21-8-2026 (శుక్రవారం)
ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...
“పడఁతుక నిజపతినిఁ జంపి పావన యయ్యెన్”
(లేదా...)
“పడఁతి నిజేశ్వరున్ యముని పాలికిఁ బంపి పవిత్ర యయ్యెనే”
(ఉప్పలధడియం భరతశర్మ శతావధానంలో తంత్రవహి శ్రీరామచంద్రమూర్తి గారి సమస్య)
కందంవిడలేనను కీచకునిన్ నడిపించి వగలుఁ జిలుకుచు నర్తన శాలన్బడగొట్ట నేర్పరిచియున్బడఁతుక నిజపతినిఁ, జంపి పావన యయ్యెన్
చంపకమాలనడకల హంసవేయనుచు నామది దోచితివంచు మాలినిన్దడఁబడఁ జేయఁ గీచకుఁడు, దాపున ముచ్చట దీర్చు వంక లోబడగనె నృత్యశాలఁ బడఁ బాచిక వేసియు నుంచి చీరతోపడఁతి నిజేశ్వరున్, యముని పాలికిఁ బంపి పవిత్ర యయ్యెనే
వెడకాలమయ్యె బెండ్లయి , కడురీతుల గుమి జెరుపరి కాంతుడనంగన్ చెడినది చాలునిక యనుచు పడఁతుక నిజపతినిఁ జంపి పావన యయ్యెన్”
గడసరి యగు నరకుని దం దడి సాగెడి వేళ బాలితాకగ సధ్యం చుడు కాపాడుట కై యా పడఁతుక నిజపతినిఁ, జంపి పావన యయ్యెన్.విడువక కంకపత్రముల ఫేరవుడా నర కుండు రాల్చి దృం భుడగుచు రెచ్చినంత వ్రజ మోహను డంతట మూర్ఛబోవగా నడలక రుద్ర రూపమున నావహ మందున బ్రోచ నెంచుచున్ పడఁతి నిజేశ్వరున్, యముని పాలికిఁ బంపి పవిత్ర యయ్యెనే.
-అడరె బరిడ పురుగు! బిలిచెపడఁతుక నిజపతినిఁ; జంపి పావన యయ్యెన్వడి యాతడు మగడనుచు తన డాక జూపగలిగెనొక నవకాశమయో
కందం
రిప్లయితొలగించండివిడలేనను కీచకునిన్
నడిపించి వగలుఁ జిలుకుచు నర్తన శాలన్
బడగొట్ట నేర్పరిచియున్
బడఁతుక నిజపతినిఁ, జంపి పావన యయ్యెన్
చంపకమాల
తొలగించండినడకల హంసవేయనుచు నామది దోచితివంచు మాలినిన్
దడఁబడఁ జేయఁ గీచకుఁడు, దాపున ముచ్చట దీర్చు వంక లో
బడగనె నృత్యశాలఁ బడఁ బాచిక వేసియు నుంచి చీరతో
పడఁతి నిజేశ్వరున్, యముని పాలికిఁ బంపి పవిత్ర యయ్యెనే
వెడకాలమయ్యె బెండ్లయి ,
రిప్లయితొలగించండికడురీతుల గుమి జెరుపరి కాంతుడనంగన్
చెడినది చాలునిక యనుచు
పడఁతుక నిజపతినిఁ జంపి పావన యయ్యెన్”
రిప్లయితొలగించండిగడసరి యగు నరకుని దం
దడి సాగెడి వేళ బాలితాకగ సధ్యం
చుడు కాపాడుట కై యా
పడఁతుక నిజపతినిఁ, జంపి పావన యయ్యెన్.
విడువక కంకపత్రముల ఫేరవుడా నర కుండు రాల్చి దృం
భుడగుచు రెచ్చినంత వ్రజ మోహను డంతట మూర్ఛబోవగా
నడలక రుద్ర రూపమున నావహ మందున బ్రోచ నెంచుచున్
పడఁతి నిజేశ్వరున్, యముని పాలికిఁ బంపి పవిత్ర యయ్యెనే.
-
రిప్లయితొలగించండిఅడరె బరిడ పురుగు! బిలిచె
పడఁతుక నిజపతినిఁ; జంపి పావన యయ్యెన్
వడి యాతడు మగడనుచు త
న డాక జూపగలిగెనొక నవకాశమయో