14-8-2026 (శుక్రవారం)
ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...
“చీమ తుమ్మెను సింహముల్ సెదరె జడిసి”
(లేదా...)
“ద్రఢిమను జీమ తుమ్మఁగ బదాబదలయ్యె మృగేంద్రసంఘముల్”
(ఉప్పలధడియం భరతశర్మ శతావధానంలో దువ్వూరి వేంకట సుబ్బారావు అను మిస్సన్న గారి సమస్య)
చిన్నపాటి దళము తోడ జేసినట్టిరామరాజు క్రాంతిని యెదురాడ లేక సతమతమయిన యాంగ్లుల సంగ తివినచీమ తుమ్మెను సింహముల్ సెదరె జడిసి
ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
కందంవైరి శ్రీహరిన్ గొలుచు కుమారునెంచిభక్తిఁ బాపగ భయపెట్ట భటులనంపహాని తలపెట్ట., నచ్యుతా! యన విఫలమె! చీమ తుమ్మెను సింహముల్ సెదరె జడిసి! చంపకమాలదృఢమగు భక్తి భావమున దేవుడటంచు భజించ శ్రీహరిన్దృఢమతి బాల భక్తు పెడ తీరును మాన్పగఁ బంపసైనికుల్దృఢతరమైన నాయుధము దింపిన, కేశవుఁ దల్చ వ్యర్థమే! ద్రఢిమను జీమ తుమ్మఁగ బదాబదలయ్యె మృగేంద్రసంఘముల్!
తెల్ల దొరలను వణికించి తెగువ జూపి పోరు సల్పిన యల్లూరి వీరు డనె డు చీమ తుమ్మిన సింహ ముల్ సెదరె జడిసి ననుచు బొగడి రి యాంధ్రు లా ఘను ని మిగుల
తమ్మి మొగ్గర మందున దారకుడను గాంచి కురు వీరు లెల్లరు కలక చెంది రనుచు తెలుపుచు బుధుడనె నరయ నదియె చీమ తుమ్మెను సింహముల్ సెదరె జడిసి.దృఢమది తమ్మి మొగ్గరము దీమతి ద్రోణుడు పన్న నేమిరా దృఢమగు చిత్తమందు నని ద్వేషిల గూల్చగ నెంచు వానికిన్ జడిసి కుయుక్తి పన్నిరట సంగర మందున నయ్యదిన్ గనన్ ద్రఢిమను జీమ తుమ్మఁగ బదాబదలయ్యె మృగేంద్రసంఘముల్.
రామరాజు వచ్చెనటంచు రక్షకభటులకొకడు దెలిపినంత వారదిరిపడుచుపరుగు లెత్తిన వైనము పరిగణింపచీమ తుమ్మెను సింహముల్ సెదరె జడిసిదృఢమతియైనవాడు కడు ధీరుడు విప్లవ శక్తి రామరాజు ఢమఢమార్భటమ్ములను జూపుచు వచ్చెనటంచు బొంకగాదృఢముగ నమ్మి పారిరట తెంపరి రక్షకబంట్లు పోల్పఁగాద్రఢిమను జీమ తుమ్మఁగ బదాబదలయ్యె మృగేంద్రసంఘముల్[విప్లవజ్యోతి అల్లూరి సీతారామరాజు పట్ల అప్పటి పోలీసులతీరు]
తే॥ బాలల లఘుచిత్రములొప్పు బహు వినోదభరితమై యసహజమునేపారుచుండనట్టి యొక్క చిత్రమునందు గట్టిగానుజీమ తుమ్మెను సింహముల్ సెదరె జడిసిచం॥ ద్రఢిమగ బాలురెల్ల కనఁ దాల్చ వినోదము వింత పద్ధతుల్దృఢముగ నిశ్చయించి యటు తృప్తిని మోదము మీరఁ బొందఁగన్దృఢముగ నూహకందనటు తీసిరి చిత్రమునందుఁ గాంచఁగన్ద్రఢిమను జీమ తుమ్మఁగఁ బదాబదలయ్యె మృగేంద్ర సంఘముల్ద్రఢిమ firmness tightness
చం:దృఢు డగు బ్రహ్మరాక్షసుని నెక్కగ జీమల దండు వానిదౌదృఢమగు నిద్ర మాయ మయి "యేమిది?" యంచను లోపునన్ భళాదృఢమగ వాని నాసికను నే గుహయో యని దూరి నంతనేద్రఢిమను జీమ తుమ్మఁగ బదాబదలయ్యె మృగేంద్రసంఘముల్”
1)తే.గీ:జంతుశాలలో నధికారి జంతువులకునోగిరము మందు లిచ్చుచు సాగుచుండనతని నాసిక లో జేరి నంత నొక్కచీమ, తుమ్మెను, సింహముల్ సెదరె జడి
వేయి యేనుఁగుల బలము వెలఁది కొసఁగె నౌర పంకజ గర్భుఁడు కోరి నంత నారి రక్కసి తాటక, నసను దూఱఁజీమ, తుమ్మెను సింహముల్ సెదరె జడిసి వెడల నరుం డెదిర్ప పర వీరుల సంగర రంగ మందు మ్రోఁగ ఢమఢమధ్వనుల్ పుడమి కాంతుఁడు సైంధవుఁ డేయ బాణముల్ దృఢముగ నిల్వ లేక కడు దీనులు పాండవు లైరి యక్కటా ద్రఢిమను జీమ తుమ్మఁగ బదాబదలయ్యె మృగేంద్ర సంఘముల్
మీ రెండు పూరణలు అద్భుతంగా ఉన్నవి. అభినందనలు.
