12, ఆగస్టు 2026, బుధవారం

సమస్య - 5557

13-8-2026 (గురువారం)

ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...

“సారా సేవింతు నేను సతతము భక్తిన్”

(లేదా...)

“సారా పానమొనర్తు నేను సతమున్ సద్భక్తితోఁ బ్రీతితోన్”

(ఉప్పలధడియం భరతశర్మ శతావధానంలో జొన్నలగడ్డ శ్రీనివాసరావు గారి సమస్య)

26 కామెంట్‌లు:

  1. కూరిమితో నను గాచుచు
    చేరువ నిలుచుచు నిరతము చేతన నొసగే
    శౌరిని యభవుని నిట మన
    సారా సేవింతు నేను సతతము భక్తిన్!

    రిప్లయితొలగించండి
  2. భారము నీపై వేసియు
    నారాయణ వేడుచుంటి నామదిలో నా
    నేరములను దలపకు మన
    సారా నేవింతు నేను సతతము భక్తిన్

    రిప్లయితొలగించండి
  3. పారావార మెఱుంగలే మిట మహా
    భాస్వంత రూపస్థితా
    తీరున్మాదరి నిల్తు వీవు ఘన సం
    దీప్తానుబంధంబువై
    రారా నా మనసంతనీస్మరణె! వి
    భ్రాజంబుతోడన్కృపా
    సారా! పానమొనర్తు నేను సతమున్ సద్భక్తితోఁ బ్రీతితోన్!

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. మీ పూరణ బాగున్నది. అభినందనలు.
      'రూపస్థితా తీరు' దుష్టసమాసం.

      తొలగించండి
  4. త్రాగుబోతు బుకాయింపు..

    కందం
    సారించి సృష్టి నెల్లన్
    గూరుచ కావలసినన్ని కోరకమునుపే
    నీరము బదులిడ దైవము
    సారా! సేవింతు నేను సతతము భక్తిన్!

    శార్దూల విక్రీడితము
    సారించున్ గద సృష్టినెల్ల నెటనే సాయమ్మవశ్యమ్మొ యా
    యారీతిన్ సమకూర్చ నెంచి సరసీజాక్షుండు భక్తాలువై!
    నీరమ్మున్ విడనాడి కౌతుకమునన్ దీర్చంగ నా కోసమై
    సారా! పానమొనర్తు నేను సతమున్ సద్భక్తితోఁ బ్రీతితోన్!

    రిప్లయితొలగించండి
  5. తీరుగ గాశీ క్షేత్రము
    జేరి , యమరతటిని వద్ద జీవను గుడిలో
    భైరవుని ముట్టుకొని మన
    సారా సేవింతు నేను సతతము భక్తిన్

    రిప్లయితొలగించండి

  6. కోరిన వారికి వడి ని
    స్తారమొసగు నామమదియె శమలమ్ము హరిం
    చే రామామృతమును మన
    సారా సేవింతు నేను సతతము భక్తిన్.


    పారమ్య రామ నామమె
    తారక మనుచును తలచి సతము తలతు గా
    దే రామామృతమది మన
    సారా సేవింతు నేను సతతము భక్తిన్.


    భారంబంచు దలంచ బోడనెడి విశ్వాసమ్ము తో నిత్యమున్
    సారగ్రీవుని నామ మయ్యదియె కంజమ్మంచు గంగా నదీ
    తీరమ్మందున నిల్చినట్టి నిను హే దేవేశ! కాశీ నివా
    సా! రా పానమొనర్తు నేను సతమున్ సద్భక్తితోఁ బ్రీతితోన్

    రిప్లయితొలగించండి
  7. శ్రీరఘురామా!కారా
    గారములో నుంటినయ్య కడతేర్చుటకై
    రారా భద్రాచలవా
    సా! రా! సేవింతు నేను సతతము భక్తిన్

    [కడతేర్చు = రక్షించు]

    కారాగారము నందు బంధితుడనై కష్టాలలోమున్గితిన్
    గారుణ్యాలయ భక్త కోటి వరదా కాపాడ రావేలరా
    శ్రీరామా!భవదీయ నామ సుధనే సేవింతు భద్రాద్రి వా
    సా! రా! పానమొనర్తు నేను సతమున్ సద్భక్తితోఁ బ్రీతితోన్

    రిప్లయితొలగించండి
  8. ఆరాధింతును నన్ని వేళలను నేనత్యంత సంసక్తితో
    వేరే దైవమున్ కొలువకన్ వెల్గించి దీపాలనే
    కారుణ్యంబును జూపి నాపయినికన్ కాపాడు వైకుంఠ వా
    సా!రా! పానమొనర్తు నేను సతమున్ సద్భక్తితో బ్రీతితోన్

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. మీ పూరణ బాగున్నది. అభినందనలు.
      "ఆరాధించెద నన్ని.." అనండి. రెండవ పాదంలో గణభంగం. సవరించండి.

