11-8-2026 (మంగళవారం)
ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...
“చదువు రానివాఁడు శతవధాని”
(లేదా...)
“చదువగ రానివాఁడు తన జాడ్యత నయ్యె శతావధానిగన్”
(ఉప్పలధడియం భరతశర్మ శతావధానంలో కొరిడె విశ్వనాథ శర్మ గారి సమస్య)
పఠనమందు రోత పడెడివా నిని జూడ , చదువు రానివాఁడు శతవధానియయ్యె వివిధ క్రీడలందు కెరలుచుండి , చదువె ముఖ్యమనకు జరుగుబడికి
ఆటవెలదివిద్యనేర్చి మిగుల హృద్యమ్ముగాఁ బల్కఁగవనమల్లు సతము కమ్మగానుధారణంబునెంచఁ దడఁబడు... తప్పుడుచదువు రాని వాడు శతవధానిచంపకమాలవదలక పద్యముల్ బలుక వాడికదే విడలేని జాడ్యమాపెదవులకంచు నెల్లరన వేదికలెక్కి వధానిగా మనెన్సదమల రీతి పృచ్ఛకులు జైయన ధారణమందు తప్పుగన్చదువగ రానివాఁడు తన జాడ్యత నయ్యె శతావధానిగన్!
అతనిని గని గొప్ప యవధాని యనుచును పొగుడు చుంటి వేల మూర్ఖుని వలె కనగ నెవ్వడైన కాబోడు భువిలోన చదువు రానివాఁడు శతవధాని.పదముల నల్లి పద్యముల వాజము జెప్పెడి పాటవమ్ముతో విదులది గాంచి మెచ్చువిధి వెడ్కగ తానవ ధాన ముల్ గనన్ పదులుగ జేసినట్టి ఘన పండితు డైన మరాఠి భాషనే చదువగ రానివాఁడు తన జాడ్యత నయ్యె శతావధానిగన్.వదలిన మేలటంచు పర భాషల పై గల ప్రశ్రయమ్మదే ముదమని, మాతృ భాష యదె మోదమటంచు సదా వచించెడిన్ జదువరి తెల్గు లోన కడు జక్కగ జేయుచు నన్య భాషలన్ జదువగ రానివాఁడు తన జాడ్యత నయ్యె శతావధానిగన్.
పఠనమందు రోత పడెడివా నిని జూడ ,
రిప్లయితొలగించండిచదువు రానివాఁడు శతవధాని
యయ్యె వివిధ క్రీడలందు కెరలుచుండి ,
చదువె ముఖ్యమనకు జరుగుబడికి
ఆటవెలది
రిప్లయితొలగించండివిద్యనేర్చి మిగుల హృద్యమ్ముగాఁ బల్కఁ
గవనమల్లు సతము కమ్మగాను
ధారణంబునెంచఁ దడఁబడు... తప్పుడు
చదువు రాని వాడు శతవధాని
చంపకమాల
వదలక పద్యముల్ బలుక వాడికదే విడలేని జాడ్యమా
పెదవులకంచు నెల్లరన వేదికలెక్కి వధానిగా మనెన్
సదమల రీతి పృచ్ఛకులు జైయన ధారణమందు తప్పుగన్
చదువగ రానివాఁడు తన జాడ్యత నయ్యె శతావధానిగన్!
రిప్లయితొలగించండిఅతనిని గని గొప్ప యవధాని యనుచును
పొగుడు చుంటి వేల మూర్ఖుని వలె
కనగ నెవ్వడైన కాబోడు భువిలోన
చదువు రానివాఁడు శతవధాని.
పదముల నల్లి పద్యముల వాజము జెప్పెడి పాటవమ్ముతో
విదులది గాంచి మెచ్చువిధి వెడ్కగ తానవ ధాన ముల్ గనన్
పదులుగ జేసినట్టి ఘన పండితు డైన మరాఠి భాషనే
చదువగ రానివాఁడు తన జాడ్యత నయ్యె శతావధానిగన్.
వదలిన మేలటంచు పర భాషల పై గల ప్రశ్రయమ్మదే
ముదమని, మాతృ భాష యదె మోదమటంచు సదా వచించెడిన్
జదువరి తెల్గు లోన కడు జక్కగ జేయుచు నన్య భాషలన్
జదువగ రానివాఁడు తన జాడ్యత నయ్యె శతావధానిగన్.