13-8-2026 (గురువారం)
ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...
“సారా సేవింతు నేను సతతము భక్తిన్”
(లేదా...)
“సారా పానమొనర్తు నేను సతమున్ సద్భక్తితోఁ బ్రీతితోన్”
(ఉప్పలధడియం భరతశర్మ శతావధానంలో జొన్నలగడ్డ శ్రీనివాసరావు గారి సమస్య)
కూరిమితో నను గాచుచుచేరువ నిలుచుచు నిరతము చేతన నొసగేశౌరిని యభవుని నిట మనసారా సేవింతు నేను సతతము భక్తిన్!
ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
భారము నీపై వేసియునారాయణ వేడుచుంటి నామదిలో నానేరములను దలపకు మనసారా నేవింతు నేను సతతము భక్తిన్
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
పారావార మెఱుంగలే మిట మహాభాస్వంత రూపస్థితా తీరున్మాదరి నిల్తు వీవు ఘన సందీప్తానుబంధంబువైరారా నా మనసంతనీస్మరణె! విభ్రాజంబుతోడన్కృపాసారా! పానమొనర్తు నేను సతమున్ సద్భక్తితోఁ బ్రీతితోన్!
మీ పూరణ బాగున్నది. అభినందనలు.'రూపస్థితా తీరు' దుష్టసమాసం.
త్రాగుబోతు బుకాయింపు.. కందంసారించి సృష్టి నెల్లన్గూరుచ కావలసినన్ని కోరకమునుపేనీరము బదులిడ దైవముసారా! సేవింతు నేను సతతము భక్తిన్! శార్దూల విక్రీడితముసారించున్ గద సృష్టినెల్ల నెటనే సాయమ్మవశ్యమ్మొ యాయారీతిన్ సమకూర్చ నెంచి సరసీజాక్షుండు భక్తాలువై! నీరమ్మున్ విడనాడి కౌతుకమునన్ దీర్చంగ నా కోసమైసారా! పానమొనర్తు నేను సతమున్ సద్భక్తితోఁ బ్రీతితోన్!
తీరుగ గాశీ క్షేత్రము జేరి , యమరతటిని వద్ద జీవను గుడిలో భైరవుని ముట్టుకొని మన సారా సేవింతు నేను సతతము భక్తిన్
కోరిన వారికి వడి ని స్తారమొసగు నామమదియె శమలమ్ము హరిం చే రామామృతమును మన సారా సేవింతు నేను సతతము భక్తిన్.పారమ్య రామ నామమె తారక మనుచును తలచి సతము తలతు గా దే రామామృతమది మన సారా సేవింతు నేను సతతము భక్తిన్. భారంబంచు దలంచ బోడనెడి విశ్వాసమ్ము తో నిత్యమున్ సారగ్రీవుని నామ మయ్యదియె కంజమ్మంచు గంగా నదీ తీరమ్మందున నిల్చినట్టి నిను హే దేవేశ! కాశీ నివా సా! రా పానమొనర్తు నేను సతమున్ సద్భక్తితోఁ బ్రీతితోన్
శ్రీరఘురామా!కారాగారములో నుంటినయ్య కడతేర్చుటకైరారా భద్రాచలవాసా! రా! సేవింతు నేను సతతము భక్తిన్[కడతేర్చు = రక్షించు]కారాగారము నందు బంధితుడనై కష్టాలలోమున్గితిన్గారుణ్యాలయ భక్త కోటి వరదా కాపాడ రావేలరాశ్రీరామా!భవదీయ నామ సుధనే సేవింతు భద్రాద్రి వాసా! రా! పానమొనర్తు నేను సతమున్ సద్భక్తితోఁ బ్రీతితోన్
భక్త రామదాసు అంతరంగం 🖕
మీ రెండు పూరణలు ప్రశస్తంగా ఉన్నవి. అభినందనలు.
