11-7-2026 (శనివారం)ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...“శివునిఁ బూజింపనొప్పు మసీదునందు”(లేదా...)“శివునకుఁ బూజ సేయఁగ మసీదొకటే తగినట్టి స్థానమౌ”
తేటగీతిశివములన్ శుభముల గూర్చ శివుడనెదరుమంగళకరుడల్లా యన మలకలెల్లనిత్యమున్ ప్రార్థనలవేళ నీమమెంచిశివునిఁ బూజింపనొప్పు మసీదునందుచంపకమాలశివములనన్ శుభమ్ములనఁ జిందఁగవాటి శివుండనందురేస్తవముల నా రహీముఁగని స్వాంతనఁ బొందఁగ వేడుచుండగన్శివము మహమ్మదీయులకుఁ జిందును! వాడె శివుండు! వార లాశివునకుఁ బూజ సేయఁగ మసీదొకటే తగినట్టి స్థానమౌ!
హిందువులు దేవళము నందు హితము కోరి శివునిఁ బూజింపనొప్పు ; మసీదునందుతురకలు నమాజు సలుపును తొరలు రీతి వారి విధములు వేరయ్యు పరమమొకడె
అది మహమ్మదీయుల ప్రార్థనాలయమని యెఱుగకనె వచించితి వేమొ హిందు వటకు నేగు నెట్లు చెప్పె నెవడు నీకు? నెచట శివునిఁ బూజింపనొప్పు మసీదునందు?వివరిణు డెవ్వడో పలుక వింటివి కాని మసీదటం చనన్ యవనుల ప్రార్థనాలయమటంచు నెఱంగియు వెఱ్ఱి వాడవై ధవలపు ద్రావకమ్ము కలు ద్రావి వచించితి వియ్యదెచ్చ టన్ శివునకుఁ బూజ సేయఁగ మసీదొకటే తగినట్టి స్థానమౌ.?
తేటగీతి
రిప్లయితొలగించండిశివములన్ శుభముల గూర్చ శివుడనెదరు
మంగళకరుడల్లా యన మలకలెల్ల
నిత్యమున్ ప్రార్థనలవేళ నీమమెంచి
శివునిఁ బూజింపనొప్పు మసీదునందు
చంపకమాల
శివములనన్ శుభమ్ములనఁ జిందఁగవాటి శివుండనందురే
స్తవముల నా రహీముఁగని స్వాంతనఁ బొందఁగ వేడుచుండగన్
శివము మహమ్మదీయులకుఁ జిందును! వాడె శివుండు! వార లా
శివునకుఁ బూజ సేయఁగ మసీదొకటే తగినట్టి స్థానమౌ!
హిందువులు దేవళము నందు హితము కోరి
రిప్లయితొలగించండిశివునిఁ బూజింపనొప్పు ; మసీదునందు
తురకలు నమాజు సలుపును తొరలు రీతి
వారి విధములు వేరయ్యు పరమమొకడె
రిప్లయితొలగించండిఅది మహమ్మదీయుల ప్రార్థనాలయమని
యెఱుగకనె వచించితి వేమొ హిందు వటకు
నేగు నెట్లు చెప్పె నెవడు నీకు? నెచట
శివునిఁ బూజింపనొప్పు మసీదునందు?
వివరిణు డెవ్వడో పలుక వింటివి కాని మసీదటం చనన్
యవనుల ప్రార్థనాలయమటంచు నెఱంగియు వెఱ్ఱి వాడవై
ధవలపు ద్రావకమ్ము కలు ద్రావి వచించితి వియ్యదెచ్చ టన్
శివునకుఁ బూజ సేయఁగ మసీదొకటే తగినట్టి స్థానమౌ.?