15-11-2026 (ఆదివారం)
ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...
"మానవతన్ విడిన వారె మాన్యు లవనిలో ”
(లేదా...)
"మానవత్వము లేని వారలె మాన్యులై వెలుగొందిరే”
(విరించి గారికి ధన్యవాదాలతో...)
కం:ఈ నవసమాజ మందునహీనము గా దోచె చీర, యీ దుస్తుల తీ రే నను కలచెడి నో రామా! నవతన్ విడిన వారె మాన్యు లవనిలో ”
మ.కో: దీను లెందరొ కూరుచుండగ దేవళమ్ముల ముందటన్కాని యైన విదల్చ జూడక కాంచనమ్మును, సొమ్ములన్బూని దేవున కిత్తురే? యదె పుణ్యమో? ప్రజ దృష్టి లోమానవత్వము లేని వారలె మాన్యులై వెలుగొందిరే!
వానలకై పశుబలినిడు మానవతన్ విడిన వారె మాన్యు లవనిలో !ఆనక వానలు కురియగ దాని వలన పంట పండి తగ్గును క్షామం
ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
కానక మంచి చెడుల నే మానవుఁడు చరించు చుండి మనును నిరతమున్ మానవతను మంటఁ గలిపి మానవ! తన్ విడిన వారె మాన్యు లవనిలో [తన్ = తను/ తన్ను] మాననీయుల మిన్న నాఁ బది మంది మెచ్చి నుతింపఁగా దాన ధర్మము లందు నెన్నఁగ దాన కర్ణుని మించుచుం బాన భక్ష్య చయమ్ము లింపుగఁ బంచుచుం గుహ నాచరద్మానవత్వము లేని వారలె మాన్యులై వెలుఁగొందిరే [కుహనా + ఆచరత్ = కుహ నాచరత్ ; కపట బుద్ధితో స్వార్థమునకై యాచరించుచున్న]
కం:ఈ నవసమాజ మందున
రిప్లయితొలగించండిహీనము గా దోచె చీర, యీ దుస్తుల తీ
రే నను కలచెడి నో రా
మా! నవతన్ విడిన వారె మాన్యు లవనిలో ”
మ.కో: దీను లెందరొ కూరుచుండగ దేవళమ్ముల ముందటన్
రిప్లయితొలగించండికాని యైన విదల్చ జూడక కాంచనమ్మును, సొమ్ములన్
బూని దేవున కిత్తురే? యదె పుణ్యమో? ప్రజ దృష్టి లో
మానవత్వము లేని వారలె మాన్యులై వెలుగొందిరే!
వానలకై పశుబలినిడు
రిప్లయితొలగించండిమానవతన్ విడిన వారె మాన్యు లవనిలో !
ఆనక వానలు కురియగ
దాని వలన పంట పండి తగ్గును క్షామం
ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
రిప్లయితొలగించండికానక మంచి చెడుల నే
రిప్లయితొలగించండిమానవుఁడు చరించు చుండి మనును నిరతమున్
మానవతను మంటఁ గలిపి
మానవ! తన్ విడిన వారె మాన్యు లవనిలో
[తన్ = తను/ తన్ను]
మాననీయుల మిన్న నాఁ బది మంది మెచ్చి నుతింపఁగా
దాన ధర్మము లందు నెన్నఁగ దాన కర్ణుని మించుచుం
బాన భక్ష్య చయమ్ము లింపుగఁ బంచుచుం గుహ నాచర
ద్మానవత్వము లేని వారలె మాన్యులై వెలుఁగొందిరే
[కుహనా + ఆచరత్ = కుహ నాచరత్ ; కపట బుద్ధితో స్వార్థమునకై యాచరించుచున్న]