13, ఆగస్టు 2026, గురువారం

సమస్య - 5558

14-8-2026 (శుక్రవారం)

ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...

“చీమ తుమ్మెను సింహముల్ సెదరె జడిసి”

(లేదా...)

“ద్రఢిమను జీమ తుమ్మఁగ బదాబదలయ్యె మృగేంద్రసంఘముల్”

(ఉప్పలధడియం భరతశర్మ శతావధానంలో దువ్వూరి వేంకట సుబ్బారావు అను మిస్సన్న గారి సమస్య)

16 కామెంట్‌లు:

  1. చిన్నపాటి దళము తోడ జేసినట్టి
    రామరాజు క్రాంతిని యెదురాడ లేక
    సతమతమయిన యాంగ్లుల సంగ తివిన
    చీమ తుమ్మెను సింహముల్ సెదరె జడిసి

    రిప్లయితొలగించండి
  2. రిప్లయిలు
    1. కందం
      వైరి శ్రీహరిన్ గొలుచు కుమారునెంచి
      భక్తిఁ బాపగ భయపెట్ట భటులనంప
      హాని తలపెట్ట., నచ్యుతా! యన విఫలమె!
      చీమ తుమ్మెను సింహముల్ సెదరె జడిసి!

      చంపకమాల
      దృఢమగు భక్తి భావమున దేవుడటంచు భజించ శ్రీహరిన్
      దృఢమతి బాల భక్తు పెడ తీరును మాన్పగఁ బంపసైనికుల్
      దృఢతరమైన నాయుధము దింపిన, కేశవుఁ దల్చ వ్యర్థమే!
      ద్రఢిమను జీమ తుమ్మఁగ బదాబదలయ్యె మృగేంద్రసంఘముల్!

      తొలగించండి
  3. తెల్ల దొరలను వణికించి తెగువ జూపి
    పోరు సల్పిన యల్లూరి వీరు డనె డు
    చీమ తుమ్మిన సింహ ముల్ సెదరె జడిసి
    ననుచు బొగడి రి యాంధ్రు లా ఘను ని మిగుల

    రిప్లయితొలగించండి

  4. తమ్మి మొగ్గర మందున దారకుడను
    గాంచి కురు వీరు లెల్లరు కలక చెంది
    రనుచు తెలుపుచు బుధుడనె నరయ నదియె
    చీమ తుమ్మెను సింహముల్ సెదరె జడిసి.


    దృఢమది తమ్మి మొగ్గరము దీమతి ద్రోణుడు పన్న నేమిరా
    దృఢమగు చిత్తమందు నని ద్వేషిల గూల్చగ నెంచు వానికిన్
    జడిసి కుయుక్తి పన్నిరట సంగర మందున నయ్యదిన్ గనన్
    ద్రఢిమను జీమ తుమ్మఁగ బదాబదలయ్యె మృగేంద్రసంఘముల్.


    రిప్లయితొలగించండి

  5. తమ్మి మొగ్గర మందున దారకుడను
    గాంచి కురు వీరు లెల్లరు కలక చెంది
    రనుచు తెలుపుచు బుధుడనె నరయ నదియె
    చీమ తుమ్మెను సింహముల్ సెదరె జడిసి.


    దృఢమది తమ్మి మొగ్గరము దీమతి ద్రోణుడు పన్న నేమిరా
    దృఢమగు చిత్తమందు నని ద్వేషిల గూల్చగ నెంచు వానికిన్
    జడిసి కుయుక్తి పన్నిరట సంగర మందున నయ్యదిన్ గనన్
    ద్రఢిమను జీమ తుమ్మఁగ బదాబదలయ్యె మృగేంద్రసంఘముల్.


