4-3-2026 (బుధవారం)కవిమిత్రులారా,ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...“భామను దూషించిరి శశిభాస్కరు లలుకన్”(లేదా...)“భామను దిట్టినారు శశిభాస్కరు లిద్దరు క్రోధచిత్తులై”
కందంఏమరి వడ్డించి సుధనుదామెఱిగింపంగ జంపి తలగామునటన్మా మా గ్రహణ కతమనుచుభామను దూషించిరి శశిభాస్కరు లలుకన్ఉత్పలమాలఏమరి చేసి వడ్డనను ఇంతిగ విష్ణువు, మారువేషమున్దామెరిగింప రాహువును దండనఁ జేయఁగ ఖండఖండమైగాముగొనంగ మా గ్రహణకారణ మయ్యె నటన్న ద్వేషమైభామను దిట్టినారు శశిభాస్కరు లిద్దరు క్రోధచిత్తులై
గాముల నిరోధన వలనతామగుపడకుండునటుల దాగెదమంతేయేమాత్రము వెరలేదనుభామను దూషించిరి శశిభాస్కరు లలుకన్
ప్రేమను తెలుపగ రాగా భామము గని భయము తోడ పారె నటంచున్ గామార్థులు మేచకమనె భామను దూషించిరి శశిభాస్కరు లలుకన్.చామన వర్ణమందుగల చక్కని చుక్క యటంచు నెంచి వా రామెకు ప్రేమ సంగతిని యాదర మందున తెల్ప జేరగా భామము గాంచి భీతిలుచు పారిన యట్టి రజో రసమ్మనే భామను దిట్టినారు శశిభాస్కరు లిద్దరు క్రోధచిత్తులై.
కామిని వివరములు దెలిసెనామెను భాస్కరుడు పెండ్లి యాడిన పిదపన్భామకి భర్త శశియనుచుభామను దూషించిరి శశిభాస్కరు లలుకన్ప్రేమను వెల్లడించగనె వేగమె కాముకి సమ్మతింపగాభామను బెండ్లియాడెనట భాస్కరుడొక్కడు జ్ఞానశూన్యుడైకాముకి వల్లభుండు శశి కన్యులు చెప్పిరి ఘోరకృత్యమున్భామను దిట్టినారు శశిభాస్కరు లిద్దరు క్రోధచిత్తులై
ప్రేమించెను మొదట శశినిభామామణి మోసగించి భాస్కరుఁతోడన్ప్రేమను నటియింప దెలిసిభామను దూషించిరి శశిభాస్కరు లలుకన్
ప్రేమను జూపియున్ శశికి పిమ్మట వానిని మోసగించి భామామణి గూఁడె భాస్కరుని మాయల మాటలుబల్కి వానికిన్కామపిశాచిగా నెఱిఁగి గాటపు నల్కనుబూని యామెపైభామను దిట్టినారు శశిభాస్కరు లిద్దరు క్రోధచిత్తులై
కం॥ భూమినిఁ బ్రాణుల కాసర నేమముఁ దప్పక నొకఁడిడు నిత్యము, నిసిలో ధామమొసంగు నొకఁడు నేభామను దూషించిరి శశిభాస్కరు లలుకన్ఉ॥ నేమముఁ దప్పకుండ నటు నిత్యము మండుచు నగ్నిగోళమైభూమిని జీవ సంపదలు బుద్ధిగఁ గాచు నొకండు, చల్లఁగన్ సీమకు కాంతి రేఖలిడు శీతకరుండొకఁ డైనఁ దెల్పు మేభామను దిట్టినారు శశిభాస్కరు లిద్దరు క్రోధచిత్తులైధామము కాంతి
కం: "ఏమి పనిమనిషి?" వని యాభామను దూషించిరి శశిభాస్కరు లలుకంగా మట్టి చిమ్మకయె, మరియే మాత్రము నలుక రాక యింటి నలుకగన్ .(ఇక్కడ అలకట మంటే యిల్లు అలకటం.మట్టి కూదా చిమ్మకుండా, అలకటం చేత కాకుందా అలికి నందుకు శశి,భాస్కర్ అనే దంపతులు పనిమనిషిని తిట్టారు.)
