2-3-2026 (సోమవారం)కవిమిత్రులారా,ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...“రావణు లక్ష్మణుఁ డడఁచె నరణ్యమునందున్”(లేదా...)“రావణు గెల్చె లక్ష్మణుఁ డరణ్యమునన్ ఖరదూషణుల్ గనన్”
రావణుడెటుల కడచెనోయావేదించుమని సుతుని యడిగిన తోడన్ తీవరముగ నుడివె నిటుల"రావణు లక్ష్మణుఁ డడఁచె నరణ్యమునందున్”
తావిషమును దాటుచు నట నావహమున నా దనుజుని యంతము చేసెన్ జేవగల రాము డెప్పుడు రావణు లక్ష్మణుఁ డడఁచె నరణ్యమునందున్?చేవను జూపి రాఘవుడు సీతను బంధ విముక్తి కోసమై యావహ మందు రావణుని యంతమొనర్చెను వానరాళియున్ బావని చూచుచుండ నది వాస్తవ మందురు కాదె యెప్పుడా రావణు గెల్చె లక్ష్మణుఁ డరణ్యమునన్ ఖరదూషణుల్ గనన్?
దీవికిఁ బాలకుడెవ్వడు?రావణ సుతుడింద్రజిత్తుఁ మ్రక్కిడెనెవరో?పావని రామునెచట గనెఁ?రావణు; లక్ష్మణుఁ డడఁచె; నరణ్యమునందున్పావనుడైన రాముడనిఁ బాల్గొని లంకను గెల్చెనెవ్వనిన్?బోవక నున్న శూర్పణఖ ముక్కునుఁ జెవ్వులుఁ గోసె నెవ్వడో?ఆవహమందు దాశరథి యార్భటమెవ్వరు చూచుచుండగా?రావణు గెల్చె; లక్ష్మణుఁ డరణ్యమునన్; ఖరదూషణుల్ గనన్
ఆవహమందున రాముండేవాని దునిమె? తనసుతు నెవ్వండణచెన్?రావణుఁడెట గాంచె కుజను?రావణు, లక్ష్మణుఁ డడఁచె, నరణ్యమునందున్
ఉ॥ పావనుఁ డాగుణాఢ్యుఁడు శుభాంగుఁడు రాముఁడు యుద్ధమందునన్రావణుఁ గెల్చె, లక్ష్మణుడరణ్యమునన్ ఖర దూషణుల్ గనన్రావణ దూతలంచు నటు రాముని చెంతకుఁ జేరి తెల్పఁగన్జావునుఁ గోరి వచ్చిరని సర్వులఁ ద్రుంచె మహోగ్ర రూపుఁడై
కం:భావించుచు రక్కసులన్,రావణు, లక్ష్మణుఁ డడఁచె నరణ్యమునందున్కావలెను లేడి యనియెడు నా వాంఛన్ సీత మనము నందు మెదలగన్.
దైవోపహతుం డైన మహా వీరుఁడు రామ చంద్రుఁ డగ్రజుఁ డనుపం ద్రోవఁ గబంధుని, వెదకుచు రావణు, లక్ష్మణుఁ డడఁచె నరణ్యము నందున్ ఆవిరి కాఁగఁ గోరికలె యాసురి పంపఁగఁ జుప్పనాతియే చావును గోరి రా జనుల స్థానమునం దసు రాధముల్ పగంజేవ వధించి రాఘవుఁడు చిత్రముగాఁ బదునాల్గు వేవురన్ రావణు గెల్చె, లక్ష్మణుఁ డరణ్యమునన్ ఖరదూషణుల్ గనన్
కోమలి సీతను గావ గ రావణు రాముడు దునిమెను రణము న గదరా యే విధి పలికె ద వి ట్టు ల రావణు లక్ష్మ ణు డ డ చె నరణ్య ము నందు న్?
