13, అక్టోబర్ 2026, మంగళవారం

సమస్య - 5619

14-10-2026 (బుధవారం)

ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...

“క్రోధమే మంగళకర వాక్శుద్ధి నిడును”

(లేదా...)

“క్రోధం బెంతయొ మంగళప్రదము వాక్శుద్ధిన్ బ్రసాదించుగా”

(న.చ. సాహిత్ శతావధానంలో ఆరవల్లి శ్రీదేవి గారి సమస్య)

4 కామెంట్‌లు:

  1. నేటి మనుగడ కొరకయి నియమమైన
    పరుల దేశమందలిభాష పైననున్న
    క్రోధమే మంగళకర వాక్శుద్ధి నిడును
    సొంత మాట పలుకుటందు , సొబగు గాను

    రిప్లయితొలగించండి
  2. తేటగీతి
    సాదిగా నెంచి విలువీడ సవ్యసాచి
    ధర్మబద్ధంపు కోపాన దానవారి
    యున్నతినిడ గీతాసుధ నొలికె! నట్టి
    క్రోధమే మంగళకర వాక్శుద్ధి నిడును

    శార్దూలవిక్రీడితము
    సాధుత్వంబున సంధిలో విఫలమై సంగ్రామమున్ జేరియున్
    యోధుండై విలువీడ నర్జునుడు ధర్మోద్ధారణావేశమై
    బోధింపన్ శ్రుతి సూక్త గీత నరుడున్ బోరెంచి గెల్చెన్ విధిన్
    క్రోధం బెంతయొ మంగళప్రదము వాక్శుద్ధిన్ బ్రసాదించుగా!

    రిప్లయితొలగించండి
  3. నాటి భారత స్వాతంత్ర నదను కైన
    వీర తెలగాణ వాసుల‌ పోరుకైన
    కవులు కదనపు కవనంపు భావు కతకు
    క్రోధమే మంగళకర వాక్శుద్ధి నిడును

    రిప్లయితొలగించండి
  4. క్రోధమే కారణమగును రోదనముకు
    వేదనఁ గలిగించదనుచు వాదమేల
    హితము గూర్చునెపుడును జయింపబడినఁ
    గ్రోధమే మంగళకర వాక్శుద్ధి నిడును

    క్రోధాగారము నందు కైక పలుకుల్ కోదండ రాముండకున్
    గ్రోధంబున్ గలిగించకున్నఁ సుతుడే రోసెంగదా తల్లినే
    మేధావుల్ వచియింత్రు గాదె కినుకన్ మేండ్రించి వర్తిల్ల న
    క్రోధం బెంతయొ మంగళప్రదము వాక్శుద్ధిన్ బ్రసాదించుగా

    రిప్లయితొలగించండి