17, ఆగస్టు 2026, సోమవారం

సమస్య - 5562

18-8-2026 (మంగళవారం)

ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...

“కాకి యనఁ గొందఱయ్యది కేకి యనిరి”

(లేదా...)

“కొందరు కాకి యంచు మఱికొందఱు కోకిల యంచుఁ బిల్వరే”

(ఉప్పలధడియం భరతశర్మ శతావధానంలో మాచవోలు శ్రీధర రావు గారి సమస్య)

6 కామెంట్‌లు:

  1. పెరటిలోని చెట్టు పయిన పెట్టినట్టి
    గూటియందున నిలబడీ , గొంతు విప్ప
    కుండ యున్న దానిని జుచి కొంతమంది
    కాకి యనఁ గొందఱయ్యది కేకి యనిరి

    రిప్లయితొలగించండి


  2. ఇందరు మానవాళి కిట
    నిష్ట మనిష్టములుండు సాజమే
    పొందుగనున్న కాలమున
    మోదమునొంది సమాదరింతురే
    కందువ వీడినంత సహ
    కారము శూన్యమదేల చోద్యమో
    కొందరు కాకి యంచు మఱి
    కొందఱు కోకిల టంచుఁ బిల్వరే!

    రిప్లయితొలగించండి
  3. రిప్లయిలు
    1. తేటగీతి
      మెచ్చనట్టి వారి పిలుపు గ్రుచ్చుకొనును
      ప్రియము గాదెనచ్చిన వారి పిలుపు చూడ
      గాయనీమణి కంఠాన గమకమొలుక
      కాకి యనఁ గొందఱయ్యది కేకి యనిరి!

      ఉత్పలమాల
      కుందగఁ బిల్వరే తమకు కూడని వారల నైపుణిన్ గనన్
      విందుగ వీనులన్ వినుచు ప్రీతిగా మెత్తురు నచ్చువారలున్
      సందడిఁ జేయుచున్ దరుణి సంబరమొందుచు నాలపించగన్
      కొందరు కాకి యంచు మఱికొందఱు కోకిల యంచుఁ బిల్వరే!

      తొలగించండి

  4. ధరణి యందు హెచ్చుగ జనాదరణ పొంది
    నట్టి నాయకుడుగు మోది యనిన నచ్చ
    నట్టి వారుండిరి నిజమె యతనిని గని
    కాకి యనఁ గొందఱయ్యది కేకి యనిరి.


    బందిని చేసి తెచ్చితివి భామను ధర్మము కాదటంచ నన్
    చిందఱ తోడ నీతులను చెప్పిన యట్టి విభీషణుండనే
    దందడ కాడవంచనెను తామస మందున రావణుండనన్
    కొందరు కాకి యంచు మఱికొందఱు కోకిల యంచుఁ బిల్వరే.

    రిప్లయితొలగించండి
  5. దృశ్యమొక్కటైనను భిన్నదృక్కులుండు
    దృష్టికోణ నిర్దేశము దృశ్యమగును
    పిల్ల వాడొక చిత్తరు వేసినపుడు
    కాకి యనఁ గొందఱయ్యది కేకి యనిరి

    కొందరి చిత్తవృత్తి మరికొందరి భావన లుండు భిన్నమై
    గందర గోళమన్నఁ బొడగాంచిన వారల దృష్టి కోణమే
    పందెము వేసి చిత్రకుడు పక్షిని నల్లగ గీసినంతటన్
    గొందరు కాకి యంచు మఱికొందఱు కోకిల యంచుఁ బిల్వరే

    రిప్లయితొలగించండి