3-9-2026 (గురువారం)
ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...
“సిగ లేని సతికిఁ బువులిడ శ్రేయమ్మె యగున్”
(లేదా...)
“సిగ లేనట్టి పడంతికిన్ బువులిడన్ శ్రేయమ్ము మోదంబగున్”
(పట్వర్ధన్ గారి శతావధానంలో కొండా యాదగిరి గారి సమస్య)
నగరిని నా రీతిగ దన మగనిని పూజించు మగువ మరువడు ననుచున్పొగరు మనసు నందున వాసిగ లేని సతికిఁ బువులిడ శ్రేయమ్మె యగున్
కందంమగనిని నుసిగొల్పునటులఁదగులుచుఁ బిరుదుల జడలవి తప్పెటఁగొట్టన్రగులదె పతికిన్! కృత్రిమ సిగ లేని సతికిఁ బువులిడ శ్రేయమ్మె యగున్!మత్తేభవిక్రీడితము మగడున్ దాపము నందునన్ మునుగ భామారత్నమాడంగనేదగులన్ మాటికి మాటికిన్ బిరుదులన్ దప్పెట్ల మోగించుచున్రగులన్ జేయదె? వేణియా మగనికన్ రంజించుచున్! బెట్టుడున్సిగ లేనట్టి పడంతికిన్ బువులిడన్ శ్రేయమ్ము మోదంబగున్!
మగువలు సౌభాగ్య మనుచు సిగలో ధరియింత్రు పూలు, చేతనట క్రయిం పగ నాదాయమ్మది వా సిగ లేని సతికిఁ బువులిడ శ్రేయమ్మె యగున్.మగువల్ సౌభగమంచు నెంచెద రిలన్ మాంగళ్యమున్ గంఠమున్ సిగలో పూవులు ఫాలమందు కనగన్ చిత్రమ్ము నే దాల్చుటే,జగతిన్ స్త్రీలను గౌరవించుచు నిటన్ సంపాదనన్ గాంచ వా సిగ లేనట్టి పడంతికిన్ బువులిడన్ శ్రేయమ్ము మోదంబగున్.
సిగలో పూలే వలపులసెగలే రేపుట సహజము చిత్తము నందున్మగనిపయి నలుకతో సరసిగ లేని సతికిఁ బువులిడ శ్రేయమ్మె యగున్పగలేవెన్నెల సేయమంచు సతమున్ వాక్రుచ్చుచున్ బ్రేమతోమగడేభార్యకు మల్లెపూలనిడు సమ్మానింప భావించుచున్దగునేనీకివి యంచు యొప్పిదముగా తానెంచుచున్ వన్నెవాసిగ లేనట్టి పడంతికిన్ బువులిడన్ శ్రేయమ్ము మోదంబగున్
-భగభగ బంగారమ్ము! బడుగుజీవికి మాటలే గడు పసిడి గానన్ నగలు కొనెదనని చెవిలో,..“సిగ లేని సతికిఁ,... బువులిడ శ్రేయమ్మె యగున్
సిగలో బువ్వులె కోమలాంగులకిలన్ చేకూర్చునందమ్ము వాసిగ స్వర్ణాభరణమ్ములైన సతికిన్ జేయించ సమ్మోదమేసిగ లేనట్టి పడంతికిన్ బువులిడన్ శ్రేయమ్ము మోదంబగున్జగదీశున్ గొలువన్ ప్రసూనములతో సద్భక్తి యేపారగన్
నగలే కైసేఁత యగునుసిగ లేని సతికిఁ, బువులిడ శ్రేయమ్మె యగున్భగవానుని పూజింపఁగమగువ మనసు దెలిసి మగఁడు మసలుట మేలౌ
కం:మగడు గతించగ పోయెనుసిగయును, నా పేదరాలి చేతికి నిడుడీ మిగిలిన కాలీ ఫ్లవరునుసిగ లేని సతికిఁ బువులిడ శ్రేయమ్మె యగున్”(వితంతువు కు కాలీ ఫ్లవర్ వండుకోటానికి ఇవ్వ వచ్చు కదా! అది పువ్వే. )
మ:సిగయే లేని వితంతు వామె బతుకున్ చేమంతి పూ లమ్ముచున్మిగులన్ బూచెను పుష్పముల్ పెరటిలో మీ రెన్నిటిన్ దాల్చినన్మిగులున్ పెక్కుగ, వాని నామె కిడరే, మే లైన సాహాయ్య మౌసిగ లేనట్టి పడంతికిన్ బువులిడన్ శ్రేయమ్ము మోదంబగున్”(ఆ వితంతువు పూలు పెట్టుకోదు కానీ అమ్ముకోటానికి పనికొస్తాయి కదా!)
