్
చదువగ రానివాఁడు తన జాడ్యత నయ్యె శతావధానిగన్!
రిప్లయితొలగించండిఅతనిని గని గొప్ప యవధాని యనుచును
పొగుడు చుంటి వేల మూర్ఖుని వలె
కనగ నెవ్వడైన కాబోడు భువిలోన
చదువు రానివాఁడు శతవధాని.
పదముల నల్లి పద్యముల వాజము జెప్పెడి పాటవమ్ముతో
విదులది గాంచి మెచ్చువిధి వెడ్కగ తానవ ధాన ముల్ గనన్
పదులుగ జేసినట్టి ఘన పండితు డైన మరాఠి భాషనే
చదువగ రానివాఁడు తన జాడ్యత నయ్యె శతావధానిగన్.
వదలిన మేలటంచు పర భాషల పై గల ప్రశ్రయమ్మదే
ముదమని, మాతృ భాష యదె మోదమటంచు సదా వచించెడిన్
జదువరి తెల్గు లోన కడు జక్కగ జేయుచు నన్య భాషలన్
జదువగ రానివాఁడు తన జాడ్యత నయ్యె శతావధానిగన్.
సంస్కృతాంధ్రములను చదివిన పండితు
రిప్లయితొలగించండిడభ్యసించకుండె నాంగ్లభాష
దైవవాణి తెలుగు తప్ప నితరములౌ
చదువు రానివాఁడు శతవధాని
చదువుటయే విశేషమగు జాడ్యము వానికి నెల్లవేళలన్
జదువక నుండలేడుగద సత్కృతులన్ దన కంటఁ జూచినన్
గుదురుగ సంస్కృతాంధ్రములు కొంకణి భాషలు తప్ప నన్యమున్
జదువగ రానివాఁడు తన జాడ్యత నయ్యె శతావధానిగన్
చదువుల తల్లి బ్రహ్మసతి శారద నెప్పుడు భక్తి గొల్చుచున్
రిప్లయితొలగించండిసదమల చిత్తుడై సకల శాస్త్రము లందున పారదృశ్యుడై
ముదముగ నల్లి పద్యములు మోదము కూర్చెడి వాడు నాంగ్లమున్
చదువగ రానివాడు తన జాడ్యత నయ్యె శతావధానిగన్
జ్ఞానహీనుడన్న జగతిలో వినుమయ్య
రిప్లయితొలగించండిచదువు రానివాడు:శతవధాని
యన్న తెలివితోడ నల్లుచు పద్యముల్
నొప్ప చెప్పుచుండు నొప్పుగాను
చదివెను వేదశాస్త్రముల సాంగముగా నితిహాస కావ్యముల్
రిప్లయితొలగించండిచదివెను శబ్దశాసనము సాంతము, పద్యములల్లుటందు గొ
ప్పదనము నొందినట్టి కవి, పండిత దూష్యములైన పొత్తముల్
చదువగ రానివాఁడు తన జాడ్యత నయ్యె శతావధానిగన్
చదివినాడు సకల శాస్త్ర పురాణముల్
రిప్లయితొలగించండివ్యాకరణము గూడ వల్లెవేసె
విజ్ఞుడతడు సకల విద్యలలో, కాడు
చదువు రానివాఁడు, శతవధాని
ఆ.వె:బాల్య మందు నతడు బడిలోన నొక్కింత
రిప్లయితొలగించండిచదువు రానివాఁడు, శతవధాని
యయ్యె యౌవనమ్ము నందు బశ్చాత్తాప
మంది నేర్చుకొనగ నాంధ్రభాష.
చం:వదలకు వేదవిద్య యిది బ్రాహ్మణవృత్తి యటంచు బల్కగా
రిప్లయితొలగించండివదలుక నాదు పుత్రు డిక పట్టెగ నీ యవధానవిద్య,సం
పదయన శాలువాలె కద పద్యము లందున,మంత్రపుష్పమున్
జదువగ రానివాఁడు తన జాడ్యత నయ్యె శతావధానిగన్”
(కొడుకుని వేదవిద్య నేర్చుకోరా! మన కులవృత్తి అంటే అవధానాలకి దిగాడు. దానిలో సంపాదన ఏమీ ఉండదు.శాలువాలు తప్ప అని తండ్రి ఆక్షేపించినట్లు. )
ఆ॥ పుట్టు గ్రుడ్డి యైనఁ బొంది తపన నేర్చి
రిప్లయితొలగించండిసుతుఁడు చదువు వేళ స్ఫూర్తిఁ గాంచి
సదవధానములను జనులు మెచ్చఁగ నయ్యె
చదువు రాని వాఁడు శతవధాని
చం॥ ముదముగ గ్రుడ్డి వాఁడు తన ముద్దుల పుత్రుఁడు పల్కు చుండఁగన్
గుదురుగ నేర్చి ఛందములఁ గొంత పరిశ్రమ కొంత స్ఫూర్తితోఁ
దదను గుణమ్ముగాఁ జనుచుఁ దత్పరుఁడై కృషి తోడ యోగ్యుఁడై
చదువఁగ రానివాఁడు తన జాడ్యత నయ్యె శతావధానిగన్
(జాన్ మిల్టన్ గ్రుడ్డి వాడైన పిదపనే నాకు తెలిసినంతవరకు పారడైజ్ లాస్ట్ పారడైజ్ రీగెయిన్డ్ వ్రాసినది. అతను చెప్పితే వేరే వారు వ్రాసి పెట్టేవారు)
ఆ.వె; వంద యిండ్ల వారు బట్టలు వేయగా
రిప్లయితొలగించండినన్ని యుతికి, తిరిగి తిన్నగానె
యెవరి వస్త్ర మేదొ స్మృతి నుంచుకొని యిచ్చు
చదువు రాని వాడు శతవధాని.
చదువు సంధ్య లందు చతురు డై రాణించి
రిప్లయితొలగించండిపద్య విద్య యందు ప్రజ్ఞ గల్గి
ధార ధారణ గల దక్షునన దగు నె
చదువు రాని వాడు శత వ ధాని?
ఒక్క టడుగుచుంటి నక్కజము సెలఁగఁ
రిప్లయితొలగించండిజెప్పు మయ్య నాకుఁ దప్పకుండఁ
జాల వింత గాంచ నేల యనుజుఁ డయ్యెఁ
జదువు రానివాఁడు శతవధాని
కుదరఁ గడింది దైవకృప గుప్త విధమ్ముగ స్వీయ భక్తిచే
నుదరి గడింప జ్ఞానమును యుక్త విధమ్ముగ నిష్ఠ తోడుతన్
విదితుఁడు సంస్కృతాంధ్రముఖ విద్యల సుంతయుఁ గంటిచూపుతోఁ
జదువగ రానివాఁడు తన జాడ్యత నయ్యె శతావధానిగన్
రిప్లయితొలగించండిసదమలమౌ మనస్సు వ్యవసాయము జేయుచు నిచ్చతోడుతన్
ముదమున పూర్వకావ్యముల పోడిగ నిత్యము నాలకించుచున్
చదువుల తల్లి ప్రేమమును చక్కగ బంచగ, మొండిపట్టుతో
చదువగరాని వాడు తన జాడ్యత నయ్యె
శతావధానిగన్
అసనారె
రిప్లయితొలగించండిపిన్నక నాగేశ్వరరావు.
హైదరాబాద్.
జగతిలోన నెవడు జ్ఞానహీనుడు గన
చదువు రాని వాడు; శతవధాని
ప్రాశ్నికులడుగంగ రమ్యమైన సరళి
పద్యములను చెప్పు ప్రతిభ తోడ.