15, నవంబర్ 2026, ఆదివారం

సమస్య - 5651

 15-11-2026 (ఆదివారం)

ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...

"మానవతన్ విడిన వారె మాన్యు లవనిలో ”

(లేదా...)

"మానవత్వము లేని వారలె మాన్యులై వెలుగొందిరే”

(విరించి గారికి ధన్యవాదాలతో...)

3 కామెంట్‌లు:

  1. కం:ఈ నవసమాజ మందున
    హీనము గా దోచె చీర, యీ దుస్తుల తీ
    రే నను కలచెడి నో రా
    మా! నవతన్ విడిన వారె మాన్యు లవనిలో ”



    రిప్లయితొలగించండి
  2. మ.కో: దీను లెందరొ కూరుచుండగ దేవళమ్ముల ముందటన్
    కాని యైన విదల్చ జూడక కాంచనమ్మును, సొమ్ములన్
    బూని దేవున కిత్తురే? యదె పుణ్యమో? ప్రజ దృష్టి లో
    మానవత్వము లేని వారలె మాన్యులై వెలుగొందిరే!







    రిప్లయితొలగించండి
  3. వానలకై పశుబలినిడు
    మానవతన్ విడిన వారె మాన్యు లవనిలో !
    ఆనక వానలు కురియగ
    దాని వలన పంట పండి తగ్గును క్షామం

    రిప్లయితొలగించండి