      తొలగించండి
  9. శ్రీరాముడు నా దైవము
    పోరాముల యందు గాఁచు పోఁడిమినొసగున్
    కోరుచు మది సౌఖ్యము మన
    సారా సేవింతు నేను సతతము భక్తిన్

    రిప్లయితొలగించండి
  10. శ్రీరామా యని భక్తితో గొలువ సంక్షేమంబు జేకూర్చునా
    శౌరిన్ మించిన దైవముం గనము ప్రాశస్త్యమ్ము నామంబిలన్
    పారావార గభీర క్లేశముల సంభాలించు పీయూషమా
    సారా పానమొనర్తు నేను సతమున్ సద్భక్తితోఁ బ్రీతితోన్

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. మీ పూరణ బాగున్నది. అభినందనలు.
      'గభీర క్లేశ' మన్నపుడు 'ర' గురువై గణభంగం. 'పీయూషమాసారా'?

      తొలగించండి
  11. కం: కోరెద నొక్కటె నాన్నా!
    ఆరోగ్యము బాడు జేయు నా మద్యమ్మున్
    గోరకు, మింతట వదలిన
    సారా సేవింతు నేను సతతము భక్తిన్.


    రిప్లయితొలగించండి
  12. శా;పోరా! జ్ఞానము దెల్ప వచ్చితివి, నే బుణ్యాత్ముడన్ గానొకో
    నేర మ్మేమొకొ ఆదివారమని దీనిన్ గ్రోల, నేడే కదా
    సారా పానమొనర్తు నేను! సతమున్ సద్భక్తితోఁ బ్రీతితోన్
    శ్రీరామున్ భజియింతు తీర్థములనే సేవింతు నే వారమున్.
    (ఒక్క ఆదివారమే కదా సారా తాగేది! మిగతా వారాలు రాముణ్ని పూజించి తీర్థమే పుచ్చుకుంటాను. )

    రిప్లయితొలగించండి
  13. కం॥ పారావారముఁ గనుటకు
    ధారాళంబుగ నుతింతు దామోదరునిన్
    నోరారా పొగడుచు మన
    సారా సేవింతు నేను సతతము భక్తిన్

    శా॥ ధారాళంబుగ నేమనిష్ఠలను సంధానించి దామోదరున్
    బారావారముఁ జేర్చఁ గొల్చెదను సంభావించి యేకాగ్రతన్
    గారాబమ్మును సంస్తుతించి చనెడిన్ గానామృతమ్మున్ మన
    స్సారా పానమొనర్తు నేను సతమున్ సద్భక్తితోఁ బ్రీతితో

    గారాబము గొప్పతనము మనస్సు సరియైన పదమే కదండి అందువలన మనస్సారా చేసానండి

    రిప్లయితొలగించండి
  14. గౌరీ పతి మందిరమును
    జేరియు శివ నామ జపము జిత్తం బల రన్
    గోరుచు ముక్తి పద ము మన
    సారా సేవింతు నేను స తత ము భక్తి న్

    రిప్లయితొలగించండి
  15. లేరే త్రిదశు లనేకులు
    వార లగుదు రయ్య సాటి పద్మాక్షునకున్
    నారాయణు నచ్యుతు మన
    సారా సేవింతు నేను సతతము భక్తిన్


    వీరావేశము డెంద మందుఁ జెలఁగెన్ వీక్షింపు శ్రీమద్రమా
    నారీ రత్న మనోధినాయక హరీ నారాయణా సద్దయా
    పారావార త్వదీయ నామ రసమున్ వైకుంఠ సంవాస వా
    సా రా పాన మొనర్తు నేను సతమున్ సద్భక్తితోఁ బ్రీతితోన్

    రిప్లయితొలగించండి