13, ఆగస్టు 2026, గురువారం

సమస్య - 5558

14-8-2026 (శుక్రవారం)

ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...

“చీమ తుమ్మెను సింహముల్ సెదరె జడిసి”

(లేదా...)

“ద్రఢిమను జీమ తుమ్మఁగ బదాబదలయ్యె మృగేంద్రసంఘముల్”

(ఉప్పలధడియం భరతశర్మ శతావధానంలో దువ్వూరి వేంకట సుబ్బారావు అను మిస్సన్న గారి సమస్య)

6 కామెంట్‌లు:

  1. చిన్నపాటి దళము తోడ జేసినట్టి
    రామరాజు క్రాంతిని యెదురాడ లేక
    సతమతమయిన యాంగ్లుల సంగ తివిన
    చీమ తుమ్మెను సింహముల్ సెదరె జడిసి

    రిప్లయితొలగించండి
  2. కందం
    వైరి శ్రీహరిన్ గొలుచు కుమారునెంచి
    భక్తిఁ బాపగ భయపెట్ట భటులనంప
    హాని తలపెట్ట., నచ్యుతా! యన విఫలమె!
    చీమ తుమ్మెను సింహముల్ సెదరె జడిసి!

    చంపకమాల
    దృఢమగు భక్తి భావమున దేవుడటంచు భజించ శ్రీహరిన్
    దృఢమతి బాల భక్తుని తీరును మాన్పగఁ బంసైనికుల్
    దృఢతర యాయుధమ్ముల విదిల్చగ, కేశవుఁ దల్చ వ్యర్థమే!
    ద్రఢిమను జీమ తుమ్మఁగ బదాబదలయ్యె మృగేంద్రసంఘముల్!

    రిప్లయితొలగించండి
  3. తెల్ల దొరలను వణికించి తెగువ జూపి
    పోరు సల్పిన యల్లూరి వీరు డనె డు
    చీమ తుమ్మిన సింహ ముల్ సెదరె జడిసి
    ననుచు బొగడి రి యాంధ్రు లా ఘను ని మిగుల

    రిప్లయితొలగించండి

  4. తమ్మి మొగ్గర మందున దారకుడను
    గాంచి కురు వీరు లెల్లరు కలక చెంది
    రనుచు తెలుపుచు బుధుడనె నరయ నదియె
    చీమ తుమ్మెను సింహముల్ సెదరె జడిసి.


    దృఢమది తమ్మి మొగ్గరము దీమతి ద్రోణుడు పన్న నేమిరా
    దృఢమగు చిత్తమందు నని ద్వేషిల గూల్చగ నెంచు వానికిన్
    జడిసి కుయుక్తి పన్నిరట సంగర మందున నయ్యదిన్ గనన్
    ద్రఢిమను జీమ తుమ్మఁగ బదాబదలయ్యె మృగేంద్రసంఘముల్.


    రిప్లయితొలగించండి

  5. తమ్మి మొగ్గర మందున దారకుడను
    గాంచి కురు వీరు లెల్లరు కలక చెంది
    రనుచు తెలుపుచు బుధుడనె నరయ నదియె
    చీమ తుమ్మెను సింహముల్ సెదరె జడిసి.


    దృఢమది తమ్మి మొగ్గరము దీమతి ద్రోణుడు పన్న నేమిరా
    దృఢమగు చిత్తమందు నని ద్వేషిల గూల్చగ నెంచు వానికిన్
    జడిసి కుయుక్తి పన్నిరట సంగర మందున నయ్యదిన్ గనన్
    ద్రఢిమను జీమ తుమ్మఁగ బదాబదలయ్యె మృగేంద్రసంఘముల్.


    రిప్లయితొలగించండి
  6. రామరాజు వచ్చెనటంచు రక్షకభటు
    లకొకడు దెలిపినంత వారదిరిపడుచు
    పరుగు లెత్తిన వైనము పరిగణింప
    చీమ తుమ్మెను సింహముల్ సెదరె జడిసి

    దృఢమతియైనవాడు కడు ధీరుడు విప్లవ శక్తి రామరా
    జు ఢమఢమార్భటమ్ములను జూపుచు వచ్చెనటంచు బొంకగా
    దృఢముగ నమ్మి పారిరట తెంపరి రక్షకబంట్లు పోల్పఁగా
    ద్రఢిమను జీమ తుమ్మఁగ బదాబదలయ్యె మృగేంద్రసంఘముల్

    [విప్లవజ్యోతి అల్లూరి సీతారామరాజు పట్ల అప్పటి పోలీసులతీరు]

    రిప్లయితొలగించండి