లేమ గ మారిన విష్ణువు తామసు లకు సుధను బంచి తప్పొన రించె న్ నీమము చెడె ననుచయ్యె డ భామను దూషించి రి శశి భాస్కరు లలుక న్
(2)ఉ:ప్రేమను జూపుచున్ సుధను బెట్టగ మోహిని దేవతాళికిన్ క్షేమము నిచ్చినా వనుచు కేలు మొగిడ్చి ప్రశంస జేసి యాభామను, దిట్టినారు శశిభాస్కరు లిద్దరు క్రోధచిత్తులై”పాముకొనంగ రాహువును ప్రక్కన జేరగ వాని జూచుచున్.(అమృతం కోసం రాహువు తమ ప్రక్కన కూర్చోగా సూర్యచంద్రులు దూషించారు.)
లేమల నెదిరింపన్ సుత్రామునకును లేదు శక్తి రవ్యుదయమునే తా మాన్ప సతీ సుమతిన్ భామను దూషించిరి శశి భాస్కరు లలుకన్ ధీమతి! చందురుండు చనుదెంచ నొకింతయె జాగు సేయఁగా భీమ తరమ్ము వెల్గు నిడి పృథ్వికి సూర్యుఁడు విశ్రమింపఁగా భూమిని నెల్లఁ గప్పఁ దన పోడిమిఁ జాటఁగ నా నభో రజో భామను దిట్టినారు శశి భాస్కరు లిద్దఱు క్రోధ చిత్తులై
పిన్నక నాగేశ్వరరావు.హైదరాబాద్.కోమలిగా మారి హరియుగోముగ నమృతమును పంచ కూరిమితోడన్ఏమఱుచుచు నసురులకున్భామను దూషించిరి శశి భాస్కరు లలుకన్.
డా. బల్లూరి ఉమాదేవికామజనకుడైనహరియుకోమలిగా మారి సుధను కూరిమి తోడన్గోముగపంచెడితరినాభామను దూషించిరి శశి భాస్కరులలుకన్డా బల్లూరి ఉమాదేవి కోమలిపంచుచున్ సుధను కూరిమితోడసురాళికిన్వడిన్కామపు చూపులన్ విసరి కాంక్షను పెంచుచు దైత్యమూకకున్నేమరుపాటుగానొసగ నింతయుగాంచుచుసైగచేయుచున్భామనుదిట్టినారు శశిభాస్కరులిద్దరు క్రోధచిత్తులై
కందం
రిప్లయితొలగించండిఏమరి వడ్డించి సుధను
దామెఱిగింపంగ జంపి తలగామునటన్
మా మా గ్రహణ కతమనుచు
భామను దూషించిరి శశిభాస్కరు లలుకన్
ఉత్పలమాల
ఏమరి చేసి వడ్డనను ఇంతిగ విష్ణువు, మారువేషమున్
దామెరిగింప రాహువును దండనఁ జేయఁగ ఖండఖండమై
గాముగొనంగ మా గ్రహణకారణ మయ్యె నటన్న ద్వేషమై
భామను దిట్టినారు శశిభాస్కరు లిద్దరు క్రోధచిత్తులై
గాముల నిరోధన వలన
రిప్లయితొలగించండితామగుపడకుండునటుల దాగెదమంతే
యేమాత్రము వెరలేదను
భామను దూషించిరి శశిభాస్కరు లలుకన్
రిప్లయితొలగించండిప్రేమను తెలుపగ రాగా
భామము గని భయము తోడ పారె నటంచున్
గామార్థులు మేచకమనె
భామను దూషించిరి శశిభాస్కరు లలుకన్.
చామన వర్ణమందుగల చక్కని చుక్క యటంచు నెంచి వా
రామెకు ప్రేమ సంగతిని యాదర మందున తెల్ప జేరగా
భామము గాంచి భీతిలుచు పారిన యట్టి రజో రసమ్మనే
భామను దిట్టినారు శశిభాస్కరు లిద్దరు క్రోధచిత్తులై.
