17-8-2026 (సోమవారం)
ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...
“నలభీములు వండినారు నారదు పెండ్లిన్”
(లేదా...)
“నలుఁడును భీముఁడుం గలసి నారదు పెండ్లికి వంటఁ జేసిరే”
(ఉప్పలధడియం భరతశర్మ శతావధానంలో మహాభాష్యం నరసింహ శ్రీహరేశ్ గారి సమస్య)
కలలోన బెండ్లి జూచితినల గాంచితి(గ్రోలితి) కమ్మనైన నాహారమహో!తిలకించి నాడ నేనటనలభీములు వండినారు నారదు పెండ్లిన్!
కలగంటి నిన్నటి నిశను యిలకు దిగిన నారద ముని యీప్సిత మొందన్ నెలతుకను వివహమాడగ ,నలభీములు వండినారు నారదు పెండ్లిన్
తెలియక పోయిన నెప్పుడుపలువిధ శాస్త్రము లెరిగిన పఠిని యటంచున్ పలికెడి పామరు డిట్లనె నలభీములు వండినారు నారదు పెండ్లిన్.పలువురి చేత దూరబడు పామరు డాతడు కల్లు పాకకున్ జెలమరి తోడ జేరి యట శీధువు గ్రోలుచు భూరి జ్ఞానమున్ కలిగిన వాడినంచు కల కాలము చెప్పెడి వాడు చెప్పెనే నలుఁడును భీముఁడుం గలసి నారదు పెండ్లికి వంటఁ జేసిరే.
పిలిచితి పెండ్లికి రమ్మనిపొలుపున నారదుని పాత్ర పోషకుడనగాతరలెను నాటక బృందమునలభీములు వండినారు నారదు పెండ్లిన్నలుగురి మెప్పునొందె నవ నాటకమండలి తెల్గునేలపైపలువురు వేషధారులటఁ బ్రస్తుతు లొందిన గొప్పవారలేపిలువగ నేగిరా నటులు పెండ్లని నారద పాత్రధారికిన్నలుఁడును భీముఁడుం గలసి నారదు పెండ్లికి వంటఁ జేసిరే
కలలోన బెండ్లి జూచితి
రిప్లయితొలగించండినల గాంచితి(గ్రోలితి) కమ్మనైన నాహారమహో!
తిలకించి నాడ నేనట
నలభీములు వండినారు నారదు పెండ్లిన్!
కలగంటి నిన్నటి నిశను
రిప్లయితొలగించండియిలకు దిగిన నారద ముని యీప్సిత మొందన్
నెలతుకను వివహమాడగ ,
నలభీములు వండినారు నారదు పెండ్లిన్
రిప్లయితొలగించండితెలియక పోయిన నెప్పుడు
పలువిధ శాస్త్రము లెరిగిన పఠిని యటంచున్
పలికెడి పామరు డిట్లనె
నలభీములు వండినారు నారదు పెండ్లిన్.
పలువురి చేత దూరబడు పామరు డాతడు కల్లు పాకకున్
జెలమరి తోడ జేరి యట శీధువు గ్రోలుచు భూరి జ్ఞానమున్
కలిగిన వాడినంచు కల కాలము చెప్పెడి వాడు చెప్పెనే
నలుఁడును భీముఁడుం గలసి నారదు పెండ్లికి వంటఁ జేసిరే.
పిలిచితి పెండ్లికి రమ్మని
రిప్లయితొలగించండిపొలుపున నారదుని పాత్ర పోషకుడనగా
తరలెను నాటక బృందము
నలభీములు వండినారు నారదు పెండ్లిన్
నలుగురి మెప్పునొందె నవ నాటకమండలి తెల్గునేలపై
పలువురు వేషధారులటఁ బ్రస్తుతు లొందిన గొప్పవారలే
పిలువగ నేగిరా నటులు పెండ్లని నారద పాత్రధారికిన్
నలుఁడును భీముఁడుం గలసి నారదు పెండ్లికి వంటఁ జేసిరే