18, ఆగస్టు 2026, మంగళవారం

సమస్య - 5563

19-8-2026 (బుధవారం)

ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...

“గంపలలో మోయఁ దగును గౌరవము బుధుల్”

(లేదా...)

“గంపలందున మోయుచుందురు గౌరవమ్మునుఁ బండితుల్”

(ఉప్పలధడియం భరతశర్మ శతావధానంలో కందుల నాగేంద్రవరప్రసాద్ గారి సమస్య)

15 కామెంట్‌లు:

  1. కందం
    ఇంపొన గూర్చును నెత్తిన
    దింపక యున్నంత వరకె తేజమొసంగున్
    జింపఁగ జూడఁగ లోకుల్
    గంపలలో మోయఁ దగును గౌరవము బుధుల్!

    ఉత్పలమాల
    ఇంపుగూర్చును లోకమందున నెత్తి నుంచఁగ నెత్తినన్
    దింపఁజూతురు నోర్వలేకయె తేజమున్గన నీర్ష్యతోన్
    జింపఁ జూడగ లాగివైచుచుఁ జిక్కులందున దోయఁగన్
    గంపలందున మోయుచుందురు గౌరవమ్మునుఁ బండితుల్!

    (కంపలందున= చిక్కులు అడ్డంకులను కంపల్లో అని భావము)

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. సవరించిన వృత్త పూరణ:

      ఉత్పలమాల
      ఇంపుగూర్చును లోకమందున నెత్తి నుంచఁగ నెత్తినన్
      దింపఁ జూచెద రోర్వకుండయె తేజమున్గన నీర్ష్యతోన్
      జింపఁ జూడగ లాగివైచుచుఁ జిక్కులందున ద్రోయఁగన్
      గంపలందున మోయుచుందురు గౌరవమ్మునుఁ బండితుల్!

      తొలగించండి
  2. నింపుగ కైతలిడు గవుల
    బంపెడు వేళన గురుతుగ పతకము లిడగా
    సంపాదించిన గురుతుల
    గంపలలో మోయఁ దగును గౌరవము బుధుల్”

    రిప్లయితొలగించండి


  3. ఇంపుగా కవితావిపంచి ప్ర
    హేలలో శ్రుతియించగా
    సొంపు లీనెడి పద్యరత్నపు
    శోభలన్విరజిమ్ము సా
    రంపు రమ్యపరీమళంపు వి
    లాస భాసపు వాసితో
    గంపలందున మోయుచుందురు గౌరవమ్మునుఁ బండితుల్!

    వాసి=గొప్పతనము

    రిప్లయితొలగించండి

  4. *(ధనము తీసుకుని సన్మానాలు చేసె సంస్థ యొక్క ప్రకటన)*

    సొంపగు సన్మానమ్ముల
    నింపుగ మాసంస్థ చేయు నెవ్వరి కైనన్
    పంపిన తగు ద్రవ్యమ్మును
    గంపలలో మోయఁ దగును గౌరవము బుధుల్.


    పెంపు జేసెద మీదు కీర్తిని విజ్ఞులెల్లరెఱుంగుడీ
    సంపదన్నది కాదు ధాత్రిని శాశ్వతమ్మని నమ్ముచున్
    పంపిహెచ్చుగ మాకు ద్రవ్యము వాసి గౌరవ జ్ఞాపికల్
    గంపలందున మోయుచుందురు గౌరవమ్మునుఁ బండితుల్.

    రిప్లయితొలగించండి
  5. ఇంపగు కవిత్వమేగద
    నింపును డెందమున హాయి నిరవధికముగా
    పెంపొసగ సృజించినచో
    గంపలలో మోయఁ దగును గౌరవము బుధుల్

    నింపు గాదె కవిత్వమే మదిఁ నిశ్చయంబుగ హాయినే
    పెంపొసంగు కవిత్వ సంపద వేల వత్సములైననున్
    గంపొసంగు విధాన చక్కని గ్రంథ రూపమునిచ్చుచున్
    గంపలందున మోయుచుందురు గౌరవమ్మునుఁ బండితుల్