ధన్యవాదాలు గురూజీ 🙏
ఆరాధింతును నన్ని వేళలను నేనత్యంత సంసక్తితోవేరే దైవమున్ కొలువకన్ వెల్గించి దీపాలనేకారుణ్యంబును జూపి నాపయినికన్ కాపాడు వైకుంఠ వాసా!రా! పానమొనర్తు నేను సతమున్ సద్భక్తితో బ్రీతితోన్
మీ పూరణ బాగున్నది. అభినందనలు."ఆరాధించెద నన్ని.." అనండి. రెండవ పాదంలో గణభంగం. సవరించండి.
శ్రీరాముడు నా దైవముపోరాముల యందు గాఁచు పోఁడిమినొసగున్కోరుచు మది సౌఖ్యము మనసారా సేవింతు నేను సతతము భక్తిన్
శ్రీరామా యని భక్తితో గొలువ సంక్షేమంబు జేకూర్చునాశౌరిన్ మించిన దైవముం గనము ప్రాశస్త్యమ్ము నామంబిలన్పారావార గభీర క్లేశముల సంభాలించు పీయూషమాసారా పానమొనర్తు నేను సతమున్ సద్భక్తితోఁ బ్రీతితోన్
మీ పూరణ బాగున్నది. అభినందనలు.'గభీర క్లేశ' మన్నపుడు 'ర' గురువై గణభంగం. 'పీయూషమాసారా'?
కం: కోరెద నొక్కటె నాన్నా!ఆరోగ్యము బాడు జేయు నా మద్యమ్మున్గోరకు, మింతట వదలినసారా సేవింతు నేను సతతము భక్తిన్.
శా;పోరా! జ్ఞానము దెల్ప వచ్చితివి, నే బుణ్యాత్ముడన్ గానొకోనేర మ్మేమొకొ ఆదివారమని దీనిన్ గ్రోల, నేడే కదాసారా పానమొనర్తు నేను! సతమున్ సద్భక్తితోఁ బ్రీతితోన్శ్రీరామున్ భజియింతు తీర్థములనే సేవింతు నే వారమున్. (ఒక్క ఆదివారమే కదా సారా తాగేది! మిగతా వారాలు రాముణ్ని పూజించి తీర్థమే పుచ్చుకుంటాను. )
కం॥ పారావారముఁ గనుటకుధారాళంబుగ నుతింతు దామోదరునిన్ నోరారా పొగడుచు మనసారా సేవింతు నేను సతతము భక్తిన్శా॥ ధారాళంబుగ నేమనిష్ఠలను సంధానించి దామోదరున్ బారావారముఁ జేర్చఁ గొల్చెదను సంభావించి యేకాగ్రతన్గారాబమ్మును సంస్తుతించి చనెడిన్ గానామృతమ్మున్ మనస్సారా పానమొనర్తు నేను సతమున్ సద్భక్తితోఁ బ్రీతితో గారాబము గొప్పతనము మనస్సు సరియైన పదమే కదండి అందువలన మనస్సారా చేసానండి
గౌరీ పతి మందిరమును జేరియు శివ నామ జపము జిత్తం బల రన్ గోరుచు ముక్తి పద ము మన సారా సేవింతు నేను స తత ము భక్తి న్
లేరే త్రిదశు లనేకులు వార లగుదు రయ్య సాటి పద్మాక్షునకున్ నారాయణు నచ్యుతు మన సారా సేవింతు నేను సతతము భక్తిన్ వీరావేశము డెంద మందుఁ జెలఁగెన్ వీక్షింపు శ్రీమద్రమా నారీ రత్న మనోధినాయక హరీ నారాయణా సద్దయాపారావార త్వదీయ నామ రసమున్ వైకుంఠ సంవాస వాసా రా పాన మొనర్తు నేను సతమున్ సద్భక్తితోఁ బ్రీతితోన్
కూరిమితో నను గాచుచు
రిప్లయితొలగించండిచేరువ నిలుచుచు నిరతము చేతన నొసగే
శౌరిని యభవుని నిట మన
సారా సేవింతు నేను సతతము భక్తిన్!
ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
రిప్లయితొలగించండిభారము నీపై వేసియు
రిప్లయితొలగించండినారాయణ వేడుచుంటి నామదిలో నా
నేరములను దలపకు మన
సారా నేవింతు నేను సతతము భక్తిన్
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండిపారావార మెఱుంగలే మిట మహా
రిప్లయితొలగించండిభాస్వంత రూపస్థితా
తీరున్మాదరి నిల్తు వీవు ఘన సం
దీప్తానుబంధంబువై
రారా నా మనసంతనీస్మరణె! వి
భ్రాజంబుతోడన్కృపా
సారా! పానమొనర్తు నేను సతమున్ సద్భక్తితోఁ బ్రీతితోన్!
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండి'రూపస్థితా తీరు' దుష్టసమాసం.
త్రాగుబోతు బుకాయింపు..
రిప్లయితొలగించండికందం
సారించి సృష్టి నెల్లన్
గూరుచ కావలసినన్ని కోరకమునుపే
నీరము బదులిడ దైవము
సారా! సేవింతు నేను సతతము భక్తిన్!
శార్దూల విక్రీడితము
సారించున్ గద సృష్టినెల్ల నెటనే సాయమ్మవశ్యమ్మొ యా
యారీతిన్ సమకూర్చ నెంచి సరసీజాక్షుండు భక్తాలువై!
నీరమ్మున్ విడనాడి కౌతుకమునన్ దీర్చంగ నా కోసమై
సారా! పానమొనర్తు నేను సతమున్ సద్భక్తితోఁ బ్రీతితోన్!
తీరుగ గాశీ క్షేత్రము
రిప్లయితొలగించండిజేరి , యమరతటిని వద్ద జీవను గుడిలో
భైరవుని ముట్టుకొని మన
సారా సేవింతు నేను సతతము భక్తిన్
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండి
రిప్లయితొలగించండికోరిన వారికి వడి ని
స్తారమొసగు నామమదియె శమలమ్ము హరిం
చే రామామృతమును మన
సారా సేవింతు నేను సతతము భక్తిన్.
పారమ్య రామ నామమె
తారక మనుచును తలచి సతము తలతు గా
దే రామామృతమది మన
సారా సేవింతు నేను సతతము భక్తిన్.
భారంబంచు దలంచ బోడనెడి విశ్వాసమ్ము తో నిత్యమున్
సారగ్రీవుని నామ మయ్యదియె కంజమ్మంచు గంగా నదీ
తీరమ్మందున నిల్చినట్టి నిను హే దేవేశ! కాశీ నివా
సా! రా పానమొనర్తు నేను సతమున్ సద్భక్తితోఁ బ్రీతితోన్
శ్రీరఘురామా!కారా
రిప్లయితొలగించండిగారములో నుంటినయ్య కడతేర్చుటకై
రారా భద్రాచలవా
సా! రా! సేవింతు నేను సతతము భక్తిన్
[కడతేర్చు = రక్షించు]
కారాగారము నందు బంధితుడనై కష్టాలలోమున్గితిన్
గారుణ్యాలయ భక్త కోటి వరదా కాపాడ రావేలరా
శ్రీరామా!భవదీయ నామ సుధనే సేవింతు భద్రాద్రి వా
సా! రా! పానమొనర్తు నేను సతమున్ సద్భక్తితోఁ బ్రీతితోన్
భక్త రామదాసు అంతరంగం 🖕
తొలగించండిమీ రెండు పూరణలు ప్రశస్తంగా ఉన్నవి. అభినందనలు.
