7-3-2026 (శనివారం)కవిమిత్రులారా,ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...“బండబూతులఁ బలికెను పండితుండు”(లేదా...)“పలికెను బండబూతులను పండితుఁ డౌర సభాంతరమ్మునన్”
తేటగీతిభాష భూషణమౌనను భావనమునవైరివర్గమ్ము చెలరేగి వాగెననినవిజ్ఞుఁడన సభామర్యాద వెలయ, వీడిబండబూతులఁ, బలికెను పండితుండుచంపకమాలతలచని రీతిగన్ బదవి దక్కియు నేతఁగ గద్దెనెక్కియున్విలువలు వీడి దోచుకొని, భీతిని కంపనమొంద యెన్నికల్కలవర పెట్ట, నోటమిని గానెడు శంకను వైరినెంచుచున్బలికెను బండబూతులను! పండితుఁ డౌర? సభాంతరమ్మునన్!
వారుణిని గ్రోలి మత్తు లో వాగ నేల నిట్టి మాటలు నమ్మెడి హీన గుణుని యిలను గాంచగ లేమంటి మెప్పుడోయి బండబూతులఁ బలికెను పండితుండు.అలుకను బూని మంత్రి యొక యల్పుని గైకొని వచ్చి యాతడే పలువిధ మైన శాస్త్రములు వ్యాకర నమ్ముల కోవిదుండనన్ వలము నెఱుంగనట్టి యడిబండ యతండట రాజు సన్నిధిన్ బలికెను బండబూతులను పండితుఁ డౌర సభాంతరమ్మునన్.
బండ బూతుల నిచ్చిరి పండితునకుదత్తపదముల తోడఁ బద్యమ్ము నల్లమనుచు వేరొక యర్థము తనరునటులబండబూతులఁ బలికెను పండితుండువిలవిలలాడు నాతడని పిచ్చిగ నెంచిన బండబూతులన్గలకలమొప్ప దత్తపది గానిడి పద్యము చెప్పుమన్న తాఁజిలిబిలివోవు పోడిమిని శీఘ్రమె వేరొక యర్థ మీయగాపలికెను బండబూతులను పండితుఁ డౌర సభాంతరమ్మునన్
తేటగీతి:పండితుఁడుగాని యతఁడొక వ్యసనపరుఁడుకల్లు చవిగొన మైకము గ్రమ్మినంతనిచ్చవచ్చిన రీతిగా పెచ్చుమీరిబండబూతులఁ బలికెను పండితుండుచంపకమాల:పలువురుమెచ్చురీతి తనపాండితిఁజూపెడు సత్కవీశుడేతెలియును వేదశాస్త్రములు తెల్లముగా మరి ఖర్మమేమిటోసలుపుచు దుష్ట మానవుల సంగతి మద్యము గ్రోలి మత్తునన్బలికెను బండబూతులను పండితుఁ డౌర సభాంతరమ్మునన్
తేటగీతి
రిప్లయితొలగించండిభాష భూషణమౌనను భావనమున
వైరివర్గమ్ము చెలరేగి వాగెననిన
విజ్ఞుఁడన సభామర్యాద వెలయ, వీడి
బండబూతులఁ, బలికెను పండితుండు
చంపకమాల
తలచని రీతిగన్ బదవి దక్కియు నేతఁగ గద్దెనెక్కియున్
విలువలు వీడి దోచుకొని, భీతిని కంపనమొంద యెన్నికల్
కలవర పెట్ట, నోటమిని గానెడు శంకను వైరినెంచుచున్
బలికెను బండబూతులను! పండితుఁ డౌర? సభాంతరమ్మునన్!
రిప్లయితొలగించండివారుణిని గ్రోలి మత్తు లో వాగ నేల
నిట్టి మాటలు నమ్మెడి హీన గుణుని
యిలను గాంచగ లేమంటి మెప్పుడోయి
బండబూతులఁ బలికెను పండితుండు.
అలుకను బూని మంత్రి యొక యల్పుని గైకొని వచ్చి యాతడే
పలువిధ మైన శాస్త్రములు వ్యాకర నమ్ముల కోవిదుండనన్
వలము నెఱుంగనట్టి యడిబండ యతండట రాజు సన్నిధిన్
బలికెను బండబూతులను పండితుఁ డౌర సభాంతరమ్మునన్.
బండ బూతుల నిచ్చిరి పండితునకు
రిప్లయితొలగించండిదత్తపదముల తోడఁ బద్యమ్ము నల్ల
మనుచు వేరొక యర్థము తనరునటుల
బండబూతులఁ బలికెను పండితుండు
విలవిలలాడు నాతడని పిచ్చిగ నెంచిన బండబూతులన్
గలకలమొప్ప దత్తపది గానిడి పద్యము చెప్పుమన్న తాఁ
జిలిబిలివోవు పోడిమిని శీఘ్రమె వేరొక యర్థ మీయగా
పలికెను బండబూతులను పండితుఁ డౌర సభాంతరమ్మునన్
తేటగీతి:
రిప్లయితొలగించండిపండితుఁడుగాని యతఁడొక వ్యసనపరుఁడు
కల్లు చవిగొన మైకము గ్రమ్మినంత
నిచ్చవచ్చిన రీతిగా పెచ్చుమీరి
బండబూతులఁ బలికెను పండితుండు
చంపకమాల:
పలువురుమెచ్చురీతి తనపాండితిఁజూపెడు సత్కవీశుడే
తెలియును వేదశాస్త్రములు తెల్లముగా మరి ఖర్మమేమిటో
సలుపుచు దుష్ట మానవుల సంగతి మద్యము గ్రోలి మత్తునన్
బలికెను బండబూతులను పండితుఁ డౌర సభాంతరమ్మునన్