14-10-2026 (బుధవారం)
ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...
“క్రోధమే మంగళకర వాక్శుద్ధి నిడును”
(లేదా...)
“క్రోధం బెంతయొ మంగళప్రదము వాక్శుద్ధిన్ బ్రసాదించుగా”
(న.చ. సాహిత్ శతావధానంలో ఆరవల్లి శ్రీదేవి గారి సమస్య)
నేటి మనుగడ కొరకయి నియమమైన పరుల దేశమందలిభాష పైననున్న క్రోధమే మంగళకర వాక్శుద్ధి నిడునుసొంత మాట పలుకుటందు , సొబగు గాను
తేటగీతి సాదిగా నెంచి విలువీడ సవ్యసాచి ధర్మబద్ధంపు కోపాన దానవారి యున్నతినిడ గీతాసుధ నొలికె! నట్టిక్రోధమే మంగళకర వాక్శుద్ధి నిడునుశార్దూలవిక్రీడితముసాధుత్వంబున సంధిలో విఫలమై సంగ్రామమున్ జేరియున్యోధుండై విలువీడ నర్జునుడు ధర్మోద్ధారణావేశమైబోధింపన్ శ్రుతి సూక్త గీత నరుడున్ బోరెంచి గెల్చెన్ విధిన్క్రోధం బెంతయొ మంగళప్రదము వాక్శుద్ధిన్ బ్రసాదించుగా!
నాటి భారత స్వాతంత్ర నదను కైనవీర తెలగాణ వాసుల పోరుకైనకవులు కదనపు కవనంపు భావు కతకు క్రోధమే మంగళకర వాక్శుద్ధి నిడును
క్రోధమే కారణమగును రోదనముకువేదనఁ గలిగించదనుచు వాదమేలహితము గూర్చునెపుడును జయింపబడినఁ గ్రోధమే మంగళకర వాక్శుద్ధి నిడునుక్రోధాగారము నందు కైక పలుకుల్ కోదండ రాముండకున్గ్రోధంబున్ గలిగించకున్నఁ సుతుడే రోసెంగదా తల్లినే మేధావుల్ వచియింత్రు గాదె కినుకన్ మేండ్రించి వర్తిల్ల నక్రోధం బెంతయొ మంగళప్రదము వాక్శుద్ధిన్ బ్రసాదించుగా
ఆది మధ్యాంత రహితుని యనవ రతము కొలుచు మితభాషి సద్గుణ కోవిదునకు వాని సత్య శీలతయేను వదల గొట్టు క్రోధమే, మంగళకర వాక్శుద్ధి నిడును.క్రోధం బయ్యది కూడ దున్ననిక సంకోచించు వ్యక్తిత్వమే బాధల్ పెంచును నేస్తముల్ పెఱులుగా భావించి నిందింపరే క్రోధంబున్ విడి సత్య భాషణపు సద్గోష్టుల్ వరిష్టమ్ము ల క్రోధం బెంతయొ మంగళప్రదము వాక్శుద్ధిన్ బ్రసాదించుగా
నేటి మనుగడ కొరకయి నియమమైన
రిప్లయితొలగించండిపరుల దేశమందలిభాష పైననున్న
క్రోధమే మంగళకర వాక్శుద్ధి నిడును
సొంత మాట పలుకుటందు , సొబగు గాను
తేటగీతి
రిప్లయితొలగించండిసాదిగా నెంచి విలువీడ సవ్యసాచి
ధర్మబద్ధంపు కోపాన దానవారి
యున్నతినిడ గీతాసుధ నొలికె! నట్టి
క్రోధమే మంగళకర వాక్శుద్ధి నిడును
శార్దూలవిక్రీడితము
సాధుత్వంబున సంధిలో విఫలమై సంగ్రామమున్ జేరియున్
యోధుండై విలువీడ నర్జునుడు ధర్మోద్ధారణావేశమై
బోధింపన్ శ్రుతి సూక్త గీత నరుడున్ బోరెంచి గెల్చెన్ విధిన్
క్రోధం బెంతయొ మంగళప్రదము వాక్శుద్ధిన్ బ్రసాదించుగా!
నాటి భారత స్వాతంత్ర నదను కైన
రిప్లయితొలగించండివీర తెలగాణ వాసుల పోరుకైన
కవులు కదనపు కవనంపు భావు కతకు
క్రోధమే మంగళకర వాక్శుద్ధి నిడును
క్రోధమే కారణమగును రోదనముకు
రిప్లయితొలగించండివేదనఁ గలిగించదనుచు వాదమేల
హితము గూర్చునెపుడును జయింపబడినఁ
గ్రోధమే మంగళకర వాక్శుద్ధి నిడును
క్రోధాగారము నందు కైక పలుకుల్ కోదండ రాముండకున్
గ్రోధంబున్ గలిగించకున్నఁ సుతుడే రోసెంగదా తల్లినే
మేధావుల్ వచియింత్రు గాదె కినుకన్ మేండ్రించి వర్తిల్ల న
క్రోధం బెంతయొ మంగళప్రదము వాక్శుద్ధిన్ బ్రసాదించుగా
రిప్లయితొలగించండిఆది మధ్యాంత రహితుని యనవ రతము
కొలుచు మితభాషి సద్గుణ కోవిదునకు
వాని సత్య శీలతయేను వదల గొట్టు
క్రోధమే, మంగళకర వాక్శుద్ధి నిడును.
క్రోధం బయ్యది కూడ దున్ననిక సంకోచించు వ్యక్తిత్వమే
బాధల్ పెంచును నేస్తముల్ పెఱులుగా భావించి నిందింపరే
క్రోధంబున్ విడి సత్య భాషణపు సద్గోష్టుల్ వరిష్టమ్ము ల
క్రోధం బెంతయొ మంగళప్రదము వాక్శుద్ధిన్ బ్రసాదించుగా