తొలగించండిధన్యవాదాలు గురూజీ 🙏
తొలగించండిఆరాధింతును నన్ని వేళలను నేనత్యంత సంసక్తితో
రిప్లయితొలగించండివేరే దైవమున్ కొలువకన్ వెల్గించి దీపాలనే
కారుణ్యంబును జూపి నాపయినికన్ కాపాడు వైకుంఠ వా
సా!రా! పానమొనర్తు నేను సతమున్ సద్భక్తితో బ్రీతితోన్
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండి"ఆరాధించెద నన్ని.." అనండి. రెండవ పాదంలో గణభంగం. సవరించండి.
శ్రీరాముడు నా దైవము
రిప్లయితొలగించండిపోరాముల యందు గాఁచు పోఁడిమినొసగున్
కోరుచు మది సౌఖ్యము మన
సారా సేవింతు నేను సతతము భక్తిన్
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండిశ్రీరామా యని భక్తితో గొలువ సంక్షేమంబు జేకూర్చునా
రిప్లయితొలగించండిశౌరిన్ మించిన దైవముం గనము ప్రాశస్త్యమ్ము నామంబిలన్
పారావార గభీర క్లేశముల సంభాలించు పీయూషమా
సారా పానమొనర్తు నేను సతమున్ సద్భక్తితోఁ బ్రీతితోన్
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండి'గభీర క్లేశ' మన్నపుడు 'ర' గురువై గణభంగం. 'పీయూషమాసారా'?
కం: కోరెద నొక్కటె నాన్నా!
రిప్లయితొలగించండిఆరోగ్యము బాడు జేయు నా మద్యమ్మున్
గోరకు, మింతట వదలిన
సారా సేవింతు నేను సతతము భక్తిన్.
శా;పోరా! జ్ఞానము దెల్ప వచ్చితివి, నే బుణ్యాత్ముడన్ గానొకో
రిప్లయితొలగించండినేర మ్మేమొకొ ఆదివారమని దీనిన్ గ్రోల, నేడే కదా
సారా పానమొనర్తు నేను! సతమున్ సద్భక్తితోఁ బ్రీతితోన్
శ్రీరామున్ భజియింతు తీర్థములనే సేవింతు నే వారమున్.
(ఒక్క ఆదివారమే కదా సారా తాగేది! మిగతా వారాలు రాముణ్ని పూజించి తీర్థమే పుచ్చుకుంటాను. )
కం॥ పారావారముఁ గనుటకు
రిప్లయితొలగించండిధారాళంబుగ నుతింతు దామోదరునిన్
నోరారా పొగడుచు మన
సారా సేవింతు నేను సతతము భక్తిన్
శా॥ ధారాళంబుగ నేమనిష్ఠలను సంధానించి దామోదరున్
బారావారముఁ జేర్చఁ గొల్చెదను సంభావించి యేకాగ్రతన్
గారాబమ్మును సంస్తుతించి చనెడిన్ గానామృతమ్మున్ మన
స్సారా పానమొనర్తు నేను సతమున్ సద్భక్తితోఁ బ్రీతితో
గారాబము గొప్పతనము మనస్సు సరియైన పదమే కదండి అందువలన మనస్సారా చేసానండి
గౌరీ పతి మందిరమును
రిప్లయితొలగించండిజేరియు శివ నామ జపము జిత్తం బల రన్
గోరుచు ముక్తి పద ము మన
సారా సేవింతు నేను స తత ము భక్తి న్
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండిలేరే త్రిదశు లనేకులు
రిప్లయితొలగించండివార లగుదు రయ్య సాటి పద్మాక్షునకున్
నారాయణు నచ్యుతు మన
సారా సేవింతు నేను సతతము భక్తిన్
వీరావేశము డెంద మందుఁ జెలఁగెన్ వీక్షింపు శ్రీమద్రమా
నారీ రత్న మనోధినాయక హరీ నారాయణా సద్దయా
పారావార త్వదీయ నామ రసమున్ వైకుంఠ సంవాస వా
సా రా పాన మొనర్తు నేను సతమున్ సద్భక్తితోఁ బ్రీతితోన్