ఉ:భావన జేసి యిర్వురవి ప్రాణములన్ హరియింతు మంచు,భీతావహు డౌను రాముడని యాశగ రా ఖరదూషణుల్ మహా రావము జేసె లక్ష్మణుడు రౌద్రత,భీకర రావ మందునన్రావణు గెల్చె లక్ష్మణుఁ డరణ్యమునన్ ఖరదూషణుల్ గనన్”(ఖరదూషణులని చూసి లక్ష్మణుడు భయంకరంగా, రౌద్రం గా గర్చించాడు.అలాంటి రావము లో లక్ష్మణుడు రావణుణ్నే మించి గెలిచాడు. )
ఆవహమందు దాశరథి యాసురు గెల్చెనతం డెవండహోభావన సేయ రామునకు ప్రాపుగ నిల్చినదెవ్వ రెచ్చటన్రావణుబంటులైనపలు రక్కసులన్ వధియించె రాముడేరావణు గెల్చె, లక్ష్మణుఁ డరణ్యమునన్, ఖరదూషణుల్ గనన్
కందంచావున సీతా! ,లక్ష్మణ! ,రావము మారీచుఁడెంచ రాముఁడను కొనన్బావని యూహ మెదలు తద్రావణు లక్ష్మణుఁ డడఁచె, నరణ్యమునందున్(హా సీతా! హా లక్ష్మణా! అని రావము చేసెడు మారీచుని సీతమ్మ ఊహలలో నడఁచినాడని భావము) ఉత్పలమాలదావములందునన్ దిరుగు దానవకోటిని శిష్టరక్షణాసేవకులట్లు రాఘవులు సీరఁగ రావము సేసి కూలరేయా విధి నొక్కరాక్షసుని నంతము జేసెడు యుద్ధమందుఁ దద్రావణు గెల్చె లక్ష్మణుఁ డరణ్యమునన్ ఖరదూషణుల్ గనన్
పిన్నక నాగేశ్వరరావు.హైదరాబాద్.ఆవహమున రాముడడచెరావణు;లక్ష్మణుఁ డడచె నరణ్యమునందున్చేవగ శూర్పణఖ నహముచావుకు దగ్గరగ నిలిపి చానను పంపెన్.
రిప్లయితొలగించండిరావణుడెటుల కడచెనో
యావేదించుమని సుతుని యడిగిన తోడన్
తీవరముగ నుడివె నిటుల
"రావణు లక్ష్మణుఁ డడఁచె నరణ్యమునందున్”
రిప్లయితొలగించండితావిషమును దాటుచు నట
నావహమున నా దనుజుని యంతము చేసెన్
జేవగల రాము డెప్పుడు
రావణు లక్ష్మణుఁ డడఁచె నరణ్యమునందున్?
చేవను జూపి రాఘవుడు సీతను బంధ విముక్తి కోసమై
యావహ మందు రావణుని యంతమొనర్చెను వానరాళియున్
బావని చూచుచుండ నది వాస్తవ మందురు కాదె యెప్పుడా
రావణు గెల్చె లక్ష్మణుఁ డరణ్యమునన్ ఖరదూషణుల్ గనన్?
దీవికిఁ బాలకుడెవ్వడు?
రిప్లయితొలగించండిరావణ సుతుడింద్రజిత్తుఁ మ్రక్కిడెనెవరో?
పావని రామునెచట గనెఁ?
రావణు; లక్ష్మణుఁ డడఁచె; నరణ్యమునందున్
పావనుడైన రాముడనిఁ బాల్గొని లంకను గెల్చెనెవ్వనిన్?
బోవక నున్న శూర్పణఖ ముక్కునుఁ జెవ్వులుఁ గోసె నెవ్వడో?
ఆవహమందు దాశరథి యార్భటమెవ్వరు చూచుచుండగా?
రావణు గెల్చె; లక్ష్మణుఁ డరణ్యమునన్; ఖరదూషణుల్ గనన్
ఆవహమందున రాముం
రిప్లయితొలగించండిడేవాని దునిమె? తనసుతు నెవ్వండణచెన్?
రావణుఁడెట గాంచె కుజను?