లీకు పేపరు గూర్చియు లేపి జనులధర్న జేయించె దిప్కెతా ధైర్యముగనుపెక్కు రోజులు, సచివులు వెరచిరరరె!చీమ తుమ్మెను సింహముల్ సెదరె జడిసి
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
పిన్నక నాగేశ్వరరావు.హైదరాబాద్.కాయకష్టము జేసి పగలు నలసినతరి నిదుర పోవుచుండెడు తరుణమందుదూరగా నపు డేనుగు తొండమందుచీమ; తుమ్మెను; సింహముల్ సెదరె జడిసి.
చిన్నపాటి దళము తోడ జేసినట్టి
రిప్లయితొలగించండిరామరాజు క్రాంతిని యెదురాడ లేక
సతమతమయిన యాంగ్లుల సంగ తివిన
చీమ తుమ్మెను సింహముల్ సెదరె జడిసి
ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
రిప్లయితొలగించండికందం
తొలగించండివైరి శ్రీహరిన్ గొలుచు కుమారునెంచి
భక్తిఁ బాపగ భయపెట్ట భటులనంప
హాని తలపెట్ట., నచ్యుతా! యన విఫలమె!
చీమ తుమ్మెను సింహముల్ సెదరె జడిసి!
చంపకమాల
దృఢమగు భక్తి భావమున దేవుడటంచు భజించ శ్రీహరిన్
దృఢమతి బాల భక్తు పెడ తీరును మాన్పగఁ బంపసైనికుల్
దృఢతరమైన నాయుధము దింపిన, కేశవుఁ దల్చ వ్యర్థమే!
ద్రఢిమను జీమ తుమ్మఁగ బదాబదలయ్యె మృగేంద్రసంఘముల్!
తెల్ల దొరలను వణికించి తెగువ జూపి
రిప్లయితొలగించండిపోరు సల్పిన యల్లూరి వీరు డనె డు
చీమ తుమ్మిన సింహ ముల్ సెదరె జడిసి
ననుచు బొగడి రి యాంధ్రు లా ఘను ని మిగుల
రిప్లయితొలగించండితమ్మి మొగ్గర మందున దారకుడను
గాంచి కురు వీరు లెల్లరు కలక చెంది
రనుచు తెలుపుచు బుధుడనె నరయ నదియె
చీమ తుమ్మెను సింహముల్ సెదరె జడిసి.
దృఢమది తమ్మి మొగ్గరము దీమతి ద్రోణుడు పన్న నేమిరా
దృఢమగు చిత్తమందు నని ద్వేషిల గూల్చగ నెంచు వానికిన్
జడిసి కుయుక్తి పన్నిరట సంగర మందున నయ్యదిన్ గనన్
ద్రఢిమను జీమ తుమ్మఁగ బదాబదలయ్యె మృగేంద్రసంఘముల్.
రిప్లయితొలగించండితమ్మి మొగ్గర మందున దారకుడను
గాంచి కురు వీరు లెల్లరు కలక చెంది
రనుచు తెలుపుచు బుధుడనె నరయ నదియె
చీమ తుమ్మెను సింహముల్ సెదరె జడిసి.
