7, మార్చి 2026, శనివారం

సమస్య - 5401

8-3-2026 (ఆదివారం)
కవిమిత్రులారా,
ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...
“తనయుల నమ్మెడి జనకులఁ దగ మెచ్చెదరే”
(లేదా...)
“తనయుల నమ్ము తండ్రుల విధమ్మును మెచ్చఁగ నొప్పు మేదినిన్”
(ఆకాశవాణి వారి సమస్య)

5 కామెంట్‌లు:

  1. రిప్లయిలు
    1. మహారాజు దశరథునితో బ్రహ్మర్షి వశిష్ఠుడు:

      కందం
      మునివరుఁ డెంచిన యజ్ఞము
      దనుజులు నాటంక పరుచ, దక్షత గావన్
      ఘనులనుచుఁ బంపఁ గోరఁగఁ
      దనయుల నమ్మెడి జనకులఁ దగ మెచ్చెదరే!

      చంపకమాల
      మునివరుడైన కౌశికుడు పూనిన యజ్ఞము నడ్డగించెడున్
      దనుజుల గూల్చి రక్షనిడు దక్షులు మీ సుతులన్న బాలలం
      చని వెనుకాడబోకుమధిపా! ఘనులొప్పఁగ మోదమొందుచున్
      దనయుల నమ్ము తండ్రుల విధమ్మును మెచ్చఁగ నొప్పు మేదినిన్!

      తొలగించండి
  2. జనులందరిలోననె దమ
    తనయుల నమ్మెడి తండ్రులఁ దగ మెచ్చెదరే!
    అనువు దొరకు వెనువెంటనె
    జననీ జనకుల వ్యయమును జార్ఛెద రుగదా

    రిప్లయితొలగించండి

  3. ధనమును వరకట్నమనుచు
    ఘనముగ పొందంగ నెంచి కల్పము నందున్
    వనితలను వధువులకు తమ
    తనయుల నమ్మెడి జనకులఁ దగ మెచ్చెదరే.


    వనితలు తెచ్చు సంపదల పైనను మోహము పెర్గి నంతటన్
    తనయుని పెండ్లి సేయుటకు దందడి కట్నము కోరు చుండుటే
    ఘనమని యెంచి హెచ్చుగను కానుక లిచ్చిన యాడ పిల్లకే
    తనయుల నమ్ము తండ్రుల విధమ్మును మెచ్చఁగ నొప్పు మేదినిన్.


    దనుజులు భగ్నమొనర్చెడి
    ముని యజ్ఞపు రక్ష గోరి పుత్రుడు రఘురా
    ముని పంప వలయు మునులకు
    తనయుల నమ్మెడి జనకులఁ దగ మెచ్చెదరే.

    ఘనమగు యజ్ఞకార్యమది కానల యందున నిర్వహింపగన్
    దనుజులు భగ్నపర్చగను దాడులు సేయుచు నుందు రైరి నీ
    తనయుని యాగ రక్షకయి తక్షణ మంపు మహోన్నతుండ్రకున్
    తనయుల నమ్ము తండ్రుల విధమ్మును మెచ్చఁగ నొప్పు మేదినిన్.

    రిప్లయితొలగించండి
  4. మునిజన యజ్ఞము గావగ
    తనయుల నంపె దశరథుఁడు తను నమ్ముటచే
    మనసున మెచ్చిరి మునులే
    తనయుల నమ్మెడి జనకులఁ దగ మెచ్చెదరే

    తనయుల పైనినమ్మకము తండ్రుల కుండుట సాజమేగదా
    తనపయి నుంచినట్టిదగు ధర్మము తప్పని వాడు రాముడే
    జననిని చంపమన్న యెడఁ జంపిన వాడన జామదగ్నియౌ
    తనయుల నమ్ము తండ్రుల విధమ్మును మెచ్చఁగ నొప్పు మేదినిన్

    రిప్లయితొలగించండి