జీవితమున మొట్ట మొదట పావన మౌ నీ చరితను వచనంబున నీ కోవెల లో వ్రాసితి నం బా! విని నను మెచ్చు సుకవివర్యుఁ డెవండో.
జీవిత మందు ముందుగను శ్రీకర కారిణి వంచు నమ్మి నీ కోవెల జేరి నీ కృపను గోరుచు పద్యము లందు వ్రాసితిన్ బావన మైన నీ చరిత భాగ్యమటంచు దలంచి శారదాం బా! విని నన్ను మెచ్చు కవివర్యునిఁ జూపు మటంచు వేడెదన్.
గోవులశాల దరిని యవి
రిప్లయితొలగించండిత్రావుటకు జలము నమరుచ దలచుట జేతన్
మేవడిగ సలుపుటను గని
బావిని నను మెచ్చు సుకవివర్యుఁ డెవండో”
కందం
రిప్లయితొలగించండిసేవించి శారదాంబను
గావించితి ప్రౌఢ భాషఁ గావ్యములెన్నో!
భావ నిగూఢమున 'దిగుడు
బావిని' నను మెచ్చు సుకవివర్యుఁ డెవండో!
రిప్లయితొలగించండిజీవితమున మొట్ట మొదట
పావన మౌ నీ చరితను వచనంబున నీ
కోవెల లో వ్రాసితి నం
బా! విని నను మెచ్చు సుకవివర్యుఁ డెవండో.
జీవిత మందు ముందుగను శ్రీకర కారిణి వంచు నమ్మి నీ
కోవెల జేరి నీ కృపను గోరుచు పద్యము లందు వ్రాసితిన్
బావన మైన నీ చరిత భాగ్యమటంచు దలంచి శారదాం
బా! విని నన్ను మెచ్చు కవివర్యునిఁ జూపు మటంచు వేడెదన్.
[ కవి కాళిదాసు అంతరంగము... ]
రిప్లయితొలగించండిదీవెనలిడి నాలోనన్
జేవను సమకూర్చి కవిని జేసితి వనుచున్
భావించుచు వ్రాసితి నం
బా! విని నను మెచ్చు సుకవివర్యుఁ డెవండో
భావము లెన్నియో మదిని పాదుకొనంగ వరంబులిచ్చియున్
దీవన లంద జేసి నను తీరిచి దిద్దగ దీర్ఘ దర్శినై
నీవర సంగ్రహమ్మనగ నేనొక కావ్యము వ్రాసి యుంటి నం
బా! విని నన్ను మెచ్చు కవివర్యునిఁ జూపు మటంచు వేడెదన్