16, సెప్టెంబర్ 2026, బుధవారం

సమస్య - 5592

17-9-2026 (గురువారం)

ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...

“జిత్తుల నక్కలకె మిగుల జీతము దక్కున్”

(లేదా...)

“జిత్తులమారి నక్కలకు జీతము లెక్కువ ప్రజ్ఞ శూన్యమౌ”

(ఐతగోని వెంకటేశ్వర్లు గారి శతావధానంలో కవిశ్రీ సత్తిబాబు గారి సమస్య)

3 కామెంట్‌లు:

  1. చిత్తము దలచిన విధముగ
    నిత్తెము గొలువున పనులను నెరపుట యందున్
    సత్తువ జూపుచు నుండెడి
    జిత్తుల నక్కలకె మిగుల జీతము దక్కున్

    రిప్లయితొలగించండి

  2. విత్తము నెగజల్లి పరి
    స్రుత్తును ద్రావించి గెలుచు శుంఠలె గద క్ష్మా
    భృత్తులుగా వెలిగెడి యా
    జిత్తుల నక్కలకె మిగుల జీతము దక్కున్.



    కుత్తుక లుత్తరించగల క్రూర మనస్కులు దుష్ట బుద్ధితో
    విత్తము బంచి ఎన్నికల వేళ పరిస్రుత తో జనాళి నే
    మత్తున ముంచి గెల్చి యిల మానవ దేవులు గా వెలుం గెడిన్
    జిత్తులమారి నక్కలకు జీతము లెక్కువ ప్రజ్ఞ శూన్యమౌ.

    రిప్లయితొలగించండి
  3. చిత్తము దోచిన వారల
    కుత్తమ మైన పదవులని కుమతుల్ సతమున్
    దొత్తుల కిచ్చుచునుండగ
    జిత్తుల నక్కలకె మిగుల జీతము దక్కున్

    చిత్తము చిత్తమంచు తమచిత్తము గెల్చిన జంబుకాలకే
    యుత్తమ మైన పట్టమిడు వ్యూహము నేర్చిరి నేత లెల్లరున్
    దొత్తుల వోలె మారి మరి తొందరగా మది దోచువారలౌ
    జిత్తులమారి నక్కలకు జీతము లెక్కువ ప్రజ్ఞ శూన్యమౌ

    రిప్లయితొలగించండి