కామిని వివరములు దెలిసె
రిప్లయితొలగించండినామెను భాస్కరుడు పెండ్లి యాడిన పిదపన్
భామకి భర్త శశియనుచు
భామను దూషించిరి శశిభాస్కరు లలుకన్
ప్రేమను వెల్లడించగనె వేగమె కాముకి సమ్మతింపగా
భామను బెండ్లియాడెనట భాస్కరుడొక్కడు జ్ఞానశూన్యుడై
కాముకి వల్లభుండు శశి కన్యులు చెప్పిరి ఘోరకృత్యమున్
భామను దిట్టినారు శశిభాస్కరు లిద్దరు క్రోధచిత్తులై
ప్రేమించెను మొదట శశిని
రిప్లయితొలగించండిభామామణి మోసగించి భాస్కరుఁతోడన్
ప్రేమను నటియింప దెలిసి
భామను దూషించిరి శశిభాస్కరు లలుకన్
ప్రేమను జూపియున్ శశికి పిమ్మట వానిని మోసగించి భా
రిప్లయితొలగించండిమామణి గూఁడె భాస్కరుని మాయల మాటలుబల్కి వానికిన్
కామపిశాచిగా నెఱిఁగి గాటపు నల్కనుబూని యామెపై
భామను దిట్టినారు శశిభాస్కరు లిద్దరు క్రోధచిత్తులై
కం॥ భూమినిఁ బ్రాణుల కాసర
రిప్లయితొలగించండినేమముఁ దప్పక నొకఁడిడు నిత్యము, నిసిలో
ధామమొసంగు నొకఁడు నే
భామను దూషించిరి శశిభాస్కరు లలుకన్
ఉ॥ నేమముఁ దప్పకుండ నటు నిత్యము మండుచు నగ్నిగోళమై
భూమిని జీవ సంపదలు బుద్ధిగఁ గాచు నొకండు, చల్లఁగన్
సీమకు కాంతి రేఖలిడు శీతకరుండొకఁ డైనఁ దెల్పు మే
భామను దిట్టినారు శశిభాస్కరు లిద్దరు క్రోధచిత్తులై
ధామము కాంతి
కం: "ఏమి పనిమనిషి?" వని యా
రిప్లయితొలగించండిభామను దూషించిరి శశిభాస్కరు లలుకం
గా మట్టి చిమ్మకయె, మరి
యే మాత్రము నలుక రాక యింటి నలుకగన్ .
(ఇక్కడ అలకట మంటే యిల్లు అలకటం.మట్టి కూదా చిమ్మకుండా, అలకటం చేత కాకుందా అలికి నందుకు శశి,భాస్కర్ అనే దంపతులు పనిమనిషిని తిట్టారు.)
లేమ గ మారిన విష్ణువు
రిప్లయితొలగించండితామసు లకు సుధను బంచి తప్పొన రించె న్
నీమము చెడె ననుచయ్యె డ
భామను దూషించి రి శశి భాస్కరు లలుక న్
(2)ఉ:ప్రేమను జూపుచున్ సుధను బెట్టగ మోహిని దేవతాళికిన్
రిప్లయితొలగించండిక్షేమము నిచ్చినా వనుచు కేలు మొగిడ్చి ప్రశంస జేసి యా
భామను, దిట్టినారు శశిభాస్కరు లిద్దరు క్రోధచిత్తులై”
పాముకొనంగ రాహువును ప్రక్కన జేరగ వాని జూచుచున్.
(అమృతం కోసం రాహువు తమ ప్రక్కన కూర్చోగా సూర్యచంద్రులు దూషించారు.)
లేమల నెదిరింపన్ సు
రిప్లయితొలగించండిత్రామునకును లేదు శక్తి రవ్యుదయమునే
తా మాన్ప సతీ సుమతిన్
భామను దూషించిరి శశి భాస్కరు లలుకన్
ధీమతి! చందురుండు చనుదెంచ నొకింతయె జాగు సేయఁగా
భీమ తరమ్ము వెల్గు నిడి పృథ్వికి సూర్యుఁడు విశ్రమింపఁగా
భూమిని నెల్లఁ గప్పఁ దన పోడిమిఁ జాటఁగ నా నభో రజో
భామను దిట్టినారు శశి భాస్కరు లిద్దఱు క్రోధ చిత్తులై
రిప్లయితొలగించండిపిన్నక నాగేశ్వరరావు.
హైదరాబాద్.
కోమలిగా మారి హరియు
గోముగ నమృతమును పంచ కూరిమితోడన్
ఏమఱుచుచు నసురులకున్
భామను దూషించిరి శశి భాస్కరు లలుకన్.
డా. బల్లూరి ఉమాదేవి
రిప్లయితొలగించండికామజనకుడైనహరియు
కోమలిగా మారి సుధను కూరిమి తోడన్
గోముగపంచెడితరినా
భామను దూషించిరి శశి భాస్కరులలుకన్
డా బల్లూరి ఉమాదేవి
కోమలిపంచుచున్ సుధను కూరిమితోడసురాళికిన్వడిన్
కామపు చూపులన్ విసరి కాంక్షను పెంచుచు దైత్యమూకకున్
నేమరుపాటుగానొసగ నింతయుగాంచుచుసైగచేయుచున్
భామనుదిట్టినారు శశిభాస్కరులిద్దరు క్రోధచిత్తులై