రావణు, లక్ష్మణుఁ డడఁచె, నరణ్యమునందున్
ఉ॥ పావనుఁ డాగుణాఢ్యుఁడు శుభాంగుఁడు రాముఁడు యుద్ధమందునన్
రిప్లయితొలగించండిరావణుఁ గెల్చె, లక్ష్మణుడరణ్యమునన్ ఖర దూషణుల్ గనన్
రావణ దూతలంచు నటు రాముని చెంతకుఁ జేరి తెల్పఁగన్
జావునుఁ గోరి వచ్చిరని సర్వులఁ ద్రుంచె మహోగ్ర రూపుఁడై
కం:భావించుచు రక్కసులన్,
రిప్లయితొలగించండిరావణు, లక్ష్మణుఁ డడఁచె నరణ్యమునందున్
కావలెను లేడి యనియెడు
నా వాంఛన్ సీత మనము నందు మెదలగన్.
దైవోపహతుం డైన మ
రిప్లయితొలగించండిహా వీరుఁడు రామ చంద్రుఁ డగ్రజుఁ డనుపం
ద్రోవఁ గబంధుని, వెదకుచు
రావణు, లక్ష్మణుఁ డడఁచె నరణ్యము నందున్
ఆవిరి కాఁగఁ గోరికలె యాసురి పంపఁగఁ జుప్పనాతియే
చావును గోరి రా జనుల స్థానమునం దసు రాధముల్ పగం
జేవ వధించి రాఘవుఁడు చిత్రముగాఁ బదునాల్గు వేవురన్
రావణు గెల్చె, లక్ష్మణుఁ డరణ్యమునన్ ఖరదూషణుల్ గనన్
కోమలి సీతను గావ గ
రిప్లయితొలగించండిరావణు రాముడు దునిమెను రణము న గదరా
యే విధి పలికె ద వి ట్టు ల
రావణు లక్ష్మ ణు డ డ చె నరణ్య ము నందు న్?
ఉ:భావన జేసి యిర్వురవి ప్రాణములన్ హరియింతు మంచు,భీ
రిప్లయితొలగించండితావహు డౌను రాముడని యాశగ రా ఖరదూషణుల్ మహా
రావము జేసె లక్ష్మణుడు రౌద్రత,భీకర రావ మందునన్
రావణు గెల్చె లక్ష్మణుఁ డరణ్యమునన్ ఖరదూషణుల్ గనన్”
(ఖరదూషణులని చూసి లక్ష్మణుడు భయంకరంగా, రౌద్రం గా గర్చించాడు.అలాంటి రావము లో లక్ష్మణుడు రావణుణ్నే మించి గెలిచాడు. )
ఆవహమందు దాశరథి యాసురు గెల్చెనతం డెవండహో
రిప్లయితొలగించండిభావన సేయ రామునకు ప్రాపుగ నిల్చినదెవ్వ రెచ్చటన్
రావణుబంటులైనపలు రక్కసులన్ వధియించె రాముడే
రావణు గెల్చె, లక్ష్మణుఁ డరణ్యమునన్, ఖరదూషణుల్ గనన్
కందం
రిప్లయితొలగించండిచావున సీతా! ,లక్ష్మణ! ,
రావము మారీచుఁడెంచ రాముఁడను కొనన్
బావని యూహ మెదలు త
ద్రావణు లక్ష్మణుఁ డడఁచె, నరణ్యమునందున్
(హా సీతా! హా లక్ష్మణా! అని రావము చేసెడు మారీచుని సీతమ్మ ఊహలలో నడఁచినాడని భావము)
ఉత్పలమాల
దావములందునన్ దిరుగు దానవకోటిని శిష్టరక్షణా
సేవకులట్లు రాఘవులు సీరఁగ రావము సేసి కూలరే
యా విధి నొక్కరాక్షసుని నంతము జేసెడు యుద్ధమందుఁ ద
ద్రావణు గెల్చె లక్ష్మణుఁ డరణ్యమునన్ ఖరదూషణుల్ గనన్
రిప్లయితొలగించండిపిన్నక నాగేశ్వరరావు.
హైదరాబాద్.
ఆవహమున రాముడడచె
రావణు;లక్ష్మణుఁ డడచె నరణ్యమునందున్
చేవగ శూర్పణఖ నహము
చావుకు దగ్గరగ నిలిపి చానను పంపెన్.