    రిప్లయితొలగించండి
  6. రామరాజు వచ్చెనటంచు రక్షకభటు
    లకొకడు దెలిపినంత వారదిరిపడుచు
    పరుగు లెత్తిన వైనము పరిగణింప
    చీమ తుమ్మెను సింహముల్ సెదరె జడిసి

    దృఢమతియైనవాడు కడు ధీరుడు విప్లవ శక్తి రామరా
    జు ఢమఢమార్భటమ్ములను జూపుచు వచ్చెనటంచు బొంకగా
    దృఢముగ నమ్మి పారిరట తెంపరి రక్షకబంట్లు పోల్పఁగా
    ద్రఢిమను జీమ తుమ్మఁగ బదాబదలయ్యె మృగేంద్రసంఘముల్

    [విప్లవజ్యోతి అల్లూరి సీతారామరాజు పట్ల అప్పటి పోలీసులతీరు]

    రిప్లయితొలగించండి
  7. తే॥ బాలల లఘుచిత్రములొప్పు బహు వినోద
    భరితమై యసహజమునేపారుచుండ
    నట్టి యొక్క చిత్రమునందు గట్టిగాను
    జీమ తుమ్మెను సింహముల్ సెదరె జడిసి

    చం॥ ద్రఢిమగ బాలురెల్ల కనఁ దాల్చ వినోదము వింత పద్ధతుల్
    దృఢముగ నిశ్చయించి యటు తృప్తిని మోదము మీరఁ బొందఁగన్
    దృఢముగ నూహకందనటు తీసిరి చిత్రమునందుఁ గాంచఁగన్
    ద్రఢిమను జీమ తుమ్మఁగఁ బదాబదలయ్యె మృగేంద్ర సంఘముల్

    ద్రఢిమ firmness tightness

    రిప్లయితొలగించండి
  8. చం:దృఢు డగు బ్రహ్మరాక్షసుని నెక్కగ జీమల దండు వానిదౌ
    దృఢమగు నిద్ర మాయ మయి "యేమిది?" యంచను లోపునన్ భళా
    దృఢమగ వాని నాసికను నే గుహయో యని దూరి నంతనే
    ద్రఢిమను జీమ తుమ్మఁగ బదాబదలయ్యె మృగేంద్రసంఘముల్”



    రిప్లయితొలగించండి
  9. 1)తే.గీ:జంతుశాలలో నధికారి జంతువులకు
    నోగిరము మందు లిచ్చుచు సాగుచుండ
    నతని నాసిక లో జేరి నంత నొక్క
    చీమ, తుమ్మెను, సింహముల్ సెదరె జడి

    రిప్లయితొలగించండి
  10. వేయి యేనుఁగుల బలము వెలఁది కొసఁగె
    నౌర పంకజ గర్భుఁడు కోరి నంత
    నారి రక్కసి తాటక, నసను దూఱఁ
    జీమ, తుమ్మెను సింహముల్ సెదరె జడిసి


    వెడల నరుం డెదిర్ప పర వీరుల సంగర రంగ మందు మ్రోఁ
    గ ఢమఢమధ్వనుల్ పుడమి కాంతుఁడు సైంధవుఁ డేయ బాణముల్
    దృఢముగ నిల్వ లేక కడు దీనులు పాండవు లైరి యక్కటా
    ద్రఢిమను జీమ తుమ్మఁగ బదాబదలయ్యె మృగేంద్ర సంఘముల్

    రిప్లయితొలగించండి
  11. లీకు పేపరు గూర్చియు లేపి జనుల
    ధర్న జేయించె దిప్కెతా ధైర్యముగను
    పెక్కు రోజులు, సచివులు వెరచిరరరె!
    చీమ తుమ్మెను సింహముల్ సెదరె జడిసి

    రిప్లయితొలగించండి

  12. పిన్నక నాగేశ్వరరావు.
    హైదరాబాద్.

    కాయకష్టము జేసి పగలు నలసిన
    తరి నిదుర పోవుచుండెడు తరుణమందు
    దూరగా నపు డేనుగు తొండమందు
    చీమ; తుమ్మెను; సింహముల్ సెదరె జడిసి.

    రిప్లయితొలగించండి