మ॥ మగనిన్ మెచ్చుచు గౌరవమ్మునిడి నేమంబొంది శ్రద్ధావిధిన్వగలన్ జూపక బాధ్యతా పరిని సంభావించి చేదోడుగన్నగవుల్ బంచుచుఁ గేశముల్ తలనటుల్ నవ్యంబునై యొప్ప బోసిగ లేనట్టి పడంతికిన్ బువులిడన్ శ్రేయంబు మోదంబగున్
హమ్మయ్య !పగలే వన్నెల చూపు తోడు మగడిన్ బాళిన్ ప్రకాశమ్ముగాజగమే వూయల గాను జేయ బిలువన్ జాప్యమ్ములేలా!వడిన్మొగుడై బుట్టను తప్పుగాదు చెవిలో మూరంత తోరమ్ముతోసిగ లేనట్టి పడంతికిన్ బువులిడన్ శ్రేయమ్ము మోదంబగున్
నిగనిగ మెరిసే కురులవి సొగసుగ సంస్కార ముగను శోభలు విధమై యగపడ గా మగడా బో సిగ లేని సతికి బువు లిడ శ్రేయ మ్మె యగున్
మగువల కిల జుట్టందము తగు రీతినిఁ బూల చెండు తల నిడ నందమ్ముగఁ గన్పడంగ నల్పపు సిగ లేని సతికిఁ బువు లిడ శ్రేయమ్మె యగున్ మగువల్ మెత్తురు మిక్కుటమ్ముగను సమ్యగ్రీతి భూషింప వాసిగ స్వీయోన్నత మూర్ధజమ్ములను నాక్షేపింప రాదేరికిందగ నా కాంత కొసంగ నందమును మూర్ధం బందుఁ బుష్పాలి వాసిగ లేనట్టి పడంతికిం బువు లిడన్ శ్రేయమ్ము మోదం బగున్
పగలే వెన్నెల కాయగా మగువ తాఁ బ్రాణేశునిన్ దల్చుచున్ సెగలన్ గ్రక్కగ మేను మారుడు వడిన్ చిత్తమ్ములో చేరగా స్వగృహమ్మందున చొక్క, భర్త కరమున్ బంధించుచున్ గొప్పు వా సిగ లేనట్టి పడంతికిన్ బువులిడన్ శ్రేయమ్ము మోదంబగున్
పిన్నక నాగేశ్వరరావు.హైదరాబాద్.తగిన సవరమ్ము నొసగుచుసిగ లేని సతికిఁ;బువులిడ శ్రేయమ్మె యగున్నగవులు చిందించుచు సతిపొగడెను సమయానుకూల పురుషుం డనుచున్.
నగరిని నా రీతిగ దన
రిప్లయితొలగించండిమగనిని పూజించు మగువ మరువడు ననుచున్
పొగరు మనసు నందున వా
సిగ లేని సతికిఁ బువులిడ శ్రేయమ్మె యగున్
కందం
రిప్లయితొలగించండిమగనిని నుసిగొల్పునటులఁ
దగులుచుఁ బిరుదుల జడలవి తప్పెటఁగొట్టన్
రగులదె పతికిన్! కృత్రిమ
సిగ లేని సతికిఁ బువులిడ శ్రేయమ్మె యగున్!
మత్తేభవిక్రీడితము
మగడున్ దాపము నందునన్ మునుగ భామారత్నమాడంగనే
దగులన్ మాటికి మాటికిన్ బిరుదులన్ దప్పెట్ల మోగించుచున్
రగులన్ జేయదె? వేణియా మగనికన్ రంజించుచున్! బెట్టుడున్
సిగ లేనట్టి పడంతికిన్ బువులిడన్ శ్రేయమ్ము మోదంబగున్!
రిప్లయితొలగించండిమగువలు సౌభాగ్య మనుచు
సిగలో ధరియింత్రు పూలు, చేతనట క్రయిం
పగ నాదాయమ్మది వా
సిగ లేని సతికిఁ బువులిడ శ్రేయమ్మె యగున్.
మగువల్ సౌభగమంచు నెంచెద రిలన్ మాంగళ్యమున్ గంఠమున్
సిగలో పూవులు ఫాలమందు కనగన్ చిత్రమ్ము నే దాల్చుటే,
జగతిన్ స్త్రీలను గౌరవించుచు నిటన్ సంపాదనన్ గాంచ వా
సిగ లేనట్టి పడంతికిన్ బువులిడన్ శ్రేయమ్ము మోదంబగున్.
సిగలో పూలే వలపుల
రిప్లయితొలగించండిసెగలే రేపుట సహజము చిత్తము నందున్
మగనిపయి నలుకతో సర
సిగ లేని సతికిఁ బువులిడ శ్రేయమ్మె యగున్
పగలేవెన్నెల సేయమంచు సతమున్ వాక్రుచ్చుచున్ బ్రేమతో
మగడేభార్యకు మల్లెపూలనిడు సమ్మానింప భావించుచున్
దగునేనీకివి యంచు యొప్పిదముగా తానెంచుచున్ వన్నెవా
సిగ లేనట్టి పడంతికిన్ బువులిడన్ శ్రేయమ్ము మోదంబగున్
-
రిప్లయితొలగించండిభగభగ బంగారమ్ము! బ
డుగుజీవికి మాటలే గడు పసిడి గానన్
నగలు కొనెదనని చెవిలో,..