    రిప్లయితొలగించండి
  6. ఇంపుగ కవితల నల్లుచు
    సొంపుగ నవ ధాన ములను శోభిల జేయన్
    పంపిడు ప్రశంస ల ధనము
    గంపల లో మో య దగును గౌరవము బుధు ల్

    రిప్లయితొలగించండి
  7. చంపకంబులు ఉత్పలంబులు చక్క గల్లుచు నెన్నియో
    యింపు గొల్పెడు రీతి వాటిని యిచ్చతోడుగ పాడగన్
    సొంపు గున్నవి యంచు మెచ్చుచు సొమ్ము లివ్వగ శ్రోతలున్
    గంప లందున మోయు చుందురు గౌరవమ్మున బండితుల్

    రిప్లయితొలగించండి
  8. ఇంపుగ పద్యము లల్లుచు
    సొంపుగ కైతలను జెప్ప సుకవీంద్రునిగా
    సంపాదింపఁగ కీరితి
    గంపలలో మోయఁ దగును గౌరవము బుధుల్

    రిప్లయితొలగించండి
  9. ఇంపుగా నవ కైతలల్లిన నెల్లవారలు మెచ్చుచున్
    పెంపుగా కవితల్లజా యని బిల్వ మోదము గల్గుగా
    సంపదల్ సమకూరు ధారుణి సత్కవీంద్రుడవంచు నిన్
    గంపలందున మోయుచుందురు గౌరవమ్మునుఁ బండితుల్

    రిప్లయితొలగించండి
  10. కం:ఇంపగు కావ్యము లెన్ని లి
    ఖింపగ గొని చదువు వార లేరి కవీంద్రా!
    కొంప సరి పోక, చెత్తై
    గంపలలో మోయఁ దగును గౌరవము బుధుల్”

    రిప్లయితొలగించండి
  11. మ.కో:ఇంపు గొల్పు సమస్య లెన్నియొ యీయ బ్రాశ్నికు లెల్లరున్
    పంప నేమగు యీయకుండనె పారితోషిక మింతయున్
    పంపక మ్మొనరించినారుగ బండె డీవిధి గ్రంధముల్
    గంపలందున మోయుచుందురు గౌరవమ్మునుఁ బండితుల్”
    (అవధానానికి పోతే ప్రాశ్నికులకు పారితోషికం ఇవ్వక పోతే మానె గాని బండెడు పుస్తకా లిచ్చారట.ఇక ఆ గౌరవాన్ని పండితులు గంపల్లో మోసుకుంటూ పోవాలి. తమాషాకి. )

    రిప్లయితొలగించండి
  12. మత్త॥ ఇంపుగా నవధాన పాండితి యెంతయో తనియించఁగన్
    నింపఁగాఁ గడు సంతసమ్మును నెమ్మిఁ గాంచి యవిజ్ఞుఁడే
    సొంపుగా బుధులెల్ల పేర్కొన శోభ నీవిధి పల్కినే
    గంపలందున మోయుచుందురు గౌరవమ్మునుఁ బండితుల్


    (విజ్ఞులు పాండితీ ప్రభలను కొనియాడితే అవిజ్ఞుడు వానికున్న పరిధిలో ఆ పొగడ్తలను తెలిపాడు అనే ఉద్దేశంతో నండి)

    రిప్లయితొలగించండి
  13. మ.కో:ఇంపు గొల్పెడు కావ్యకన్యక నీయగా గృతిభర్తకున్
    గంప నున్న వధూమణిన్ బలె గానుపించు ధరాధిపా!
    సొంపు గొల్పెడు తాళపత్రపు సొమ్ము నీయదె యీ సభన్
    గంపలందున మోయుచుందురు గౌరవమ్మునుఁ బండితుల్”
    (ఒక కవి కావ్యకన్యకను కృతిభర్త ఐన రాజుకు ఇస్తున్నాడు.ఆ రోజుల్లో తాళపత్ర గ్రంథాలు కనుక ఇలా గంపలలో పెట్టి ఇవ్వాలి.అలా గంపలలో పెట్టి ఇవ్వటం నిజం గా పెళ్లికూతురిని పెళ్లికి తీసుకొస్తున్నట్టే ఉన్నదని కవి వర్ణించాడు. )



    రిప్లయితొలగించండి