16-8-2026 (ఆదివారం)
ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...
“త్రొక్కఁగఁ బాదముల జనులు దుష్టిం గనరే”
(లేదా...)
“త్రొక్కఁగఁ బాదయుగ్మహతి తుష్టినొసంగదె చూచువారికిన్”
(ఉప్పలధడియం భరతశర్మ శతావధానంలో పిలకా సరోజిని గారి సమస్య)
ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
మక్కువగొని గుడికి వెడలనెక్కువ దూరము నడువగ నెచ్చుగ సతికిన్ త్రిక్కునొసగ , బదములతోత్రొక్కఁగఁ బాదముల జనులు దుష్టిం గనరే
కందముచక్కని వధూవరులు మాప్రక్కింటికి మెరవణిగను రాగ మఱది తామక్కువ డప్పుకు చిందులుఁద్రొక్కఁగఁ బాదముల జనులు దుష్టిం గనరే! ఉత్పలమాలనిక్కి వధూవరుల్ మెరవణిన్ కనువిందును జేయు జంటగన్పెక్కురు ముచ్చటన్ గనఁగ వేడుక వీధిని వెంట సాగగన్మక్కువఁ జూపుచున్ మఱది మానక డప్పుకు నొప్పఁ జిందులన్ద్రొక్కఁగఁ బాదయుగ్మహతి తుష్టినొసంగదె చూచువారికిన్!
మక్కవతో గురువద్దకుగ్రక్కున జనె వినగ నతని ప్రవచనములతానక్కడి వారిని గురువేత్రొక్కగ బాదముల జనులు దుష్టింగనరే
టక్కరి కాముకు డొక్కడు పెక్కుగ జనులున్న చోట బేటము కొరకై చక్కని చుక్కను జేరుచు త్రొక్కఁగఁ బాదముల జనులు దుష్టిం గనరే.దుక్కిని దున్ను పాళమున తుప్పల నుండి యపత్య శత్రువే వెక్కస మైన వేగమున వేవిలి చేరగ దుక్కి కైదువున్ బక్కన పెట్టి సైరికుడు పర్వులు పెట్టు తరిన్ శితాగ్రమున్ త్రొక్కఁగఁ బాదయుగ్మహతి తుష్టినొసంగదె చూచువారికిన్.
చక్కగ వధూవరులు కడుమక్కువతో తరలి పెండ్లి మంటప మందున్జక్కనిదగు సనెకలుపైఁద్రొక్కఁగఁ బాదముల జనులు దుష్టిం గనరేచక్కని జంట లభ్యమని చప్పున పెండ్లికి సిద్ధమౌచు తామొక్కరికొక్కరేనని మహోన్నత జీవన యాత్ర పట్టునన్దక్కుఁ బ్రయోజనంబనుచు దంపతులిర్వురు సన్నెకల్లుపైఁద్రొక్కఁగఁ బాదయుగ్మహతి తుష్టినొసంగదె చూచువారికిన్
మక్కువ తో మొహ రమ్ము న చక్కని డప్పు లకు దగిన చలనము దోడ న్ నిక్కుచు నాడుచు స్టెప్పులు ద్రొ క్క గ బాదములు జనులు దుష్టి o గన రే
ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
రిప్లయితొలగించండిమక్కువగొని గుడికి వెడల
రిప్లయితొలగించండినెక్కువ దూరము నడువగ నెచ్చుగ సతికిన్
త్రిక్కునొసగ , బదములతో
త్రొక్కఁగఁ బాదముల జనులు దుష్టిం గనరే
కందము
రిప్లయితొలగించండిచక్కని వధూవరులు మా
ప్రక్కింటికి మెరవణిగను రాగ మఱది తా
మక్కువ డప్పుకు చిందులుఁ
ద్రొక్కఁగఁ బాదముల జనులు దుష్టిం గనరే!
ఉత్పలమాల
నిక్కి వధూవరుల్ మెరవణిన్ కనువిందును జేయు జంటగన్
పెక్కురు ముచ్చటన్ గనఁగ వేడుక వీధిని వెంట సాగగన్
మక్కువఁ జూపుచున్ మఱది మానక డప్పుకు నొప్పఁ జిందులన్
ద్రొక్కఁగఁ బాదయుగ్మహతి తుష్టినొసంగదె చూచువారికిన్!
మక్కవతో గురువద్దకు
రిప్లయితొలగించండిగ్రక్కున జనె వినగ నతని ప్రవచనములతా
నక్కడి వారిని గురువే
త్రొక్కగ బాదముల జనులు దుష్టింగనరే
రిప్లయితొలగించండిటక్కరి కాముకు డొక్కడు
పెక్కుగ జనులున్న చోట బేటము కొరకై
చక్కని చుక్కను జేరుచు
త్రొక్కఁగఁ బాదముల జనులు దుష్టిం గనరే.
దుక్కిని దున్ను పాళమున తుప్పల నుండి యపత్య శత్రువే
వెక్కస మైన వేగమున వేవిలి చేరగ దుక్కి కైదువున్
బక్కన పెట్టి సైరికుడు పర్వులు పెట్టు తరిన్ శితాగ్రమున్
త్రొక్కఁగఁ బాదయుగ్మహతి తుష్టినొసంగదె చూచువారికిన్.
రిప్లయితొలగించండిటక్కరి కాముకు డొక్కడు
పెక్కుగ జనులున్న చోట బేటము కొరకై
చక్కని చుక్కను జేరుచు
త్రొక్కఁగఁ బాదముల జనులు దుష్టిం గనరే.
దుక్కిని దున్ను పాళమున తుప్పల నుండి యపత్య శత్రువే
వెక్కస మైన వేగమున వేవిలి చేరగ దుక్కి కైదువున్
బక్కన పెట్టి సైరికుడు పర్వులు పెట్టు తరిన్ శితాగ్రమున్
త్రొక్కఁగఁ బాదయుగ్మహతి తుష్టినొసంగదె చూచువారికిన్.
చక్కగ వధూవరులు కడు
రిప్లయితొలగించండిమక్కువతో తరలి పెండ్లి మంటప మందున్
జక్కనిదగు సనెకలుపైఁ
ద్రొక్కఁగఁ బాదముల జనులు దుష్టిం గనరే
చక్కని జంట లభ్యమని చప్పున పెండ్లికి సిద్ధమౌచు తా
మొక్కరికొక్కరేనని మహోన్నత జీవన యాత్ర పట్టునన్
దక్కుఁ బ్రయోజనంబనుచు దంపతులిర్వురు సన్నెకల్లుపైఁ
ద్రొక్కఁగఁ బాదయుగ్మహతి తుష్టినొసంగదె చూచువారికిన్
మక్కువ తో మొహ రమ్ము న
రిప్లయితొలగించండిచక్కని డప్పు లకు దగిన చలనము దోడ న్
నిక్కుచు నాడుచు స్టెప్పులు
ద్రొ క్క గ బాదములు జనులు దుష్టి o గన రే