“సిగ లేని సతికిఁ,... బువులిడ శ్రేయమ్మె యగున్
సిగలో బువ్వులె కోమలాంగులకిలన్ చేకూర్చునందమ్ము వా
రిప్లయితొలగించండిసిగ స్వర్ణాభరణమ్ములైన సతికిన్ జేయించ సమ్మోదమే
సిగ లేనట్టి పడంతికిన్ బువులిడన్ శ్రేయమ్ము మోదంబగున్
జగదీశున్ గొలువన్ ప్రసూనములతో సద్భక్తి యేపారగన్
నగలే కైసేఁత యగును
రిప్లయితొలగించండిసిగ లేని సతికిఁ, బువులిడ శ్రేయమ్మె యగున్
భగవానుని పూజింపఁగ
మగువ మనసు దెలిసి మగఁడు మసలుట మేలౌ
కం:మగడు గతించగ పోయెను
రిప్లయితొలగించండిసిగయును, నా పేదరాలి చేతికి నిడుడీ
మిగిలిన కాలీ ఫ్లవరును
సిగ లేని సతికిఁ బువులిడ శ్రేయమ్మె యగున్”
(వితంతువు కు కాలీ ఫ్లవర్ వండుకోటానికి ఇవ్వ వచ్చు కదా! అది పువ్వే. )
మ:సిగయే లేని వితంతు వామె బతుకున్ చేమంతి పూ లమ్ముచున్
రిప్లయితొలగించండిమిగులన్ బూచెను పుష్పముల్ పెరటిలో మీ రెన్నిటిన్ దాల్చినన్
మిగులున్ పెక్కుగ, వాని నామె కిడరే, మే లైన సాహాయ్య మౌ
సిగ లేనట్టి పడంతికిన్ బువులిడన్ శ్రేయమ్ము మోదంబగున్”
(ఆ వితంతువు పూలు పెట్టుకోదు కానీ అమ్ముకోటానికి పనికొస్తాయి కదా!)
మ॥ మగనిన్ మెచ్చుచు గౌరవమ్మునిడి నేమంబొంది శ్రద్ధావిధిన్
రిప్లయితొలగించండివగలన్ జూపక బాధ్యతా పరిని సంభావించి చేదోడుగన్
నగవుల్ బంచుచుఁ గేశముల్ తలనటుల్ నవ్యంబునై యొప్ప బో
సిగ లేనట్టి పడంతికిన్ బువులిడన్ శ్రేయంబు మోదంబగున్
హమ్మయ్య !
రిప్లయితొలగించండిపగలే వన్నెల చూపు తోడు మగడిన్ బాళిన్ ప్రకాశమ్ముగా
జగమే వూయల గాను జేయ బిలువన్ జాప్యమ్ములేలా!వడిన్
మొగుడై బుట్టను తప్పుగాదు చెవిలో మూరంత తోరమ్ముతో
సిగ లేనట్టి పడంతికిన్ బువులిడన్ శ్రేయమ్ము మోదంబగున్
నిగనిగ మెరిసే కురులవి
రిప్లయితొలగించండిసొగసుగ సంస్కార ముగను శోభలు విధమై
యగపడ గా మగడా బో
సిగ లేని సతికి బువు లిడ శ్రేయ మ్మె యగున్
మగువల కిల జుట్టందము
రిప్లయితొలగించండితగు రీతినిఁ బూల చెండు తల నిడ నంద
మ్ముగఁ గన్పడంగ నల్పపు
సిగ లేని సతికిఁ బువు లిడ శ్రేయమ్మె యగున్
మగువల్ మెత్తురు మిక్కుటమ్ముగను సమ్యగ్రీతి భూషింప వా
సిగ స్వీయోన్నత మూర్ధజమ్ములను నాక్షేపింప రాదేరికిం
దగ నా కాంత కొసంగ నందమును మూర్ధం బందుఁ బుష్పాలి వా
సిగ లేనట్టి పడంతికిం బువు లిడన్ శ్రేయమ్ము మోదం బగున్
పగలే వెన్నెల కాయగా మగువ తాఁ బ్రాణేశునిన్ దల్చుచున్
రిప్లయితొలగించండిసెగలన్ గ్రక్కగ మేను మారుడు వడిన్ చిత్తమ్ములో చేరగా
స్వగృహమ్మందున చొక్క, భర్త కరమున్ బంధించుచున్ గొప్పు వా
సిగ లేనట్టి పడంతికిన్ బువులిడన్ శ్రేయమ్ము మోదంబగున్
రిప్లయితొలగించండిపిన్నక నాగేశ్వరరావు.
హైదరాబాద్.
తగిన సవరమ్ము నొసగుచు
సిగ లేని సతికిఁ;బువులిడ శ్రేయమ్మె యగున్
నగవులు చిందించుచు సతి
పొగడెను సమయానుకూల పురుషుం
డనుచున్.