15-10-2026 (గురువారం)
ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...
“రావణుం జంపె జానకి రాముఁడు గన”
(లేదా...)
“రావణుఁ జంపె సీత రఘురాముఁడు సూడఁగ యుద్ధభూమిలో”
(న.చ. సాహిత్ శతావధానంలో బండకాడి అంజయ్య గారి సమస్య)
వానర యోధులు జానకమ్మ తో..తేటగీతి దివ్యరూపుని రాముని దేవునిగను వినఁగఁ జెప్ప విభీషణు వినక యనినివైరి గా నిల్చి యెదిరించఁ బాపమదియెరావణుం జంపె, జానకి! రాముఁడు గన
ఉత్పలమాలపావనిఁ జేర్చి లంకకును భ్రాతలుఁ, బత్నియు వీడమన్నఁ దాఁజేవను గల్గువాడనని జేయఁగ యుద్ధము కన్ను గానకన్, 'సేవకులైన వానరులుఁ జేరియు జుట్టు మహోగ్రరూపులై', రావణుఁ జంపె, సీత! రఘురాముఁడు, 'సూడఁగ యుద్ధభూమిలో'
ధరణిజను విడి మపించగ దలచి , వెడలె లంకకు హనుమతోడుత , రణము నందు రావణుంజంపె జానకిరాముఁడు , గనజనులకూడి మెచ్చుకొనెను జానకియును
వారి రాశి దాటుచు లంక జేరనచటభండనమ్మున నా రామబాణమదియెరావణుం జంపె జానకి, రాముఁడు గనధర్మ రక్షకుడె నిజము ధరణియందు.ఆవహమందు రాక్షసుని యంతము జేయుమటంచు లంకలో పావనిచెప్పెనంచు కపిపల్కగ భండనమందు రాముడే రావణుఁ జంపె సీత, రఘురాముఁడు సూడఁగ యుద్ధభూమిలో చేవను జూపి దానవుల చెండి విభీషణు రాజుసేసెనే.
వానర యోధులు జానకమ్మ తో..
రిప్లయితొలగించండితేటగీతి
దివ్యరూపుని రాముని దేవునిగను
వినఁగఁ జెప్ప విభీషణు వినక యనిని
వైరి గా నిల్చి యెదిరించఁ బాపమదియె
రావణుం జంపె, జానకి! రాముఁడు గన
ఉత్పలమాల
తొలగించండిపావనిఁ జేర్చి లంకకును భ్రాతలుఁ, బత్నియు వీడమన్నఁ దాఁ
జేవను గల్గువాడనని జేయఁగ యుద్ధము కన్ను గానకన్,
'సేవకులైన వానరులుఁ జేరియు జుట్టు మహోగ్రరూపులై',
రావణుఁ జంపె, సీత! రఘురాముఁడు, 'సూడఁగ యుద్ధభూమిలో'
ధరణిజను విడి మపించగ దలచి , వెడలె
రిప్లయితొలగించండిలంకకు హనుమతోడుత , రణము నందు
రావణుంజంపె జానకిరాముఁడు , గన
జనులకూడి మెచ్చుకొనెను జానకియును
రిప్లయితొలగించండివారి రాశి దాటుచు లంక జేరనచట
భండనమ్మున నా రామబాణమదియె
రావణుం జంపె జానకి, రాముఁడు గన
ధర్మ రక్షకుడె నిజము ధరణియందు.
ఆవహమందు రాక్షసుని యంతము జేయుమటంచు లంకలో
పావనిచెప్పెనంచు కపిపల్కగ భండనమందు రాముడే
రావణుఁ జంపె సీత, రఘురాముఁడు సూడఁగ యుద్ధభూమిలో
చేవను జూపి దానవుల చెండి విభీషణు రాజుసేసెనే.