దృఢమది తమ్మి మొగ్గరము దీమతి ద్రోణుడు పన్న నేమిరా
దృఢమగు చిత్తమందు నని ద్వేషిల గూల్చగ నెంచు వానికిన్
జడిసి కుయుక్తి పన్నిరట సంగర మందున నయ్యదిన్ గనన్
ద్రఢిమను జీమ తుమ్మఁగ బదాబదలయ్యె మృగేంద్రసంఘముల్.
రామరాజు వచ్చెనటంచు రక్షకభటు
రిప్లయితొలగించండిలకొకడు దెలిపినంత వారదిరిపడుచు
పరుగు లెత్తిన వైనము పరిగణింప
చీమ తుమ్మెను సింహముల్ సెదరె జడిసి
దృఢమతియైనవాడు కడు ధీరుడు విప్లవ శక్తి రామరా
జు ఢమఢమార్భటమ్ములను జూపుచు వచ్చెనటంచు బొంకగా
దృఢముగ నమ్మి పారిరట తెంపరి రక్షకబంట్లు పోల్పఁగా
ద్రఢిమను జీమ తుమ్మఁగ బదాబదలయ్యె మృగేంద్రసంఘముల్
[విప్లవజ్యోతి అల్లూరి సీతారామరాజు పట్ల అప్పటి పోలీసులతీరు]
తే॥ బాలల లఘుచిత్రములొప్పు బహు వినోద
రిప్లయితొలగించండిభరితమై యసహజమునేపారుచుండ
నట్టి యొక్క చిత్రమునందు గట్టిగాను
జీమ తుమ్మెను సింహముల్ సెదరె జడిసి
చం॥ ద్రఢిమగ బాలురెల్ల కనఁ దాల్చ వినోదము వింత పద్ధతుల్
దృఢముగ నిశ్చయించి యటు తృప్తిని మోదము మీరఁ బొందఁగన్
దృఢముగ నూహకందనటు తీసిరి చిత్రమునందుఁ గాంచఁగన్
ద్రఢిమను జీమ తుమ్మఁగఁ బదాబదలయ్యె మృగేంద్ర సంఘముల్
ద్రఢిమ firmness tightness
ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
రిప్లయితొలగించండిచం:దృఢు డగు బ్రహ్మరాక్షసుని నెక్కగ జీమల దండు వానిదౌ
రిప్లయితొలగించండిదృఢమగు నిద్ర మాయ మయి "యేమిది?" యంచను లోపునన్ భళా
దృఢమగ వాని నాసికను నే గుహయో యని దూరి నంతనే
ద్రఢిమను జీమ తుమ్మఁగ బదాబదలయ్యె మృగేంద్రసంఘముల్”
1)తే.గీ:జంతుశాలలో నధికారి జంతువులకు
రిప్లయితొలగించండినోగిరము మందు లిచ్చుచు సాగుచుండ
నతని నాసిక లో జేరి నంత నొక్క
చీమ, తుమ్మెను, సింహముల్ సెదరె జడి
వేయి యేనుఁగుల బలము వెలఁది కొసఁగె
రిప్లయితొలగించండినౌర పంకజ గర్భుఁడు కోరి నంత
నారి రక్కసి తాటక, నసను దూఱఁ
జీమ, తుమ్మెను సింహముల్ సెదరె జడిసి
వెడల నరుం డెదిర్ప పర వీరుల సంగర రంగ మందు మ్రోఁ
గ ఢమఢమధ్వనుల్ పుడమి కాంతుఁడు సైంధవుఁ డేయ బాణముల్
దృఢముగ నిల్వ లేక కడు దీనులు పాండవు లైరి యక్కటా
ద్రఢిమను జీమ తుమ్మఁగ బదాబదలయ్యె మృగేంద్ర సంఘముల్
మీ రెండు పూరణలు అద్భుతంగా ఉన్నవి. అభినందనలు.
తొలగించండిలీకు పేపరు గూర్చియు లేపి జనుల
రిప్లయితొలగించండిధర్న జేయించె దిప్కెతా ధైర్యముగను
పెక్కు రోజులు, సచివులు వెరచిరరరె!
చీమ తుమ్మెను సింహముల్ సెదరె జడిసి
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండి
రిప్లయితొలగించండిపిన్నక నాగేశ్వరరావు.
హైదరాబాద్.
కాయకష్టము జేసి పగలు నలసిన
తరి నిదుర పోవుచుండెడు తరుణమందు
దూరగా నపు డేనుగు తొండమందు
చీమ; తుమ్మెను; సింహముల్ సెదరె జడిసి.