26, సెప్టెంబర్ 2026, శనివారం

సమస్య - 5602

27-9-2026 (ఆదివారం)

ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...

“బొమ్మకుఁ బ్రాణమ్ము వచ్చి పూజ్యత నందెన్”

(లేదా...)

“బొమ్మకుఁ బ్రాణముల్ గలిగి పూజ్యత నందెను దేవళమ్మునన్”

(ఐతగోని వెంకటేశ్వర్లు గారి శతావధానంలో భోగయగారి చం.శే. శర్మ గారి సమస్య)

2 కామెంట్‌లు:

  1. రిప్లయిలు
    1. కందం
      కమ్మని రూపము శిల్పులు
      నిమ్ముగ వాసవికిఁ గూర్చ, నీమముగన్ మం
      త్రమ్ములఁ బ్రతిష్ఠ జరుపన్
      బొమ్మకుఁ బ్రాణమ్ము వచ్చి పూజ్యత నందెన్

      ఉత్పలమాల
      కమ్మని రూపమున్ గలుగు కన్యక వా‌సవి విగ్రహమ్మునే
      యిమ్ముగ శిల్పులున్మలచ నేర్పడ,శంకరులాగమించి మం
      త్రమ్ములతోఁ ప్రతిష్ఠ జనరంజకమౌ విభవాన సల్పఁగన్
      బొమ్మకుఁ బ్రాణముల్ గలిగి పూజ్యత నందెను దేవళమ్మునన్

      తొలగించండి